ధురంధర్ 2కి కొత్త క్లైమ్యాక్స్ ఇచ్చిన ఏఐ.. అద్భుతంగా ఉందంటున్న ఫ్యాన్స్.. హ్యాపీ ఎండింగ్ వీడియో వైరల్

ధురంధర్ 2 మూవీ క్లైమ్యాక్స్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో మార్చేశారు. ఇందులో హీరో పాత్ర హ్యాపీ ఎండింగ్ వీడియో చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్లైమ్యాక్స్ బాగుందని కామెంట్స్ చేస్తున్నారు.

Published on: Mar 23, 2026, 13:55:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తీసిన 'ధురంధర్ ద రివెంజ్' సినిమా గురించి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది. ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌ను అభిమానులు అణువణువూ పరిశీలిస్తున్నారు. ఈ క్రేజ్ మధ్యలో ఇప్పుడు ఒక ఫ్యాన్ ఏఐ వాడి క్రియేట్ చేసిన సరికొత్త క్లైమ్యాక్స్ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. డైరెక్టర్ ఇచ్చిన ఒరిజినల్ ముగింపు కంటే ఈ ఏఐ వీడియోనే ఎమోషనల్‌గా చాలా బాగుందని, కథకు కరెక్ట్ ముగింపు ఇచ్చిందని చాలామంది ఫీల్ అవుతున్నారు. అయితే ఇది చదివే ముందు కథకు సంబంధించిన స్పాయిలర్స్ ఉన్నాయని గమనించండి.

ధురంధర్ 2కి కొత్త క్లైమ్యాక్స్ ఇచ్చిన ఏఐ.. అద్భుతంగా ఉందంటున్న ఫ్యాన్స్.. హ్యాపీ ఎండింగ్ వీడియో వైరల్
ధురంధర్ 2కి కొత్త క్లైమ్యాక్స్ ఇచ్చిన ఏఐ.. అద్భుతంగా ఉందంటున్న ఫ్యాన్స్.. హ్యాపీ ఎండింగ్ వీడియో వైరల్

అసలు సినిమాలో ఏమైందంటే..

ధురంధర్ 2 సినిమా చివరిలో రణ్‌వీర్ చేసిన జస్కిరత్ (హమ్జా) క్యారెక్టర్ గూఢచర్యం, హింసతో నిండిన తన పాత జీవితాన్ని వదిలేసి దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత తన సొంత ఊరు పఠాన్‌కోట్ చేరుకుంటాడు. అయితే ఇన్నేళ్ల తర్వాత తన ఫ్యామిలీ పరిస్థితి చూసి అతను ఎమోషనల్ అవుతాడు.

తాను చనిపోయానని వాళ్లు ఫిక్స్ అయిపోయి, ఆ బాధను దిగమింగుకుని ప్రశాంతంగా బతుకుతున్నారని అతనికి అర్థమవుతుంది. వాళ్లను దూరం నుంచి చూస్తూ కళ్లనీళ్లు పెట్టుకుంటాడు. ఆ తర్వాత అతను వాళ్లను కలిశాడా, లేక తన డ్యూటీ కోసం మళ్లీ దేశ సేవలోకి వెళ్లిపోయాడా అనేది సస్పెన్స్‌గా వదిలేస్తూ డైరెక్టర్ సినిమాను ముగించాడు.

ఏఐ మార్చేసిన ముగింపు ఇదే..

అయితే నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఏఐ వీడియోలో మాత్రం కథ వేరేలా ఉంది. జస్కిరత్ తన తల్లిని కలవగలిగే ఏకైక దారి ఈ ఏఐ మాత్రమే అంటూ ఒక ఫ్యాన్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఇందులో జస్కిరత్ ఒంటరిగా పొలాల్లో నిలబడి ఉండటం, కొడుకు బతికే ఉన్నాడని చూసి వాళ్ల అమ్మ షాక్ అవ్వడం, ఇద్దరూ ఎమోషనల్‌గా గట్టిగా హత్తుకోవడం లాంటి సీన్స్ ఉన్నాయి. అలాగే జస్కిరత్ చాలా సంతోషంగా నవ్వుతూ తన చెల్లితో, ఫ్యామిలీతో ఫోటోలకు పోజులివ్వడం కూడా ఇందులో చూపించారు.

నెటిజన్ల రియాక్షన్స్ మామూలుగా లేవుగా..

ఈ ఆల్టర్నేట్ హ్యాపీ ఎండింగ్ చూసి ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. కొడుకు బతికొచ్చాడని తెలిస్తే ఆ తల్లి ఆనందంతో ఉప్పొంగిపోతుంది అని ఒకరు, చూస్తుంటే గూస్‌బంప్స్ వస్తున్నాయి అని మరొకరు కామెంట్ చేశారు. కొంతమంది రియల్ బాలీవుడ్ స్టార్ల కంటే ఈ ఏఐ రణ్‌వీర్ చాలా బాగా యాక్ట్ చేశాడని కామెంట్లు పెడుతున్నారు. విషాదాన్ని విక్టరీగా మార్చేశారని, కన్నీళ్లను నవ్వులుగా మార్చారని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఏఐ అంత చెడ్డదేం కాదనిపిస్తోంది అని ఇంకొకరు రాసుకొచ్చారు.

ధురంధర్ 2 స్టోరీ, కలెక్షన్స్..

2025లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ధురంధర్ సినిమాకు ఇది సీక్వెల్. మార్చి 19న రిలీజ్ అయిన ఈ సినిమాలో రణ్‌వీర్‌తో పాటు మాధవన్, సంజయ్ దత్, సారా అర్జున్, గౌరవ్ గేరా, అర్జున్ రాంపాల్ నటించారు. కరాచీలోని ల్యారీ అనే గ్యాంగ్‌వార్స్ జరిగే ఏరియా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. కందహార్ విమానం హైజాక్, పార్లమెంట్ అటాక్, ముంబై దాడులు లాంటి అంశాల చుట్టూ ఫస్ట్ పార్ట్ నడిచింది. ఇప్పుడు ఈ సీక్వెల్‌లో అసలు రణ్‌వీర్ క్యారెక్టర్ గతం ఏంటి, అతను ఆ మిషన్ ఎందుకు తీసుకున్నాడు అనేది చూపించారు.

అలాగే లియారీ ఏరియాను తన కంట్రోల్‌లోకి తీసుకుని, ఇండియాను టార్గెట్ చేసిన టెర్రర్ నెట్‌వర్క్‌ను అతను ఎలా నాశనం చేశాడనేది ఇందులో మెయిన్ పాయింట్. కలెక్షన్ల పరంగా చూస్తే పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా రూ.75 కోట్లు, మొదటి రోజు రూ.165 కోట్లు రాబట్టిన ఈ యాక్షన్ సినిమా.. ఇప్పటివరకు ఇండియాలో రూ.450 కోట్ల నెట్ వసూళ్ల మార్క్‌ను దాటేసి దూసుకుపోతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More