రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్ 2: ది రివెంజ్' మూవీ బాక్సాఫీస్ దగ్గర డామినెన్స్ కొనసాగిస్తోంది. తగ్గేదే లేదన్నట్లుగా కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఏడో రోజు కూడా అదరిపోయే వసూళ్లు రాబట్టింది. ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాల్లో ధురంధర్ 2 మూడో ప్లేస్ కు చేరుకుంది. ఆల్ టైమ్ రికార్డుపై ఈ మూవీ కన్నేసింది.
ధురంధర్ 2 కలెక్షన్లు

పాజిటివ్ టాక్ తో, సెలబ్రిటీల ప్రశంసలతో ధురంధర్ 2 కు అడ్డన్నదే లేకుండా పోయింది. ఈ సినిమా ఏడో రోజైన బుధవారం (మార్చి 25) కూడా బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటింది. ఇండియాలో రూ.47.70 కోట్ల నెట్ వసూళ్లు ఖాతాలో వేసుకుంది. కలెక్షన్లలో అదరగొట్టింది.
మొత్తం వసూళ్లు
ధురంధర్ 2 ఇండియా కలెక్షన్లు రూ.623.42 కోట్లకు చేరుకున్నట్లు ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ పేర్కొంది. ఏడో రోజుల్లోనే ధురంధర్ 2 సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్లు సాధించడం విశేషం. ఈ సినిమా మార్చి 19న థియేటర్లలో రిలీజైంది.
ఆల్ టైమ్ హిట్స్ రికార్డులు బద్దలు
ఈ వారం రోజుల్లోనే ధురంధర్ 2 బాలీవుడ్ దిగ్గజ సినిమాల రికార్డులను తిరగరాసింది. షారుఖ్ ఖాన్ 'పఠాన్', రణ్‌బీర్ కపూర్ 'యానిమల్', సన్నీ డియోల్ 'గదర్ 2' వంటి ఇండస్ట్రీ హిట్స్ జీవితకాల వసూళ్లను ఈ చిత్రం కేవలం ఏడు రోజుల్లోనే అధిగమించడం విశేషం. బుధవారం విక్కీ కౌశల్ 'ఛావా' (రూ.601 కోట్లు) రికార్డును కూడా ధురంధర్ 2 దాటేసింది.
మూడో ప్లేస్ కు
ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాల్లో ధురంధర్ 2 మూడో ప్లేస్ కు చేరుకుంది. ధురంధర్ పార్ట్ 1 (రూ.895 కోట్లు), స్త్రీ 2 (రూ.627 కోట్లు) మాత్రమే ధురంధర్ 2 కంటే ముందున్నాయి. ఈ మిగతా సినిమాల రికార్డులనూ ధురంధర్ 2 దాటేసేలా కనిపిస్తోంది.
{{/usCountry}}ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాల్లో ధురంధర్ 2 మూడో ప్లేస్ కు చేరుకుంది. ధురంధర్ పార్ట్ 1 (రూ.895 కోట్లు), స్త్రీ 2 (రూ.627 కోట్లు) మాత్రమే ధురంధర్ 2 కంటే ముందున్నాయి. ఈ మిగతా సినిమాల రికార్డులనూ ధురంధర్ 2 దాటేసేలా కనిపిస్తోంది.
{{/usCountry}}ప్రస్తుత వేగం చూస్తుంటే ధురంధర్ సీక్వెల్ ఆ రికార్డును సులువుగా బ్రేక్ చేసేలా కనిపిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వ ప్రతిభ, రణ్‌వీర్ సింగ్ మాస్ పర్ఫార్మెన్స్ ఈ స్థాయి విజయానికి ప్రధాన కారణమయ్యాయి.
దంగల్ రికార్డుకు ఎసరు?
ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి స్టార్లు ఉండటం కూడా ధురంధర్ 2 సినిమాకు ప్లస్ పాయింట్ గా మారింది. ఫస్ట్ పార్ట్ ధురంధర్ 1 ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ధురంధర్ 2 దాన్ని దాటేసే దిశగా సాగుతోంది.
అమీర్ ఖాన్ 'దంగల్' సృష్టించిన ఆల్ టైమ్ రికార్డ్ రూ.2070 కోట్లను కూడా ధురంధర్ 2 చిత్రం బద్దలు కొట్టవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద రణ్‌వీర్ సింగ్ సృష్టిస్తున్న ఈ ప్రభంజనం ఇప్పట్లో తగ్గేలా లేదు.