రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై థ్రిల్లర్ "ధురంధర్ 2" బాక్సాఫీస్ వద్ద అన్ స్టాపబుల్ గా దూసుకుపోతోంది. రెండో వారంలోనూ ఈ మూవీ తగ్గేదేలేదన్నట్లుగా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తోంది. 13వ రోజు (మార్చి 31) ముగిసే సమయానికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1435 కోట్ల మార్కును దాటేసింది. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.
ధురంధర్ 2 హిస్టరీ

ధురంధర్ 2 సినిమా కలెక్షన్ల పరంగా కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. చైనా మార్కెట్ మినహాయించి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ సినిమాగా ధురంధర్ 2 నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1435 కోట్ల కలెక్షన్లను ఖాతాలో వేసుకుంది.
దంగల్ ఉన్నా
చైనాను కలిపి చూసుకుంటే అత్యధిక కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా దంగల్ కొనసాగుతోంది. చైనాలోనే ఈ మూవీ రూ.1300 కోట్లు సాధించింది. కానీ ధురంధర్ 2 సినిమా చైనాలో రిలీజ్ కాకుండానే ఈ రేంజ్ కలెక్షన్లు సాధించడం ట్రేడ్ పండితులను సైతం విస్మయానికి గురి చేస్తోంది.
ఇండియాలో ఇలా
ధురంధర్ 2 సినిమా ఇండియాలోనూ అదరగొడుతోంది. ఈ మూవీ మంగళవారం ఇండియాలో రూ.27 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. ఇండియాలో మొత్తం వసూళ్లు రూ.899 కోట్లకు చేరుకున్నాయి. బుధవారం ఉదయం షోలతోనే ఈ చిత్రం రూ.900 కోట్ల మార్కును సునాయాసంగా దాటేసింది. భారతీయ సినిమా చరిత్రలో రెండో వారాంతంలో రూ.170 కోట్లు సాధించిన తొలి చిత్రంగా కూడా ఇది రికార్డుకెక్కింది.
దేశీయంగా ధురంధర్ 2 చిత్రం మొదటి వారంలోనే రూ.1000 కోట్ల ప్రపంచవ్యాప్త వసూళ్లను దాటి రికార్డు సృష్టించింది.
ఓవర్సీస్లో బాహుబలి 2 రికార్డ్ బ్రేక్
{{/usCountry}}దేశీయంగా ధురంధర్ 2 చిత్రం మొదటి వారంలోనే రూ.1000 కోట్ల ప్రపంచవ్యాప్త వసూళ్లను దాటి రికార్డు సృష్టించింది.
ఓవర్సీస్లో బాహుబలి 2 రికార్డ్ బ్రేక్
{{/usCountry}}విదేశాల్లోనూ ధురంధర్ 2 ప్రభంజనం మామూలుగా లేదు, అంతర్జాతీయంగా ఇప్పటివరకు $38.4 మిలియన్ల వసూళ్లను సాధించింది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో "బాహుబలి 2" పేరిట ఉన్న 9 ఏళ్ల నాటి రికార్డును ఈ సినిమా బద్దలు కొట్టింది.
చైనాలో విడుదల కాకుండానే ధురంధర్ 2 ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. గతంలో అమీర్ ఖాన్ 'దంగల్' ఈ మార్కును దాటినప్పటికీ, అందులో ఎక్కువ భాగం చైనా వసూళ్లే ఉండటం గమనార్హం.
ధురంధర్ 2 గురించి..
ధురంధర్ 2 సినిమాలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి దిగ్గజ నటులు నటించారు. ఈ సినిమా మొదటి భాగం రూ.1300 కోట్లు వసూలు చేయగా, ఈ సీక్వెల్ ఏకంగా రూ. 2000 కోట్ల క్లబ్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం ఇంకా థియేటర్లలో స్ట్రాంగ్‌గా కొనసాగుతోంది.