బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపేందుకు, రికార్డులు మోత మోగించేందుకు ధురంధర్ 2 వచ్చేస్తోంది. మార్చి 19న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రీమియర్ షో టికెట్ సేల్స్ కు ఇప్పటికే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. ఇక మూవీ రిలీజ్ ఫస్ట్ డే స్పెషల్ షోల నుంచి నార్మల్ షోల వరకూ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఇవాళ స్టార్ట్ అయింది.
ధురంధర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్

మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ధురంధర్ 2 మూవీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ విషయాన్ని హీరో రణ్‌వీర్ సింగ్ తన ఎక్స్ లో పోస్టు చేశాడు.
“ఇక ఆటలను మొదలెట్టండి. ధురంధర్ ది రివెంజ్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ దేశవ్యాప్తంగా స్టార్ట్ అయ్యాయి. మీ టిక్కెట్లను ఇప్పుడే బుక్ చేసుకోండి. మార్చి 19న ఉగాది, గుడి పడ్వా, ఈద్ సందర్భంగా ధురంధర్ ది రివెంజ్ రిలీజ్ అవుతుంది’’ అని రణ్‌వీర్ సింగ్ పోస్టులో పేర్కొన్నాడు.
ధురంధర్ 2 షో టైమింగ్స్
ధురంధర్ ది రివేంజ్ టికెట్లు ఇప్పుడు ఇండియాలోని అన్ని నగరాల్లో టిక్కెటింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్నాయి. బుక్ మై షో ప్రకారం మెట్రో నగరాల్లో మొదటి షోలు ఉదయం 6:15–6:30 గంటల మధ్య ప్రారంభమవుతాయి. రాత్రి లాస్ట్ షోలను సుమారు 11:30–11:45 గంటల మధ్య షెడ్యూల్ చేశారు. కొన్ని థియేటర్లలో రాత్రి 11:55 గంటలకు లాస్ట్ షో స్టార్ట్ కానుంది.
ధురంధర్ 2 రన్ టైమ్
{{/usCountry}}ధురంధర్ ది రివేంజ్ టికెట్లు ఇప్పుడు ఇండియాలోని అన్ని నగరాల్లో టిక్కెటింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్నాయి. బుక్ మై షో ప్రకారం మెట్రో నగరాల్లో మొదటి షోలు ఉదయం 6:15–6:30 గంటల మధ్య ప్రారంభమవుతాయి. రాత్రి లాస్ట్ షోలను సుమారు 11:30–11:45 గంటల మధ్య షెడ్యూల్ చేశారు. కొన్ని థియేటర్లలో రాత్రి 11:55 గంటలకు లాస్ట్ షో స్టార్ట్ కానుంది.
ధురంధర్ 2 రన్ టైమ్
{{/usCountry}}బాలీవుడ్ హంగామా ప్రకారం ధురంధర్ 2 సినిమా సుమారు 235 నిమిషాల (3 గంటల 55 నిమిషాలు) రన్‌టైమ్‌ను కలిగి ఉంటుందని తెలిసింది. కొన్ని ప్రాంతాల్లో 3 గంటల 40 నిమిషాల నిడివి ఉన్న సినిమాను ప్రదర్శిస్తారని సమాచారం. ఈ చిత్రం దాని ప్రీక్వెల్ ధురంధర్ రన్ టైమ్ 214.01 నిమిషాల (3 గంటలు, 34 నిమిషాలు, 1 సెకను) రన్‌టైమ్‌ను అధిగమించింది.
ప్రీమియర్ షోలు
ధురంధర్ 2 ప్రీమియర్ షో టికెట్లు ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ ప్రీమియర్ షో టికెట్ల సేల్స్ ద్వారానే రూ.100 కోట్లు కొల్లగొట్టే దిశగా ధురంధర్ 2 దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు ఖాతాలో చేరాయని సమాచారం. మరి అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ తో ధురంధర్ 2 ఇంకాా ఎన్ని రికార్డులు ఖాతాలో వేసుకుంటుందో చూడాలి. ధురంధర్ 2 మూవీకి ఆదిత్య ధర్ డైరెక్టర్.