రణ్‌వీర్ సింగ్ నటించిన యాక్షన్ బ్లాక్ బస్టర్ 'ధురంధర్: ద రివెంజ్' సినిమా యాక్షన్ సీన్స్‌తో పాటు, ఇందులో చూపించిన ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ లొకేషనే హిమాచల్ ప్రదేశ్‌లోని కొండల మధ్య ఉన్న 'ద లారెన్స్ స్కూల్, సనావర్'. పచ్చని ప్రకృతి, పాతకాలపు కట్టడాలు, గొప్ప అకడమిక్ హిస్టరీ ఉన్న ఈ స్కూల్ వాతావరణం బాలీవుడ్ మేకర్స్‌ను విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తోంది.
రణ్‌వీర్ సందడి.. డైరెక్టర్‌తో యామీ గౌతమ్ విజిట్

ధురంధర్ లాంటి ఈ క్రేజీ ప్రాజెక్టులో రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్ నటించారు. షూటింగ్ టైమ్‌లో జరిగిన ముచ్చట్లను స్కూల్ హెడ్‌మాస్టర్ హిమ్మత్ సింగ్ ధిల్లాన్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా తో పంచుకున్నారు. క్యాంపస్‌లో ఉన్నప్పుడు రణ్‌వీర్ సింగ్ అక్కడి స్టూడెంట్స్‌తో చాలా సరదాగా గడిపాడని, వాళ్లకు అది ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మంచి మెమరీగా మిగిలిపోయిందని ఆయన చెప్పారు.
అలాగే డైరెక్టర్ ఆదిత్య ధర్‌తో కలిసి నటి యామీ గౌతమ్ కూడా ఆ స్కూల్‌కు వచ్చి అక్కడి ప్రశాంత వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేశారట. ఈ క్యాంపస్‌కు ఉన్న నాచురల్ బ్యూటీ, హెరిటేజ్ వల్లే సినిమా వాళ్లు షూటింగ్స్ కోసం ఇక్కడికి క్యూ కడుతున్నారని ధిల్లాన్ అన్నారు.
ఆసియాలోనే అత్యంత పురాతన స్కూల్..
ఈ స్కూల్‌కు, సినిమాలకు ఉన్న కనెక్షన్ ఈనాటిది కాదు. 1847లో స్టార్ట్ అయిన ఈ లారెన్స్ స్కూల్, ఆసియాలోనే అత్యంత పురాతనమైన కో-ఎడ్యుకేషనల్ బోర్డింగ్ స్కూల్‌గా పేరు తెచ్చుకుంది. ఇన్ని సంవత్సరాలుగా ఇది కేవలం షూటింగ్ స్పాట్ మాత్రమే కాదు, చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు చదువుకున్న బడిగా కూడా గుర్తింపు పొందింది.
ఈ ధురంధర్ సినిమాలో 'చౌదరి ఎస్పీ అస్లాం' పాత్రలో అదరగొట్టిన సంజయ్ దత్ చదువుకున్నది కూడా ఇక్కడే. దాంతో ఈ సినిమాకు, ఆ స్కూల్‌కు ఒక పర్సనల్ కనెక్షన్ ఏర్పడింది. సంజయ్ దత్ చాలాసార్లు తన స్కూల్ డేస్ గురించి ఎమోషనల్‌గా మాట్లాడాడు. కొవిడ్ మహమ్మారి టైమ్‌లో ఆ స్కూల్ లోకల్ స్టూడెంట్స్‌కు చేసిన హెల్ప్ చూసి ఆయన ఫిదా అయ్యాడు. చదువుతో పాటు పిల్లల ఎమోషనల్ వెల్ బీయింగ్ మీద వాళ్లు చూపిస్తున్న కేర్‌ను మెచ్చుకుంటూ హెడ్మాస్టర్కు, ఫ్యాకల్టీకి ఒక అప్రిసియేషన్ నోట్ కూడా రాశాడు. కష్టాలను ఎలా ఎదుర్కోవాలో ఆ స్కూలే తనకు నేర్పిందని ఆయన ఎంతో గర్వంగా చెప్పాడు.
మిగతా స్టార్స్ ఎవరంటే..
{{/usCountry}}ఈ ధురంధర్ సినిమాలో 'చౌదరి ఎస్పీ అస్లాం' పాత్రలో అదరగొట్టిన సంజయ్ దత్ చదువుకున్నది కూడా ఇక్కడే. దాంతో ఈ సినిమాకు, ఆ స్కూల్‌కు ఒక పర్సనల్ కనెక్షన్ ఏర్పడింది. సంజయ్ దత్ చాలాసార్లు తన స్కూల్ డేస్ గురించి ఎమోషనల్‌గా మాట్లాడాడు. కొవిడ్ మహమ్మారి టైమ్‌లో ఆ స్కూల్ లోకల్ స్టూడెంట్స్‌కు చేసిన హెల్ప్ చూసి ఆయన ఫిదా అయ్యాడు. చదువుతో పాటు పిల్లల ఎమోషనల్ వెల్ బీయింగ్ మీద వాళ్లు చూపిస్తున్న కేర్‌ను మెచ్చుకుంటూ హెడ్మాస్టర్కు, ఫ్యాకల్టీకి ఒక అప్రిసియేషన్ నోట్ కూడా రాశాడు. కష్టాలను ఎలా ఎదుర్కోవాలో ఆ స్కూలే తనకు నేర్పిందని ఆయన ఎంతో గర్వంగా చెప్పాడు.
మిగతా స్టార్స్ ఎవరంటే..
{{/usCountry}}బాలీవుడ్ సీనియర్ నటులు బలరాజ్ సాహ్ని, సునీల్ దత్, నర్గీస్ దత్ లాంటి వాళ్లు కూడా తమ పిల్లల చదువు కోసం ఈ స్కూల్‌నే ఎంచుకున్నారు. ఇన్నేళ్లలో ప్రీతి జింటా, సైఫ్ అలీ ఖాన్, పూజా బేడీ, ఫిల్మ్ మేకర్ షాద్ అలీ లాంటి ఎంతోమంది స్టార్లు ఈ స్కూల్ నుంచి వచ్చిన వాళ్లే.
సినిమా వాళ్లకు అంతగా ఎందుకు నచ్చుతుందంటే..
సినిమా మేకర్స్‌కు సనావర్ స్కూల్ కేవలం అందంగా కనిపించడం వల్లే కాదు, ఇంకా చాలా కారణాలతో భలేగా సెట్ అవుతుంది. పెద్ద గ్రౌండ్స్, పాతకాలపు హెరిటేజ్ బిల్డింగ్స్, డిసిప్లిన్‌గా ఉండే వాతావరణం.. ఇవన్నీ స్క్రీన్ మీద చాలా రియలిస్టిక్‌గా, సినిమాటిక్ గ్రాండియర్‌తో కనిపిస్తాయి.
ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, 'ధురంధర్' ఫస్ట్ పార్ట్ షూటింగ్ కూడా ఒక మూడు రోజుల పాటు ఇదే క్యాంపస్‌లో జరిగింది. ఇప్పుడు సీక్వెల్ కూడా అక్కడే తీయడంతో ఈ ఫ్రాంచైజీకి, బాలీవుడ్ షూటింగ్ మ్యాప్‌లో ఆ స్కూల్‌కు ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడింది.