బాక్సాఫీస్ దగ్గర మరోసారి పెను విధ్వంసం సృష్టించడానికి రణ్‌వీర్ సింగ్ వచ్చేస్తున్నాడు. బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ సీక్వెల్ ధురంధర్ 2 థియేటర్లకు రాబోతుంది. ఇవాళ రిలీజ్ చేసిన ట్రైలర్ తో ధురంధర్ పై హైప్ మరింత పెరిగింది. ఈ ట్రైలర్ కు అలియా భట్, రామ్ గోపాల్ వర్మ రియాక్షన్ వైరల్ గా మారింది.
ధురంధర్ 2 ట్రైలర్

ఆదిథ్య ధర్ దర్శకత్వంలో రిలీజ్ కు రెడీ అయిన ధురంధర్ 2 మూవీ ట్రైలర్ ను మేకర్స్ ఇవాళ (మార్చి 7) విడుదల చేశారు. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. మార్చి 19న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ధురంధర్ 2 మూవీపై మరింత హైప్ పెంచేలా ఈ ట్రైలర్ ఉంది.
ఆర్జీవీ పోస్ట్
ధురంధర్ 2 సినిమా ట్రైలర్ ను చూసి రామ్ గోపాల్ వర్మ ఇంప్రెస్ అయ్యాడు. ఎక్స్ లో ఈ మేరకు ఆర్జీవీ ఓ పోస్టు పెట్టాడు. ‘‘ఇది అత్యున్నత స్థాయి (స్ట్రాటోస్పియరిక్ లెవల్). ఆదిథ్య ధర్ ధురంధర్ 2 రివేంజ్ ర్యాంపేజ్ చూపించబోతున్నాడు’’ అని ఆర్జీవీ ఎక్స్ లో పోస్టు పెట్టాడు.
బీస్ట్ మోడ్ ఆన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా ధురంధర్ 2 ట్రైలర్ పై మనసు పారేసుకుంది. ఇన్స్టాగ్రామ్'లో ధురంధర్ 2 ట్రైలర్ ను ఆమె షేర్ చేస్తూ.. ‘‘బీస్ట్ మోడ్ ఆన్. ఈ ట్రైలర్ కంట్రోల్ లో లేదు’’ అని అలియా రాసుకొచ్చింది.
{{/usCountry}}బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా ధురంధర్ 2 ట్రైలర్ పై మనసు పారేసుకుంది. ఇన్స్టాగ్రామ్'లో ధురంధర్ 2 ట్రైలర్ ను ఆమె షేర్ చేస్తూ.. ‘‘బీస్ట్ మోడ్ ఆన్. ఈ ట్రైలర్ కంట్రోల్ లో లేదు’’ అని అలియా రాసుకొచ్చింది.
{{/usCountry}}రణ్‌వీర్ సింగ్ అదుర్స్
ధురంధర్ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన రణ్‌వీర్ సింగ్ ఇప్పుడు ధురంధర్ 2తో మరోసారి దుమ్మరేపేందుకు రెడీ అయ్యాడు. ధురంధర్ 2 ట్రైలర్ లో జస్కిరత్ సింగ్ రంగిగా రణ్‌వీర్ సింగ్.. లయారీలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నట్లు చూపించారు. ఇందులో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ తమ పవర్ ఫుల్ అవతార్‌లలో మరింత ప్రమాదకరంగా కనిపించారు.
ధురంధర్ 2 గురించి
బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ కు సీక్వెల్ గా ధురంధర్ 2 రాబోతుంది. ఇది మార్చి 19, 2026న రిలీజ్ కానుంది. ధురంధర్ 2లో రణ్‌వీర్ సింగ్ తో పాటు ఆర్. మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడీ, డానిష్ పాండోర్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ తదితరులు నటిస్తున్నారు. అదే రోజు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ కానుంది.