Dhurandhar 2 vs Dhurandhar: ధురంధర్ 2 కంటే ధురంధర్ బాగుందంటున్న ఫ్యాన్స్.. నెగటివ్ రివ్యూలూ ఉన్నాయ్

Dhurandhar 2 vs Dhurandhar: ధురంధర్ 2, ధురంధర్ సినిమాల్లో ఏది బెటర్ అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. అయితే చాలా మంది సీక్వెల్ కంటే ఫస్ట్ పార్టే బాగుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మూవీకి కొందరు పూర్తిగా నెగటివ్ రివ్యూలు కూడా ఇచ్చారు.

Published on: Mar 19, 2026, 14:07:11 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' (Dhurandhar: The Revenge) ఫైనల్‌గా థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీ రిలీజ్ అవ్వగానే ఫస్ట్ పార్ట్‌తో పోల్చడం మొదలైంది. ఉదయాన్నే షోస్ చూసిన వాళ్లలో చాలా మంది ఆడియన్స్.. ఈ సీక్వెల్ కంటే 'ధురంధర్ 1' బెస్ట్ అని ఫీల్ అవుతున్నారు. మెజారిటీ ఆడియన్స్ 'ధురంధర్ ద రివెంజ్' సినిమాకు సూపర్ హిట్ రివ్యూస్ ఇస్తున్నా.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ క్రియేట్ చేసిన పాత మ్యాజిక్‌ను మాత్రం ఫ్యాన్స్ బాగా మిస్ అవుతున్నారు.

Dhurandhar 2 vs Dhurandhar: ధురంధర్ 2 కంటే ధురంధర్ బాగుందంటున్న ఫ్యాన్స్.. నెగటివ్ రివ్యూలూ ఉన్నాయ్
Dhurandhar 2 vs Dhurandhar: ధురంధర్ 2 కంటే ధురంధర్ బాగుందంటున్న ఫ్యాన్స్.. నెగటివ్ రివ్యూలూ ఉన్నాయ్

ఆడియన్స్ రివ్యూ ఇలా..

ఎక్స్ లో ఒక యూజర్ తన ఒపీనియన్‌ను షేర్ చేస్తూ.. 'ధురంధర్ 2' రన్‌టైమ్ ఎక్కువగా ఉన్నా ఆడియన్స్‌ను ఎలా సీట్లకు అతుక్కుపోయేలా చేస్తుందో వివరించాడు. అతను ఇలా రాసుకొచ్చాడు, "ధురంధర్ 2 మీద మిక్స్‌డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. యాక్షన్, వయొలెన్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి. ఓపెనింగ్ ఫైట్ సీక్వెన్స్ 'అరి అరి' సాంగ్‌తో అద్భుతంగా స్టార్టయి.. రాబోయే 4 గంటల పాటు సినిమా ఎలా ఉండబోతుందో ఒక టోన్ సెట్ చేస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం ఇందులో వచ్చే చిన్న చిన్న సర్‌ప్రైజెస్ ఈ సీక్వెన్స్‌లో బెస్ట్ పార్ట్‌గా నిలిచాయి. కచ్చితంగా మిమ్మల్ని 'వావ్' అనిపించే మూమెంట్స్ ఇందులో చాలానే ఉన్నాయి." అని అన్నాడు.

అదే పెద్ద మైనస్ అయిందా?

మరొక అభిమాని కూడా ఇలాంటి ఆలోచనలనే వ్యక్తపరుస్తూ.. ఆడియో లేబుల్ మారడం వల్లే మ్యూజిక్‌లో నెగెటివ్ చేంజ్ వచ్చిందా అని డౌట్ పడ్డాడు. సరిగమ ప్లేస్‌లో దాదాపు రూ. 27 కోట్లు పెట్టి టీ-సిరీస్ 'ధురంధర్ 2' మ్యూజిక్ రైట్స్ కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి.

దీనిపై ఆ అభిమాని ఇలా రాశాడు, "పర్సనల్‌గా నేను ఫీల్ అవుతున్నది ఏంటంటే.. ఈ సినిమాను సింగిల్ పార్ట్‌గా షూట్ చేశారు. రెండు పార్ట్‌లకు సంబంధించిన సాంగ్స్, బీజీఎమ్ మ్యూజిక్ ట్రాక్స్ అన్నీ ముందే లాక్ చేసేశారు. కానీ లాస్ట్ మినిట్‌లో స్టూడియో వాళ్ల అత్యాశ వల్లే వాళ్లు టీ-సిరీస్‌తో చేతులు కలిపారు. దీని రిజల్ట్ ఏంటంటే.. శాశ్వత్ సచ్‌దేవ్ చాలా తక్కువ టైమ్‌లో టీ-సిరీస్ లైబ్రరీతో వర్క్ చేయాల్సి వచ్చింది. పార్ట్ 1కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయిన అతను.. పార్ట్ 2లో పన్నెండో ఆటగాడిగా అయిపోయాడు. ఈ విషయంలో ధురంధర్ 2 నిరాశ పరిచింది" అని రాసుకొచ్చాడు.

పాటలపై ఆడియన్స్ మిక్స్‌డ్ రియాక్షన్స్..

ఇక ధురంధర్ లో ఉన్న సాంగ్స్ కథకు తగినట్లుగా సాగాయని, ధురంధర్ 2లో అదే మిస్ అయిందని ఆ అభిమాని అభిప్రాయపడ్డాడు.

మరో అభిమాని చాలా నెగటివ్ రివ్యూ ఇచ్చాడు. "నేను దురంధర్ 1ను బాగా ఎంజాయ్ చేశాను. దాన్ని మూడుసార్లు చూశాను. కానీ దురంధర్ 2లో మాత్రం సినిమా ఎప్పుడు అయిపోతుందా అని నా ఫోన్‌ను 250 సార్లు చెక్ చేసుకున్నాను. పార్ట్ 1లో ఉన్న స్క్రిప్ట్ లోతు, క్యారెక్టర్స్ ఇందులో మిస్ అయ్యాయి. అలాగే పార్ట్ 2 మ్యూజిక్ చాలా ఛండాలంగా ఉంది" అని అనడం గమనార్హం.

మరొకరు ఈ సినిమాను సింపుల్‌గా చెబుతూ.. "ధురంధర్ 1 మిమ్మల్ని ఏ పీక్స్ దగ్గర వదిలేసిందో, అక్కడి నుంచి ధురంధర్ 2 దాన్ని నెక్స్ట్ పీక్స్‌కు తీసుకెళ్తుందా? అంటే లేదు. అక్కడి నుంచి కిందికి పడిపోతుందా? అంటే అసలే కాదు. మరి ఏమవుతుంది? అది ఆ రెండింటి మధ్యలోనే ఊగుతూ ఉంటుంది" అని అనడం విశేషం.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More