బాక్సాఫీస్ దగ్గర భారీ ఫైట్ కు టైమ్ దగ్గరపడుతోంది. మార్చి నెలలో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ కాబోతుంది. రెండు భారీ ప్రాజెక్టులు ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి. రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2, యశ్ మూవీ టాక్సిక్ బాక్సాఫీస్ దగ్గర ఢీ కొట్టబోతున్నాయి. మార్చి 19, 2026న ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి.
ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్

మార్చి నెల వచ్చేసింది. ఇప్పుడు ఇండియన్ మూవీ లవర్స్, బాక్సాఫీస్ ఎక్స్ పర్ట్స్ ఫోకస్ మొత్తం ధురంధర్ 2, టాక్సిక్ పైనే ఉన్నాయి. ఈ సినిమా మార్చి 19న పాన్ ఇండియానే కాదు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర ఇది మెగా క్లాష్ కానుంది. ఇప్పుడు ఈ సినిమాల మధ్య పోరే హాట్ టాపిక్ గా మారింది.
అడ్వాన్స్ బుకింగ్స్
ధురంధర్ 2, టాక్సిక్ సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ సేల్స్ అమెరికాలో స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమాల ప్రీమియర్ల టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత ట్రెండ్ చూస్తే టాక్సిక్ కంటే ధురంధర్ 2 టికెట్ల సేల్స్ లో దూసుకుపోతోంది. సక్నిల్క్ వెబ్ సైట్ ప్రకారం యుఎస్ఏలో అడ్వాన్స్ బుకింగ్స్ సేల్స్ లో ధురంధర్ ఇప్పటివరకు 33,723 అమెరికా డాలర్లు సంపాదించింది. 151 థియేటర్లలో 209 షోలను వేయబోతున్నారు. ఇందులో ఇప్పటికే 1953 టికెట్లు అమ్ముడయ్యాయి.
ఇక టాక్సిక్ విషయానికి వస్తే ఈ మూవీ ప్రస్తుతానికి 81 థియేటర్లలో 122 షోలలో రిలీజ్ అయేందుకు రెడీ అయింది. దీని టికెట్లు కేవలం 189 మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ సినిమా 3,665 అమెరికా డాలర్లు ఖాతాలో వేసుకుంది.
ధురంధర్ 2 గురించి
బ్లాక్ బస్టర్ ధురంధర్ మూవీకి సీక్వెల్ గా ధురంధర్ 2 రాబోతుంది. డిసెంబర్ 5, 2025న రిలీజైన ధురంధర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇందులో రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్.మాధవన్ తదితరులు నటించారు. దీనికి ఆదిత్య ధర్ డైరెక్టర్.
టాక్సిక్ గురించి
{{/usCountry}}బ్లాక్ బస్టర్ ధురంధర్ మూవీకి సీక్వెల్ గా ధురంధర్ 2 రాబోతుంది. డిసెంబర్ 5, 2025న రిలీజైన ధురంధర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇందులో రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్.మాధవన్ తదితరులు నటించారు. దీనికి ఆదిత్య ధర్ డైరెక్టర్.
టాక్సిక్ గురించి
{{/usCountry}}కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీ సినిమాల తర్వాత యశ్ నటించిన సినిమా టాక్సిక్. దీనికి లేడీ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహించింది. ఇదో గ్యాంగ్ స్టర్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో కియారా అద్వాణీ, నయన తార, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తదితర హీరోయన్లు నటించారు. ఈ మూవీ గ్లింప్స్, టీజర్ ఇప్పటికే కాంట్రవర్సీ క్రియేట్ చేశాయి.