...
...
Next Story

ధురంధర్‌లో ఆ బడే సాబ్ ఎవరో తెలిసిపోయింది.. ఈ పాత్ర పోషించిన నటుడికి కూడా ఆ విషయం తెలియదట!

ధురంధర్ సీక్వెల్ రిలీజ్ కు ముందు చాలా మందిలో మెదిలిన ప్రశ్న ఇందులో బడే సాబ్ ఎవరు అని. మూవీ రిలీజ్ రోజే ఈ ప్రశ్నకు సమాధానం తెలిసిపోయింది. అయితే ఆ పాత్ర పోషించిన నటుడికి మొదట్లో తానే ఆ బడే సాబ్ అని తెలియదట.

Published on: Mar 19, 2026, 20:29:41 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

డైరెక్టర్ ఆదిత్య ధర్ తీసిన 'ధురంధర్' ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇండస్ట్రీలో, ఆడియన్స్ మైండ్‌లో ఉన్న ఒకే ఒక్క పెద్ద ప్రశ్న.. అసలు ఆ "బడే సాబ్" (Bade Sahab) ఎవరు అని. ఫైనల్‌గా గురువారం (మార్చి 19న) థియేటర్లలోకి వచ్చిన సీక్వెల్ ‘ధురంధర్: ద రివెంజ్’తో జనాలకు ఆ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఆ పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేసింది మరెవరో కాదు, యాక్టర్ డానిష్ ఇక్బాల్. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే.. సినిమాలో "బడే సాబ్" తానే అన్న విషయం చాలా రోజుల వరకు తనకే తెలియదని జూమ్ ఛానల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో డానిష్ రివీల్ చేశాడు.

'ధురంధర్ 2' బడే సాబ్ రోల్ గురించి డానిష్ ఏమన్నాడంటే..

ధురంధర్‌లో ఆ బడే సాబ్ ఎవరో తెలిసిపోయింది.. ఈ పాత్ర పోషించిన నటుడికి కూడా ఆ విషయం తెలియదట!
ధురంధర్‌లో ఆ బడే సాబ్ ఎవరో తెలిసిపోయింది.. ఈ పాత్ర పోషించిన నటుడికి కూడా ఆ విషయం తెలియదట!

ధురంధర్ సినిమాలో బడే సాబ్ రోల్ చేయడానికి తను ఎందుకు ఎక్సైట్ అయ్యాడు అనే విషయంపై డానిష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. "ఒక విషయం చెప్తా వినండి.. షూటింగ్ టైమ్‌లో ఈ బడే సాబ్ డిస్కషన్ ఎక్కడా రాలేదు. నిజం చెప్పాలంటే, ఓ రెండు నెలల కిందటి వరకు నేను ప్లే చేస్తున్న క్యారెక్టరే బడే సాబ్ అని నాకు కూడా తెలియదు. నేను ఫుల్ డౌట్‌లో ఉన్నాను. డైరెక్టర్ ఆదిత్య చాలా సీక్రెట్‌గా ఉంచుతూ, చాలా విషయాలు తన వరకే పరిమితం చేసుకున్నాడు" అని డానిష్ చెప్పుకొచ్చాడు.

అయితే తాను దావూద్ ఇబ్రహీం రోల్ చేస్తున్నాననే క్లారిటీ మాత్రం తనకు ఉందని అతను స్పష్టం చేశాడు. "అవును, నేను దావూద్ క్యారెక్టర్ చేస్తున్నాను, ఆ విషయం నాకు ముందే తెలుసు. కానీ దావూదే బడే సాబ్ అని మాత్రం నాకు 100 శాతం కాన్ఫిడెన్స్ లేదు. సెట్‌లో అందరూ నన్ను దావూద్ భాయ్ లేదా సాబ్ అని పిలిచేవాళ్లు. నా క్యారెక్టర్ గురించి ఎవరూ నాకు ఏమీ చెప్పలేదు. సో నా సీన్స్‌లో ఎప్పుడూ నేనే మాట్లాడుతూ ఉంటాను" అని డానిష్ క్లారిటీ ఇచ్చాడు.

ఎవరీ డానిష్ ఇక్బాల్?

ఇప్పుడు 'ధురంధర్: ది రివెంజ్' సినిమాలో దావూద్ ఇబ్రహీం ఇన్‌స్పిరేషన్‌తో డిజైన్ చేసిన 'బడే సాబ్' రోల్ చేసి రచ్చ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో అతని సీన్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఆడియన్స్ అతని పర్ఫార్మెన్స్‌ను ఓ రేంజ్‌లో పొగుడుతున్నారు.

'ధురంధర్: ద రివెంజ్' సక్సెస్ ట్రాక్, స్టోరీ డీటెయిల్స్..

బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్' ఫ్రాంచైజీ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. డిసెంబర్ 2025లో రిలీజ్ అయిన ఫస్ట్ పార్ట్‌కు క్రిటిక్స్ నుంచి మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి. కొందరు దీన్ని ఒక "ప్రాపగాండా" సినిమా అని కూడా విమర్శించారు. కానీ ఆడియన్స్ నుంచి వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్‌తో అది ఒక సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్ లాంటి స్టార్లు కీ రోల్స్ చేశారు.

కలెక్షన్స్ విషయానికొస్తే ధురంధర్ మూవీ వరల్డ్‌వైడ్‌గా రూ. 1,300 కోట్లు వసూలు చేయగా.. ఇప్పుడు సీక్వెల్ ఫస్ట్ డేనే ఏకంగా రూ. 100 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసి రికార్డుల వేట మొదలుపెట్టింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe