బాక్సాఫీస్ సంచలనంగా మారిన దురంధర్ సినిమా రికార్డుల వేట కొనసాగిస్తోంది. మరో కొత్త రికార్డును ఈ స్పై థ్రిల్లర్ ఖాతాలో వేసుకుంది. ఇండియాలో అత్యంత త్వరగా రూ.500 కోట్ల కలెక్షన్లు సాధించిన సినిమా దురంధర్ నిలిచింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన దురంధర్ చరిత్ర తిరగరాస్తూనే ఉంది.
దురంధర్ రికార్డు

కలెక్షన్ల పరంగా రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్ ప్లే చేసిన దురంధర్ మూవీ మరో రికార్డు నెలకొల్పింది. ఇండియాలో అతి తక్కువ రోజుల్లో రూ.500 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని దురంధర్ సినిమా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 15 రోజుల్లో ఈ చిత్రం ఇండియాలో రూ.503.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుందని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఫాస్టెస్ట్ రూ.500 కోట్ల సినిమా ఇదేనని పేర్కొన్నారు.
15వ రోజు కలెక్షన్లు
డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన దురంధర్ మూవీ కలెక్షన్ల విధ్వంసం కొనసాగుతోంది. 15వ రోజు (డిసెంబర్ 19) ఈ సినిమా ఇండియాలో రూ.23.70 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ తెలిపారు. తొలి వారం రూ.218 కోట్లు ఖాతాలో వేసుకున్న దురంధర్.. రెండో వారం రూ.261.5 కోట్లు సంపాదించిందని పేర్కొన్నారు.
మూడో ప్లేస్ లో
2025లో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో దురంధర్ మూడో ప్లేస్ కు చేరుకుంది. ఫస్ట్ ప్లేస్ లో కాంతార చాప్టర్ 1 (రూ.622 కోట్లు), ఛావా (రూ.601 కోట్లు) ఉన్నాయి. దురంధర్ జోరు చూస్తుంటే ఈ సినిమాలను త్వరలోనే వెనక్కి నెట్టి నంబర్ వన్ ప్లేస్ ఆక్రమించుకునే అవకాశముంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా దురంధర్ మూవీ గ్రాస్ కలెక్షన్లు రూ.700 కోట్లు దాటాయి.
దురంధర్ గురించి
దురంధర్ సినిమా అనేది పాకిస్తాన్లో సెట్ చేసిన ఒక స్పై థ్రిల్లర్. ఇందులో రణ్‌వీర్ సింగ్ ఒక భారతీయ గూఢచారిగా లియారీలో ఉన్న తీవ్రవాద నెట్‌వర్క్‌లలోకి చొరబడతాడు. ఆ తర్వాత అతను దేశం కోసం ఏం చేశాడన్నది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
{{/usCountry}}దురంధర్ సినిమా అనేది పాకిస్తాన్లో సెట్ చేసిన ఒక స్పై థ్రిల్లర్. ఇందులో రణ్‌వీర్ సింగ్ ఒక భారతీయ గూఢచారిగా లియారీలో ఉన్న తీవ్రవాద నెట్‌వర్క్‌లలోకి చొరబడతాడు. ఆ తర్వాత అతను దేశం కోసం ఏం చేశాడన్నది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
{{/usCountry}}దురంధర్ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. జ్యోతి దేశ్‌పాండే నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాల సిరీస్‌లో మొదటి భాగం. ఇది బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగా లాంటి సెలబ్రిటీ డైరెక్టర్ల ప్రశంసలు అందుకుంది ఈ సినిమా. దురంధర్ రెండవ భాగం మార్చి 19, 2026న విడుదల కానుంది.