లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ధురంధర్ రికార్డుల వేట కొనసాగిస్తోంది. మరే బాలీవుడ్ సినిమాకు సాధ్యం కాని ఫీట్ ను అందుకుంది. ఇండియాలో రూ.700 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన తొలి బాలీవుడ్ సినిమాగా ధురంధర్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో రణ్‌వీర్ సింగ్ హీరో.
ధురంధర్ కలెక్షన్లు

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మూడు వారాలకు పైగా ప్రయాణించిన తరువాత రణ్‌వీర్ సింగ్ సినిమా ధురంధర్ మరో రికార్డు అందుకుంది. రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్ జంటగా నటించిన ఈ చిత్రం వసూళ్లు సోమవారం కాస్త పడిపోయాయి. అయినా రికార్డుల మోత మాత్రం ఆగలేదు. సక్నిల్క్ ప్రకారం ధురంధర్ సోమవారం (డిసెంబర్ 29) రూ.10 కోట్లకు పైగా వసూలు చేసింది.
రూ.700 కోట్ల క్లబ్
ధురంధర్ సినిమా ఇండియా నెట్ కలెక్షన్లలో కొత్త రికార్డు అందుకుంది. ఈ మూవీ ఇండియాలోనే రూ.700 కోట్ల క్లబ్ లో ప్రవేశించింది. ఈ ఘనత సాధించిన తొలి బాలీవుడ్ సినిమాగా నిలిచింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం డిసెంబర్ 5న విడుదలైంది. ధురంధర్ మూడవ వారంలో రూ.172 కోట్లు వసూలు చేసింది. 22వ రోజు ఈ చిత్రం రూ.15 కోట్లు, 23వ రోజు రూ.20.50 కోట్లు, 24వ రోజు రూ.22.5 కోట్లు వసూలు చేసింది. 25వ రోజు రూ.10.75 నికర వసూళ్లను ఆర్జించింది.
పుష్ప 2 రికార్డు
ఇప్పటివరకు ధురంధర్ ఇండియాలో రూ.701.25 కోట్ల నెట్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ధురంధర్ సినిమా సోమవారం మొత్తం 21.27 శాతం హిందీ ఆక్యుపెన్సీ కలిగి ఉంది. ఈ చిత్రం పుష్ప: ది రూల్ హిందీ నెట్ పై ఇప్పుడు దృష్టి సారించింది. సక్నిల్క్ ప్రకారం పుష్ప 2 హిందీలోనే రూ. 812.14 కోట్ల నెట్ వసూళ్లు సొంతం చేసుకుంది. ధురంధర్ 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది.
టాప్ 10లో
{{/usCountry}}ఇప్పటివరకు ధురంధర్ ఇండియాలో రూ.701.25 కోట్ల నెట్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ధురంధర్ సినిమా సోమవారం మొత్తం 21.27 శాతం హిందీ ఆక్యుపెన్సీ కలిగి ఉంది. ఈ చిత్రం పుష్ప: ది రూల్ హిందీ నెట్ పై ఇప్పుడు దృష్టి సారించింది. సక్నిల్క్ ప్రకారం పుష్ప 2 హిందీలోనే రూ. 812.14 కోట్ల నెట్ వసూళ్లు సొంతం చేసుకుంది. ధురంధర్ 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది.
టాప్ 10లో
{{/usCountry}}2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగానే కాదు ధురంధర్.. టాప్ 10 ఇండియన్ మూవీస్ లో ఏడో స్థానంలో నిలిచింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. కాందహార్ విమాన హైజాక్, 2001 పార్లమెంట్ దాడి, 26/11 ముంబై దాడులు వంటి భౌగోళిక రాజకీయ, ఉగ్రవాద సంఘటనల నేపథ్యంలో ధురంధర్ తెరకెక్కింది.
ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, నవీన్ కౌశిక్, రాకేష్ బేడీ, డానిష్ పండోర్ తదితరులు నటించారు. జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ సంయుక్తంగా ధురంధర్ చిత్రాన్ని నిర్మించాయి.