...
...
Next Story

1200 కోట్లు దాటిన ధురంధర్-క్రెడిట్ తనది కాదంటున్న హీరోయిన్-సారా అర్జున్ పోస్ట్ వైరల్

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ధురంధర్ ఒక సెన్సేషన్. ఈ మూవీ కలెక్షన్లలో రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో క్రెడిట్ తనది కాదంటూ హీరోయిన్ సారా అర్జున్ పోస్ట్ వైరల్ గా మారింది.

Published on: Jan 4, 2026, 17:43:30 IST
Advertisement

డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైనప్పటి నుండి ధురంధర్ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అంతే కాకుండా తాజాగా రూ.1200 కోట్ల క్లబ్‌లోనూ చేరింది. ఈ చిత్రంతోనే రణ్ వీర్ సింగ్‌కు జోడీగా బాలీవుడ్ అరంగేట్రం చేసింది హీరోయిన్ సారా అర్జున్.

సారా అర్జున్ పోస్ట్

ధురంధర్ సినిమాలో రణవీర్ సింగ్, సారా అర్జున్
ధురంధర్ సినిమాలో రణవీర్ సింగ్, సారా అర్జున్

ధురంధర్ సినిమా విజయంపై సారా అర్జున్ హృదయపూర్వక సందేశం వైరల్ గా మారింది. ప్రేక్షకులు చూపిన అపారమైన ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సారా సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.

‘‘నా బలమైన 'ధురంధర్లు' – ప్రేక్షకులు. చాలా కాలంగా సుదీర్ఘ కథనాల (లాంగ్ రన్ టైమ్ మూవీస్)పై ప్రేక్షకులు సహనం చూపడం లేదని, చూసే స్థాయి తగ్గిపోయిందని, ఈ సినిమాలకు ఇక చోటు లేదని ఒక అభిప్రాయం ఉంది. కానీ మీరు దానికి విరుద్ధంగా నిరూపించారు. ప్రేక్షకుల నిజమైన బలాన్ని, వారు నిజంగా నమ్మేదాన్ని సమర్థించడానికి ఏకమైనప్పుడు ఏమి జరుగుతుందో మీరు అందరికీ గుర్తు చేశారు’’ అని సారా అర్జున్ రాసుకొచ్చారు.

మీ వల్లే ఇదంతా

‘‘నేను ఇప్పుడే ప్రారంభించా. నేను భాగమైన చిత్రానికి, నేను చేయటానికి ప్రయత్నిస్తున్న పనికి ఇంత త్వరగా ఈ విధమైన ప్రోత్సాహాన్ని పొందడం నాకు మాటలకు అందనిది. ఇది నన్ను బలపరుస్తుంది. మీరు నిజంగా అనుభూతి చెందారని, కథ మీకు చేరిందని చూడటం, నేను క్రెడిట్ తీసుకోని విజయం. ఆ క్రెడిట్ దర్శకులదే. దానిలో భాగం కావడం పట్ల నేను కృతజ్ఞురాలిని’’ అని సారా అర్జున్ ముగించింది.

ధురంధర్ లో కరాచీలోని లియారీలో ఉన్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లలోకి చొరబడిన భారతీయ గూఢచారిగా రణ్ వీర్ సింగ్ నటించాడు. ఇందులో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ రెండవ భాగం మార్చి 2026లో థియేటర్లలో విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks