...
...
Next Story

Dhurandhar OTT: నెట్‌ఫ్లిక్స్‌లో 2.2 కోట్ల వ్యూస్.. దుమ్మురేపుతున్న స్పై థ్రిల్లర్.. అత్యధిక మంది చూసిన ఇండియన్ మూవీ!

Dhurandhar OTT: మార్చి 19 కోసం ఇండియన్ సినీ లవర్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ధురంధర్ 2 మూవీ రాబోతుంది. అయితే అంతకంటే ముందు ఓటీటీలో ధురంధర్ సినిమా రికార్డుల మోత మోగిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక మంది చూసిన ఇండియన్ మూవీగా నిలిచింది.

Published on: Mar 5, 2026, 13:55:06 IST
Advertisement

ధురంధర్ 2 సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్నా ఫస్ట్ పార్ట్ ధురంధర్ పై ఏ మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ధురంధర్ ఫస్ట్ పార్ట్ ఓటీటీని షేక్ చేస్తోంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో రికార్డుల మోత మోగిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక మంది చూసిన ఇండియన్ మూవీగా ధురంధర్ మరో హిస్టరీ క్రియేట్ చేసింది.

ధురంధర్ ఓటీటీ

ధురంధర్ సినిమాలో రణ్‌వీర్ సింగ్‌
ధురంధర్ సినిమాలో రణ్‌వీర్ సింగ్‌

రణ్‌వీర్ సింగ్‌ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ ధురంధర్ జనవరి 30న ఓటీటీలోకి వచ్చింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అడుగుపెట్టింది. ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి 31 రోజుల్లో ఈ సినిమాకు 2.2 కోట్ల వ్యూస్ వచ్చాయని ట్రేడ్ అనలిస్ట్ సక్నిల్క్ వెబ్ సైట్ పేర్కొంది. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక మంది చూసిన ఇండియన్ మూవీగా నిలిచిందని వెల్లడించింది.

టాప్ 10లో

ఓటీటీలో వచ్చినప్పటి నుంచి ధురంధర్ మేనియా కొనసాగుతూనే ఉంది. మార్చి 3కు ముందు వరకు ఆ సినిమా 5 వారాలుగా ట్రెండింగ్ టాప్ 10 హిందీ లిస్ట్ లో కొనసాగుతూ వచ్చింది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు నాన్-ఇంగ్లీష్ మూవీ కేటగిరీలో ధురంధర్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 9వ స్థానంలో నిలిచింది. ఈ వారం 11 దేశాల్లో టాప్ 10 సినిమాల జాబితాలో స్థానం సంపాదించుకుంటూ స్ట్రీమింగ్ లో తన ఆధిపత్యం కొనసాగిస్తోంది.

ట్రెండింగ్

ఇండియాలోనే కాకుండా బంగ్లాదేశ్, బహ్రెయిన్, శ్రీలంక, మాల్దీవ్స్, ఒమన్, పాకిస్థాన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మారిషస్, నైజీరియాలలో కూడా ధురంధర్ అత్యధిక మందిచూసిన సినిమాగా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర కూడా ధురంధర్ రికార్డుల దుమ్ము దులిపిన సంగతి తెలిసిందే.

ధురంధర్ సినిమా డిసెంబర్ 5, 2025న థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లు ఖాతాలో వేసుకుంది. ఇందులో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడి తదితరులు కూడా నటించారు. ఈ సినిమాకు ఆదిత్య ధర్ డైరెక్టర్. దీని సీక్వెల్ ధురంధర్ 2 మూవీ మార్చి 19, 2026న రిలీజ్ కానుంది. అదే రోజు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా విడుదలవుతుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks