Dia Mirza: ఐదేళ్ల కొడుకు చేసిన పనికి హీరోయిన్ దియా మీర్జాకు తిట్లు.. ధనవంతుల హోదా తెచ్చే గుడ్డితనం అంటూ! ఏమైందంటే?
Dia Mirza On Son Behaviour With Delivery Boy: ఐదేళ్ల కొడుకు చేసిన పనికి హీరోయిన్ దియా మీర్జాకు సోషల్ మీడియాలో తిట్లు పడుతున్నాయి. ఓ పాడ్‌కాస్ట్‌లో డెలివరీ బాయ్‌తో కొడుకు అవ్యాన్ ప్రవర్తించిన తీరును గొప్పగా చెప్పుకున్న దియా మీర్జాకు నెటిజన్లు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
Dia Mirza On Son Behaviour With Delivery Boy: సెలబ్రిటీల జీవనశైలి, వారి ప్రవర్తన సోషల్ మీడియా యుగంలో నిరంతరం నిఘాలోనే ఉంటోంది. పర్యావరణ పరిరక్షణ, సమానత్వం అంటూ స్టేజీలపై మాట్లాడే కొందరు సినీ తారలు నిజజీవితంలో ప్రదర్శించే వైఖరిపై తరచూ విమర్శలు వస్తుంటాయి.

ఐదేళ్ల కొడుకు ప్రవర్తన
తాజాగా బాలీవుడ్ బ్యూటీ, పర్యావరణ కార్యకర్త దియా మీర్జా నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. ఒక పాడ్‌కాస్ట్‌లో తన ఐదేళ్ల కొడుకు ప్రవర్తన గురించి ఆమె గర్వంగా చెప్పుకున్న మాటలు.. దియా మీర్జాకు ఊహించనివిధంగా నెట్టింట్లో తిరుగుబాటును తెచ్చిపెట్టాయి.
అసలేం జరిగిందంటే?
నటి సోహా అలీ ఖాన్ నిర్వహిస్తున్న ఒక పాడ్‌కాస్ట్‌లో దియా మీర్జా ఇటీవల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాతావరణ మార్పులు, ప్లాస్టిక్ నిషేధంపై ఆమె మాట్లాడుతుండగా.. తన ఐదేళ్ల కుమారుడు అవ్యాన్ ఆజాద్ రేఖీకి సంబంధించిన ఒక సంఘటనను పంచుకున్నారు. కొబ్బరిబొండాల డెలివరీ బాయ్ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ స్ట్రాలు తీసుకురావడం తనకు అస్సలు నచ్చలేదని దియా పేర్కొన్నారు.
ఆ సమయంలో తలుపు తీసిన తన ఐదేళ్ల కొడుకు నడుముపై చేతులు వేసుకుని.. "ప్లాస్టిక్‌లో ఎందుకు తెచ్చావు? మా ఇంట్లోకి ప్లాస్టిక్ అనుమతించరు. ఆ కొబ్బరిబొండాలను కింద పెట్టి, ప్లాస్టిక్ కవర్లు, స్ట్రాలను వెనక్కి తీసుకుపో" అంటూ సదరు డెలివరీ బాయ్‌ని శాసించాడని దియా మీర్జా నవ్వుతూ చెప్పారు.
పక్కనే ఉన్న సోహా అలీ ఖాన్ కూడా ఈ మాటలకు మురిసిపోతూ.. ఒక పెద్దవాడిని ఎదుర్కొనే అంత నమ్మకం ఆ చిన్నారికి ఉండటం గొప్ప విషయమంటూ ప్రశంసలు కురిపించారు.
నెటిజన్ల ఆగ్రహం.. 'ప్రివిలేజ్' తిట్లు
ఈ పాడ్‌కాస్ట్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు దియా మీర్జాపై ధ్వజమెత్తారు. ఎండ తీవ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటిపోతున్న వేళ, పొట్టకూటి కోసం ఇంటింటికీ తిరిగి సేవలు అందించే ఒక డెలివరీ బాయ్‌తో అంత అహంకారంతో మాట్లాడటం సంస్కారం అనిపించుకోదని నెటిజన్లు క్లాస్ పీకుతున్నారు.
"ఎండల్లో కష్టపడే ఒక పేద కార్మికుడిని ఐదేళ్ల పిల్లోడు గద్దిస్తుంటే, దానిని సంస్కారంగా భావించి ఒక తల్లి కెమెరా ముందు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. ముందు మీ పిల్లోడికి ఎదుటి మనుషులను గౌరవించడం నేర్పించండి" అని ఒక నెటిజన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు.
ధనవంతుల హోదా తెచ్చే గుడ్డితనం
మరొక నెటిజన్ దియా మీర్జా ద్వంద్వ నీతిని ఎండగడుతూ.. "పర్యావరణం గురించి మాట్లాడే దియా మీర్జా ముఖానికి రాసుకునే మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ ప్లాస్టిక్ డబ్బాల్లోనే వస్తాయి. ధనవంతుల హోదా తెచ్చే గుడ్డితనం అంటే ఇదే" అని ఘాటుగా విమర్శించారు. ప్లాస్టిక్ వద్దు అనుకుంటే స్వయంగా బజారుకు వెళ్లి కాగితపు సంచుల్లో తెచ్చుకోవాలి కానీ, అమాయకపు డెలివరీ బాయ్స్‌పై ఇలాంటి ప్రతాపాలు చూపించొద్దంటూ కామెంట్లు వస్తున్నాయి.
నెటిజన్ల ట్రోలింగ్ బారిన పడి
కాగా, దియా మీర్జా 2021లో వ్యాపారవేత్త వైభవ్ రేఖీని వివాహం చేసుకున్నారు. అదే ఏడాది వారికి కుమారుడు అవ్యాన్ జన్మించాడు. సామాజిక అంశాలపై నిత్యం స్పందించే దియా మీర్జా.. ఈసారి నెటిజన్ల ట్రోలింగ్‌కు గురయ్యారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


