Dia Mirza On Climate: పురుషుల వల్లే పర్యావరణం నాశనం అవుతోంది- హీరోయిన్ దియా మీర్జా కామెంట్స్- ఎకోఫెమినిజం వాదన!
Dia Mirza On Climate Change Cause Men: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు, పర్యావరణ విధ్వంసానికి పురుషులే కారణమంటూ బాలీవుడ్ హీరోయిన్, ఐక్యరాజ్యసమితి పర్యావరణ రాయబారి దియా మీర్జా సంచలన కామెంట్స్ చేశారు. దియా మీర్జా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతోపాటు ఆమె నెగెటివ్ ట్రెండ్‌లో వైరల్ అవుతున్నారు.
Dia Mirza On Climate Change Cause Men: ప్రకృతిని కాపాడుకోవాలంటూ సుద్దులు చెప్పే సెలబ్రిటీల మాటలు కొన్నిసార్లు ఎంతటి వివాదాలకు దారితీస్తాయో మరోసారి రుజువైంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి తరఫున ప్రచారం చేసే గుడ్‌విల్ అంబాసిడర్‌గా, బాలీవుడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న దియా మీర్జా తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.

పురుషుల అహంకారమే కారణం
ప్రపంచాన్ని పీడిస్తున్న వాతావరణ మార్పులకు (Climate Change) పురుషుల అహంకారం, పురుషాధిక్య వ్యవస్థే (Patriarchy) కారణమంటూ దియా మీర్జా సంచలన ఆరోపణలు చేశారు.
నటి సోహా అలీ ఖాన్ నిర్వహిస్తున్న 'ఆల్ అబౌట్ హర్' అనే పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పర్యావరణ జర్నలిస్ట్ ఆరతి కుమార్-రావుతో కలిసి దియా మీర్జా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాతావరణ మార్పులపై చర్చ సాగుతుండగా దియా మీర్జా సంచలన వ్యాఖ్యలు చేశారు.
నూటికి నూరు శాతం వారే బాధ్యులు
"ఈ ప్రపంచంలో వాతావరణ మార్పులకు పురుషాధిక్యతే ప్రధాన కారణం. పురుషుల వల్లే పర్యావరణం ఇంతలా దెబ్బతింది" అని దియా మీర్జా పేర్కొన్నారు. పక్కనే ఉన్న సోహా అలీ ఖాన్ జోక్యం చేసుకుంటూ.. "పురుషుల అహంకారం (Male Ego) అంటావా?" అని ప్రశ్నించగా, దియా మీర్జా అవునంటూ మద్దతు పలికారు.
"అవును, మగాళ్లే వాతావరణంలో ఇంతటి అల్లకల్లోలానికి కారణం. నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అనుభవిస్తున్న నరకానికి, బాధలకు వారే నూటికి నూరు శాతం బాధ్యులు. కేవలం వెనుకబడిన దేశాల్లోనే కాదు, ధనిక దేశాల్లోనూ ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది" అని దియా మీర్జా గట్టిగా చెప్పుకొచ్చారు.
ఎకోఫెమినిజం వాదన.. జర్నలిస్ట్ వివరణ
ప్రకృతిని దోపిడీ చేయడం వెనుక సమాజంలో ఉన్న ఆధిపత్య ధోరణి ఉందంటూ ఈ పాడ్‌కాస్ట్‌లో 'ఎకోఫెమినిజం' (పర్యావరణం-మహిళా హక్కుల అనుసంధానం) అంశాన్ని వారు ప్రస్తావించారు. అయితే ఈ చర్చలో పాల్గొన్న జర్నలిస్ట్ ఆరతి కుమార్-రావు కొంత సమన్వయ ధోరణిని ప్రదర్శించారు.
"పురుషాధిక్యత అంటే కేవలం మగవారు మాత్రమే కాదు, స్త్రీవాదం అంటే కేవలం ఆడవారు మాత్రమే కాదు. మహిళలు కూడా పురుషాధిక్య ఆలోచనలను సమర్థించవచ్చు, అలాగే పురుషులు కూడా స్త్రీవాదానికి అండగా నిలబడవచ్చు" అని ఆమె వివరించారు.
సెలబ్రిటీల కపటత్వంపై నెటిజన్ల ఆగ్రహం
దియా మీర్జా వ్యాఖ్యల వీడియో ఎక్స్ (ట్విట్టర్), రెడ్డిట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కోట్లాది రూపాయల సంపాదనతో, ప్రైవేట్ జెట్ విమానాలు వాడుతూ, లగ్జరీ కార్లలో తిరుగుతూ సామాన్యుల కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ కార్బన్ ఉద్గారాలను (Carbon Footprint) విడుదల చేసే సెలబ్రిటీలు.. ఇలాంటి నీతులు చెప్పడం కపటత్వమేనని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
సమస్యను చాలా చిన్నదిగా చేసేశారు!
సామాన్య ప్రజలకు పర్యావరణం గురించి హితబోధ చేసే అర్హత ఏసీ రూముల్లో బతికే ఇలాంటి నటీమణులకు లేదని మండిపడుతున్నారు. పర్యావరణ కాలుష్యం, భూతాపం అనేవి పారిశ్రామికీకరణ, శిలాజ ఇంధనాల (Fossil Fuels) వాడకం, ప్రభుత్వాల విధాన లోపాలు, కార్పొరేట్ కంపెనీల స్వార్థం వల్ల వస్తున్న జాతీయ, అంతర్జాతీయ సమస్యలని నిపుణులు గుర్తుచేస్తున్నారు.
ఇంతటి సంక్లిష్టమైన గ్లోబల్ సమస్యకు కేవలం 'జెండర్ పాలిటిక్స్' (లింగ వివక్ష) రంగు పులిమి పురుషులదే తప్పు అనడం దియా మీర్జా అపరిపక్వతకు నిదర్శనమని విమర్శిస్తున్నారు. గత రెండు శతాబ్దాలుగా పెరిగిన ఫ్యాక్టరీలు, సాంకేతిక పరిజ్ఞానం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లిందే తప్ప.. ఇందులో కేవలం మగవారి అహమే కారణం అనడం హాస్యాస్పదమని నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు.
నెగెటివ్ ట్రెండింగ్‌లో దియా మీర్జా
దియా మీర్జా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 25 ఏళ్లు అవుతోంది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) తరఫున ఆమె గత కొన్నేళ్లుగా భారతదేశంలో గాలి కాలుష్యం, సుస్థిర అభివృద్ధిపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే, దియా మీర్జా తాజా వ్యాఖ్యలతో మరోసారి నెగెటివ్ ట్రెండింగ్‌లోకి రావడమే కాకుండా.. తెలుగు ఆడియెన్స్ మీమ్స్ స్టైల్‌లో హీరో, విలన్ కొట్టుకుని కమెడియన్‌ను చంపేసినట్లుగా ఉన్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


