విరోష్.. ఇప్పుడు సోషల్ మీడియాలో, ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా ఇదే ట్రెండింగ్. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ జంటకు ఫ్యాన్స్ పెట్టిన పేరు ఇది. ఈ లవ్ బర్డ్స్ ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకుంటున్న నేపథ్యంలో రష్మిక, విజయ్ విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. వీళ్ల లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాలని నెటిజన్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
విరోష్ వెడ్డింగ్

లవ్, డేటింగ్, రిలేషన్ షిప్.. ఇలా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ బంధంపై కొంత కాలంగా చాలా పుకార్లు వచ్చాయి. కానీ ఈ జంట గతంలో ఎప్పుడూ వీటిపై మాట్లాడలేదు. కలిసే వెకేషన్లకు వెళ్లినా, జంటగా కనిపించినా కానీ సైలెంట్ గానే ఉండిపోయారు. కానీ ఇప్పుడు వెడ్డింగ్ పై అనౌన్స్ మెంట్ చేయాల్సిన టైమ్ రావడంతో సోషల్ మీడియాలో విరోష్ వెడ్డింగ్ అంటూ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. తమ పెళ్లిని కన్ఫామ్ చేశారు.
రష్మిక, విజయ్ పెళ్లి
ఫ్యాన్స్ అందరూ ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న రోజు రానే వస్తుంది. ఫిబ్రవరి 26న రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఉదయ్ పూర్ లో వీళ్ల పెళ్లి జరగనుంది. ఇప్పటికే రష్మిక, విజయ్ అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ లవ్ బర్ట్స్ లవ్ స్టోరీ వైరల్ గా మారింది.
గీత గోవిందంతో మొదలై
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల ప్రేమ కథ ‘గీత గోవిందం’ సినిమాతో మొదలైంది. 2018లో రిలీజైన ఈ మూవీలో ఈ జంట తొలిసారి కలిసి నటించింది. 'గీత గోవిందం' సినిమా సెట్స్‌లోనే ఈ లవ్ స్టోరీ ప్రాణం పోసుకుంది. ఈ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. స్క్రీన్ పై వాళ్ల కెమిస్ట్రీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. తెర వెనుక కూడా రష్మిక, విజయ్ కెమిస్ట్రీ అప్పుడే మొదలైంది.
మనసులు కలిసి
గీత గోవిందం సినిమాలో కలిసి యాక్ట్ చేసిన తర్వాత రష్మిక, విజయ్ తరచుగా బయట కలిసి కనిపించారు. ఇక ఆ తర్వాత డియర్ కామ్రేడ్ తో వీళ్ల రిలేషన్ షిప్ మరింత స్ట్రాంగ్ గా మారింది. ఈ మూవీతో విరోష్ జంట సూపర్ హిట్ ఆన్ స్క్రీన్ జోడిగా నిలిచింది. వీళ్ల మనసులూ కలిశాయి. అప్పటి నుంచి వెకేషన్లు, డిన్నర్లు, టూర్లు, మూవీ షూటింగ్ లు అంటూ రష్మిక, విజయ్ బయట బాగానే కలిసి కనిపించారు. చివరకు 2025 అక్టోబర్ లో వీళ్ల ఎంగేజ్మెంట్ జరిగింది. ఇప్పుడు పెళ్లికి రెడీ అయిపోయారు.
{{/usCountry}}గీత గోవిందం సినిమాలో కలిసి యాక్ట్ చేసిన తర్వాత రష్మిక, విజయ్ తరచుగా బయట కలిసి కనిపించారు. ఇక ఆ తర్వాత డియర్ కామ్రేడ్ తో వీళ్ల రిలేషన్ షిప్ మరింత స్ట్రాంగ్ గా మారింది. ఈ మూవీతో విరోష్ జంట సూపర్ హిట్ ఆన్ స్క్రీన్ జోడిగా నిలిచింది. వీళ్ల మనసులూ కలిశాయి. అప్పటి నుంచి వెకేషన్లు, డిన్నర్లు, టూర్లు, మూవీ షూటింగ్ లు అంటూ రష్మిక, విజయ్ బయట బాగానే కలిసి కనిపించారు. చివరకు 2025 అక్టోబర్ లో వీళ్ల ఎంగేజ్మెంట్ జరిగింది. ఇప్పుడు పెళ్లికి రెడీ అయిపోయారు.
{{/usCountry}}ముచ్చటగా మూడోసారి కలిసి రణబాలి అనే సినిమాలో రష్మిక, విజయ్ నటిస్తున్నారు. వీళ్ల పెళ్లి తర్వాత ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.