...
...
Next Story

Dill Raju: మహేష్ బాబు నుంచి ప్రభాస్ వరకు-గాయపడ్డ సింహంలో ఆ హీరోలను వాడేశారు- మూవీ ఎంజాయ్ చేస్తారు-దిల్ రాజు ఫస్ట్ రివ్యూ

Dill Raju: గాయపడ్డ సింహం మూవీపై టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ఈ సినిమాలో అయిదుగురు హీరోలను వాడేశారని, మూవీని ఎంజాయ్ చేస్తారని చెప్పుకొచ్చాడు. మూవీ ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు.

Published on: Apr 26, 2026, 07:21:28 IST
Advertisement

Dill Raju: డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన మరో మూవీ ‘గాయపడ్డ సింహం’. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మే 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ ను లాంఛ్ చేశారు. ఈ ఈవెంట్లో మాట్లాడిన టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. గాయపడ్డ సింహం ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు.

గాయపడ్డ సింహం రివ్యూ

దిల్ రాజు (youtube)
దిల్ రాజు (youtube)

తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ మూవీ ‘గాయపడ్డ సింహం’. ఈ మూవీ ట్రైలర్ ను శనివారం (ఏప్రిల్ 25) రాత్రి రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో మూవీపై దిల్ రాజు కామెంట్లు తెగ వైరల్ గా మారాయి. టాలీవుడ్ లోని అయిదుగురు హీరోలను గాయపడ్డ సింహంలో వాడేశారని, మూవీని ఎంజాయ్ చేస్తారని దిల్ రాజు రివ్యూ చెప్పేశాడు.

ట్రంప్ కూడా హీరోనే

గాయపడ్డ సింహం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘డైరెక్టర్ కశ్యప్ గురించి ఎక్కువ చెప్పాలి. నేను సినిమా చూశా. కాన్సెప్ట్ బాగుందనిపించి మూవీ కొనేశా. కానీ సినిమా చూసేవరకూ టెన్షన్. సినిమాలో ఇద్దరు హీరోలు. ట్రంప్ కూడా హీరోనే. ట్రంప్ ను పెట్టుకుని, ఓ కాన్సెప్ట్ తో మూవీ తీశారు’’ అని దిల్ రాజు చెప్పాడు.

అయిదుగురు హీరోలను

‘‘మా హీరో (తరుణ్ భాస్కర్) ఇంకో మూవీని డైరెక్ట్ చేస్తూ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ట్రైలర్ చూస్తే ఫుల్ కామెడీ ఉందని అర్థమైంది కదా. సినిమా అంతా ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాడు కశ్యప్. ఈ ఇద్దరు హీరోలనే కాకుండా మరో అయిదుగురు హీరోలను కూడా వాడేశారు. ప్రభాస్, మహేష్ బాబు, సిద్ధార్థ్, యష్, మన అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ)ని వాడేశారు’’ అని దిల్ రాజు రివీల్ చేశాడు.

ఆ ఎపిసోడ్లు

శ్రీ విష్ణుకు థ్యాంక్స్ చెప్పాలి. సెకండాఫ్ లో ఆ అయిదుగురు హీరోలతో పాటు శ్రీ విష్ణు ఎపిసోడ్ బాగా వచ్చింది. శ్రీ విష్ణు ఇందులో యాక్ట్ చేయడం సినిమాకు చాలా ప్లస్ అయింది. జేడీ ఏమో ఫస్టాఫ్ లో విలన్, సెకండాఫ్ లో కమెడియన్’’ అని దిల్ రాజు పేర్కొన్నాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks