Dil Raju Kirikiri:దర్శకుడిగా సాహస యాత్రికుడు-హైబ్రిడ్ టెక్నాలజీతో ఒక్కడే తీస్తున్న కిరికిరి-కొత్త ప్రయోగం అన్న దిల్ రాజు

Dil Raju About Kirikiri Movie: 18 దేశాల చుట్టువచ్చిన సాహస యాత్రికుడు భరద్వాజ్ దాయాల దర్శకుడిగా మారిన సరికొత్త సినిమా కిరికిరి. ఈ సినిమాను క్లాప్ కొట్టి నిర్మాత దిల్ రాజు ప్రారంభించారు. దర్శకుడు ఒక్కడే అంతా తానై తీస్తున్న ఈ సినిమా కొత్త ప్రయోగం అని దిల్ రాజు పేర్కొన్నారు.

Published on: Nov 23, 2026, 13:43:21 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Dil Raju Praised Kirikiri Movie: బైక్ రైడర్‌గా 18 దేశాలు చుట్టివచ్చి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న సాహస యాత్రికుడు భరద్వాజ్ దాయాల దర్శకుడిగా ఒక కొత్త ప్రయత్నం మొదలుపెట్టారు. ఏఐ టెక్నాలజీని కొత్తగా ఉపయోగిస్తూ హైబ్రీడ్ సాంకేతికతతో "కిరికిరి" అనే సినిమాను రూపొందిస్తున్నారు.

దర్శకుడిగా సాహస యాత్రికుడు- హైబ్రిడ్ టెక్నాలజీతో ఒక్కడే తీస్తున్న కిరికిరి- కొత్త ప్రయోగం అన్న దిల్ రాజు
దర్శకుడిగా సాహస యాత్రికుడు- హైబ్రిడ్ టెక్నాలజీతో ఒక్కడే తీస్తున్న కిరికిరి- కొత్త ప్రయోగం అన్న దిల్ రాజు

వన్ మ్యాన్ షోగా కిరికిరి

ఈ చిత్రాన్ని వన్ మ్యాన్ షో ఫిలింస్ బ్యానర్‌పై రవికాంత్ వీరేపల్లి నిర్మిస్తున్నారు. వన్ మ్యాన్ షోగా చెప్పాల్సిన "కిరికిరి" సినిమా రెగ్యులర్ మేకింగ్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్‌తో మొదలుపెట్టారు.

ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. "డైరెక్టర్ భరద్వాజ్ దాయాల రూపొందిస్తున్న కిరికిరి సినిమా ఈ రోజు రెగ్యులర్ మేకింగ్ ప్రారంభించుకుంది. హైదరాబాద్ నేపథ్యంగా చార్మినార్ సెంటర్ పాయింట్‌గా హైబ్రిడ్ టెక్నాలజీ మూవీగా ఈ సినిమాను ఆయన రూపొందిస్తున్నారు" అని అన్నారు.

180 రోజుల్లో క్వాలిటీ సినిమా

"ఈ రోజు నుంచి ఆరు నెలల్లో కిరికిరి సినిమాను రిలీజ్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ 180 రోజుల్లో క్వాలిటీ సినిమాను వారు తీసుకురాబోతున్నారు. వారి ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నా. వారి స్టూడియోను నేను చూశాను. తెరకెక్కించే ప్రతి సీన్‌ను వారు కంప్యూటర్ నుంచి స్క్రీన్ మీద ప్రేక్షకులకు ఎలా ఉండబోతుంది అనేది చూసుకుంటున్నారు" అని దిల్ రాజు తెలిపారు.

"ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజ్ అయ్యాక ఒక వ్యక్తే సినిమాను రూపొందించవచ్చు అనేది ప్రపంచానికి చాటబోతున్నారు. ఇది ఒక కొత్త ప్రయోగం. మీ ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. మీరు చేసే ఈ ప్రయత్నం ఎంతోమంది యంగ్ టాలెంట్ చిత్ర పరిశ్రమలో తమను తాము ప్రూవ్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ప్రపంచ సినిమాకు ఇదొక గొప్ప ముందడుగు కావాలని కోరుకుంటున్నా. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా" అని దిల్ రాజు పేర్కొన్నారు.

ఒక్క వ్యక్తి సినిమా చేయగలడని

డైరెక్టర్ భరద్వాజ దాయాల మాట్లాడుతూ.. "ఎంతోమంది కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చి, ప్రొడ్యూసర్‌గా ఇన్నోవేటివ్ మూవీస్ నిర్మించిన దిల్ రాజు గారు మా కిరికిరి సినిమా రెగ్యులర్ మేకింగ్‌కు క్లాప్ ఇవ్వడం సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని 180 రోజుల్లో రిలీజ్‌కు తీసుకురాబోతున్నాం. సరిగ్గా నెలరోజుల్లో స్క్రీన్ ప్లే కంప్లీట్ చేస్తాం" అని అన్నారు.

"దిల్ రాజు గారి విజన్‌ను అంతా నమ్ముతారు. మేము కూడా మా స్క్రిప్ట్‌ను ఆయనకు వినిపించి సజెషన్స్ తీసుకుంటాం. ఏఐ వల్ల మన ఉద్యోగాలు పోతాయని భయపడుతున్నారు. కానీ, కొత్త టెక్నాలజీ ఎప్పుడూ వచ్చినా అది ఎన్నో కొత్త దారులు తెరుస్తుంది. సినిమాను ఫోన్‌లో కూడా తీయగలం. ఒక్క వ్యక్తి ఒక సినిమా చేయగలడు అని ప్రూవ్ చేయడం ద్వారా ఎంతోమంది యంగ్ టాలెంట్‌కు కొత్త దారి దొరుకుతుంది" అని దర్శకుడు భరద్వాజ దాయాల అభిప్రాయపడ్డారు.

ఓటీటీలో వందలాది సినిమాలు ఉన్నప్పటికీ

"ఫాస్ట్‌గా సినిమా చేస్తే క్వాలిటీ ఉండదు అనే అపోహ ఉంది. టెక్నాలజీ ఉపయోగిస్తూ వేగంగా సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కిరికిరి ప్రాజెక్ట్‌ను మంచి క్వాలిటీ మూవీగా చేయాలనుకుంటున్నాం. ఈరోజు ఎంత కంటెంట్ ఉన్నా, ఇంకా కావాల్సిన అవసరం ఉంది. వందలాది సినిమాలు ఓటీటీలో ఉన్నా మనం కొత్త సినిమా ఏది వచ్చింది అని సెర్చ్ చేస్తాం. అలా కంటెంట్ క్రియేటర్స్‌కు ఇప్పుడున్న టెక్నాలజీ అడ్వాంటేజ్ అవుతోంది" అని భరద్వాజ దాయల వెల్లడించారు.

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.