...
...
Next Story

Dil Raju: థియేటర్లు ఇవ్వలేదని దిల్ రాజును ఏసుకుంటారు.. కండిషన్స్ అప్లై అని ముందే చెప్పా: గాయపడ్డ సింహంపై దిల్ రాజు

Dil Raju: దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తరుణ్ భాస్కర్ నటించిన గాయపడ్డ సింహం రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ వారం వాయిడే పడొచ్చని ముందే చెప్పాడు. దీనికి కారణం రామ్ చరణ్ పెద్ది మూవీనే కావడం గమనార్హం.

Published on: Mar 23, 2026, 15:43:31 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Dil Raju: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాంటి పెద్ద హీరో మూవీ, మరో పక్క కొత్తదనానికి మారుపేరుగా నిలిచే తరుణ్ భాస్కర్ లీడ్ రోల్లో నటించిన సినిమా.. ఈ ఇద్దరి సినిమాల చుట్టూ ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద చర్చే నడుస్తోంది. తరుణ్ భాస్కర్ నటిస్తున్న కొత్త సినిమా 'గాయపడ్డ సింహం' విడుదల తేదీని మే 1గా అధికారికంగా ప్రకటించారు. సరిగ్గా దానికి ఒక్కరోజు ముందే, అంటే ఏప్రిల్ 30వ తేదీన రామ్ చరణ్ నటిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా 'పెద్ది' థియేటర్లలోకి రాబోతోంది. దీంతో నెట్టింట జనాలంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. దీనిపై దిల్ రాజు క్లారిటీ ఇస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

కండిషన్స్ అప్లై అని ముందే చెప్పాను

Dil Raju: థియేటర్లు ఇవ్వలేదని దిల్ రాజును ఏసుకుంటారు.. కండిషన్స్ అప్లై అని ముందే చెప్పా: గాయపడ్డ సింహంపై దిల్ రాజు
Dil Raju: థియేటర్లు ఇవ్వలేదని దిల్ రాజును ఏసుకుంటారు.. కండిషన్స్ అప్లై అని ముందే చెప్పా: గాయపడ్డ సింహంపై దిల్ రాజు

పెద్ది మూవీతో గాయపడ్డ సింహం పోటీ పడుతుందా అన్న అనుమానాలను నిర్మాత దిల్ రాజు ముందుగానే పటాపంచలు చేశాడు. ఒకవేళ పెద్ది అనుకున్న ప్రకారమే వస్తే.. సింహం పక్కకు జరగాల్సిందే అని అన్నాడు. రిలీజ్ వాయిదాకు సరే అనాల్సిందే అని తాను ముందే చెప్పానని, దానికి వాళ్లు కూడా ఒప్పుకున్నారని అతడు వెల్లడించాడు.

గాయపడ్డ సింహం సినిమాను పంపిణీ చేస్తున్నది దిల్ రాజుయే కావడం విశేషం. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. "రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా ఏప్రిల్ 30న చాలా గ్రాండ్‌గా రిలీజ్ కావాల్సి ఉంది. ఒకవేళ ఆ సినిమా అనుకున్న సమయానికే వస్తే మాత్రం, నేను ఈ చిన్న సినిమాకు థియేటర్లు కేటాయించలేను. అప్పుడు మళ్లీ దిల్ రాజును ఏసుకుంటారు.. ఇదే విషయాన్ని నేను ముందే గాయపడ్డ సింహం చిత్ర బృందానికి చాలా స్పష్టంగా చెప్పేశాను. పెద్ది సినిమా వస్తే గనక, మీరు కచ్చితంగా విడుదల వాయిదా వేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని వాళ్లకు ముందే క్లియర్ గా చెప్పాను" అని దిల్ రాజు అన్నాడు.

ప్రమోషన్స్ చాలా ముఖ్యం

దీన్ని బట్టి చూస్తే బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు సినిమాల మధ్య నేరుగా పోటీ అయితే ఉండదని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. దిల్ రాజు లాంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్ రెండు సినిమాలకు థియేటర్ల ఇబ్బంది రాకుండా చాలా తెలివిగా ప్లాన్ చేశాడనే చెప్పాలి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks