ఇంత మాస్, బ్లడ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు, తొలిసారి విజయ్ దేవరకొండతో అలా చేయిస్తున్నాం.. నిర్మాత దిల్ రాజు కామెంట్స్

విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా రౌడీ జనార్ధన. రవి కిరణ్ కోలా దర్శకత్వం వహించిన రౌడీ జనార్ధన టైటిల్ గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్టింగ విషయాలు చెప్పారు.

Published on: Dec 23, 2025, 07:13:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్టార్ హీరో విజయ్ దేవరకొండ అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్‌‌లో కనిపిస్తున్న లేటెస్ట్ సినిమా రౌడీ జనార్ధన. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో ఈ క్రేజీ మూవీని స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.

ఇంత మాస్, బ్లడ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు, తొలిసారి విజయ్ దేవరకొండతో అలా చేయిస్తున్నాం.. నిర్మాత దిల్ రాజు కామెంట్స్
ఇంత మాస్, బ్లడ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు, తొలిసారి విజయ్ దేవరకొండతో అలా చేయిస్తున్నాం.. నిర్మాత దిల్ రాజు కామెంట్స్

యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా

టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా రౌడీ జనార్ధన సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా "రౌడీ జనార్థన" సినిమా రూపొందుతోంది.

రౌడీ జనార్ధన టైటిల్ గ్లింప్స్ రిలీజ్

తాజాగా రౌడీ జనార్ధన సినిమా టైటిల్ గ్లింప్స్‌ను నిన్న (డిసెంబర్ 22) హైదరాబాద్‌లో విజయ్ దేవరకొండ అభిమానుల కేరింతల మధ్య గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

నిర్మాత దిల్ రాజు కామెంట్స్

ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. "రౌడీ జనార్థన టైటిల్ గ్లింప్స్ మీకు చూపించేందుకు రవి కిరణ్ కొద్ది రోజులుగా తన టీమ్‌తో వర్క్ చేస్తూ వచ్చాడు. మూడు రోజుల క్రితం ఈ సినిమాను ఎలా చూపించబోతున్నాం అనేది చిన్న స్టోరీ రివీల్ చేశాడు" అని అన్నారు.

తొలిసారిగా విజయ్‌తో

"విజయ్ దేవరకొండ డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ చేస్తూ వచ్చాడు. కానీ, తొలిసారిగా ఈ మూవీలో ఆంధ్రలోని ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడిస్తున్నాం. విజయ్ ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడటం ఈ స్టోరీ విన్నప్పుడు నాకు యూనిక్‌గా అనిపించింది" అని దిల్ రాజు తెలిపారు.

80 దశకం వరల్డ్‌ను

"విజయ్ పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి యూత్‌ఫుల్ మూవీస్ చేశాడు. కానీ, ఇప్పటిదాకా ఇంత మాస్, బ్లడ్ షెడ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు. అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్‌లో విజయ్ కనిపించబోతున్నాడు. 80 దశకం బ్యాక్ డ్రాప్‌లోని వరల్డ్‌ను ఈ సూపర్బ్ టెక్నీషియన్స్ అంతా క్రియేట్ చేశారు" అని దిల్ రాజు పేర్కొన్నారు.

ఆ కష్టాన్ని మేము ఎంకరేజ్ చేస్తుంటే

"రవి కిరణ్ విజన్‌లోని కొత్తదనాన్ని తీసుకొచ్చేందుకు ఈ టీమ్ అంతా కష్టపడుతున్నారు. ఆ కష్టాన్ని మేము ఎంకరేజ్ చేస్తుంటే ఇలాంటి మంచి గ్లింప్స్ మీ ముందుకు వచ్చింది. సినిమా కూడా అలా వచ్చేవరకు రవి కష్టపడి చేయించుకుంటాడని నమ్మకం ఉంది" అని దిల్ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.

చిన్న సినిమా చేసి

"రాజా వారు రాణి గారు అనే చిన్న సినిమా చేసి ఇండస్ట్రీని, ప్రేక్షకుల్ని తన వైపు తిప్పుకోగలిగాడు రవి కిరణ్. రెండో సినిమాకు మంచి స్క్రిప్ట్ అందించాడు. ఇప్పుడు మూడో సినిమాకు రౌడీ జనార్థనతో పెద్ద బాధ్యత పెట్టుకున్నాడు. మీ అందరినీ అలరించేందుకు నెక్ట్స్ ఇయర్ రిలీజ్‌కు మూవీని తీసుకొస్తాం" అని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More