Dil Raju: టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యునరేషన్లు, నకిలీ బాక్సాఫీస్ కలెక్షన్ల పోస్టర్లు, సీఎం రేవంత్ రెడ్డితో తనకు ఉన్న పరిచయం.. ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలపై తాజాగా ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పందించారు. తాజాగా రా టాక్స్ (Raw Talks) పాడ్‌కాస్ట్‌లో ఆయన కొన్ని సంచలన నిజాలు బయటపెట్టారు.

పెద్ద సినిమాల బడ్జెట్‌లు విపరీతంగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం హీరోల రెమ్యునరేషన్లే అని ఓపెన్ అయ్యారు. టాలీవుడ్‌లో ఈగోల వల్ల ఏ హీరో కూడా తన పారితోషికం తగ్గించుకోవడానికి రెడీగా లేరని దిల్ రాజు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ సందర్భంగా ఆయన టాలీవుడ్ మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, బాలీవుడ్ సెలబ్రిటీలు తమ బిజినెస్ స్ట్రాటజీని ఎలా మార్చుకున్నారో లెక్కలతో సహా వివరించారు.
రూ. 300 కోట్ల బడ్జెట్.. హీరోలకే 40 శాతం వాటా
దిల్ రాజు టాలీవుడ్ టాప్ హీరోల మైండ్ సెట్ గురించి మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన విషయాలు రివీల్ చేశారు. తాను ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు హీరోలకు ప్రస్తుత మార్కెట్ పరిస్థితి ఏంటో స్పష్టంగా వివరిస్తానని చెప్పారు. సినిమా బిజినెస్ రేంజ్ ని బట్టి తాను ఎంతవరకు రెమ్యునరేషన్ ఇవ్వగలనో ముందే క్లారిటీ ఇస్తానని, తన ప్లానింగ్ అర్థం చేసుకున్న హీరోలతోనే వర్క్ చేయడానికి ఇష్టపడతానని స్పష్టం చేశారు.
"టాలీవుడ్‌లో ఉన్న టాప్ హీరోలు తమ ఇమేజ్ సమస్యల వల్ల రెమ్యునరేషన్స్ తగ్గించుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఒకవేళ రెమ్యునరేషన్ తగ్గిస్తే తమ మార్కెట్ వాల్యూ, ఇమేజ్ తగ్గిపోతాయని భయపడతారు. ఉదాహరణకు ఒక రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ సినిమా తీస్తుంటే.. అందులో దాదాపు 35 నుండి 40 శాతం బడ్జెట్ కేవలం ఒక్క హీరో రెమ్యునరేషన్ రూపంలోనే వెళ్ళిపోతుంది" అని దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
బాలీవుడ్ లో ప్రాఫిట్ షేరింగ్ మోడల్..
{{/usCountry}}"టాలీవుడ్‌లో ఉన్న టాప్ హీరోలు తమ ఇమేజ్ సమస్యల వల్ల రెమ్యునరేషన్స్ తగ్గించుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఒకవేళ రెమ్యునరేషన్ తగ్గిస్తే తమ మార్కెట్ వాల్యూ, ఇమేజ్ తగ్గిపోతాయని భయపడతారు. ఉదాహరణకు ఒక రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ సినిమా తీస్తుంటే.. అందులో దాదాపు 35 నుండి 40 శాతం బడ్జెట్ కేవలం ఒక్క హీరో రెమ్యునరేషన్ రూపంలోనే వెళ్ళిపోతుంది" అని దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
బాలీవుడ్ లో ప్రాఫిట్ షేరింగ్ మోడల్..
{{/usCountry}}తెలుగు సినిమాతో పోలిస్తే బాలీవుడ్ లో ప్రస్తుతం ఒక అద్భుతమైన మార్పు వచ్చిందని దిల్ రాజు కొనియాడారు. హిందీ సినిమా మార్కెట్‌లో ఇప్పుడు చాలా మంచి సమర్థత ఉందని, దానికి కారణం అక్కడి స్టార్స్ అందరూ రెమ్యునరేషన్లు తీసుకోకుండా 'ప్రాఫిట్ షేరింగ్ మోడల్' (లాభాల్లో వాటా) వైపు అడుగులు వేయడమే అని చెప్పారు. దురదృష్టవశాత్తు ఇది ఇంకా మన టాలీవుడ్‌లో స్టార్ట్ కాలేదన్నారు.
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఉదాహరణ తీసుకుంటూ దిల్ రాజు కొన్ని క్రేజీ విషయాలు చెప్పారు. ఒకప్పుడు అక్షయ్ కుమార్ ఒక్కో సినిమాకు ఏకంగా రూ. 130 కోట్ల వరకు పారితోషికం వసూలు చేసేవారని గుర్తు చేశారు. కానీ ఆ తర్వాత మార్కెట్ కరెక్షన్స్ జరగడం, వరుస డిజాస్టర్లు రావడంతో ఆయన రియాలిటీని గ్రహించి ప్రాఫిట్ షేరింగ్ మోడల్‌కు అంగీకరించారన్నారు.
దీనివల్ల ఒక ప్రొడ్యూసర్‌గా తనకు ఎంతో సంతోషంగా ఉంటుందని, సినిమా నిర్మాణ ఖర్చులు చాలా ఈజీగా రికవర్ అవుతాయని చెప్పారు. ఈ మోడల్ వల్ల హీరోలకు కూడా ప్రాజెక్ట్ పై పూర్తి బాధ్యత పెరుగుతుందని దిల్ రాజు విశ్లేషించారు. టాలీవుడ్ భవిష్యత్తు బాగుండాలి అంటే ఇక్కడి స్టార్స్ కూడా త్వరలోనే ఈ ప్రాఫిట్ షేరింగ్ పద్ధతిని అలవాటు చేసుకోవడం ఎంతో అవసరమని ఆయన ముగించారు.
అవును.. అవన్నీ నకిలీవే
ఇక గేమ్ ఛేంజర్ తొలి రోజు వసూళ్లన్నీ నకిలీవే అన్న ఆరోపణల గురించి ప్రస్తావించగా.. అది నిజమే అని చెప్పారు. ఈ మధ్యే నాగవంశీ చేసిన కామెంట్స్ గురించి కూడా ప్రస్తావిస్తూ.. ఓ ప్రొడ్యూసర్ గా మాట్లాడాల్సి వస్తే ఒరిజినల్ ఏంటి, మేము పోస్టర్ వేస్తుందేంటి అన్నది మా అందరికీ తెలుసు అని చెప్పడం గమనార్హం.
ఫ్యాన్స్ మా హీరోకి ఇంతొచ్చింది.. మా హీరోకి అంతొచ్చింది అని చెప్పుకుంటారు.. గత సినిమా కంటే ఈసారి మరింత ఎక్కువ ఉండాలి అని అనుకుంటారు.. దీంతో ఇవన్నీ తప్పదు. మంచి సినిమా అయితే కచ్చితంగా వసూళ్లు వస్తూనే ఉంటాయి.. లేదంటే మనం ఎంత లేపినా ప్రయోజనం ఉండదు అని దిల్ రాజు ఓపెన్ గా చెప్పడం గమనార్హం.
రేవంత్‌తో 20 ఏళ్ల స్నేహం
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఆయనతో తనకు 20 ఏళ్ల స్నేహం ఉందని అన్నారు. భయ్యా భయ్యా అని పిలుచుకుంటామని కూడా వెల్లడించారు. ఆయనే తనకు ఫోన్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉండాలని చెప్పడంతో తనకు అంతగా ఆసక్తి లేకపోయినా సరే అని చెప్పినట్లు తెలిపారు.