Netflix OTT: సాధారణంగా ప్రతి పండుగకు ఓటీటీల్లో ఎన్నో సినిమాలు వస్తుంటాయి. కానీ పండుగ వాతావరణాన్ని, కుటుంబ విలువల గొప్పదనాన్ని గుర్తుచేసే సినిమాలు మాత్రం అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి కోవకే చెందుతుంది ఈ 'దిల్వాలీ దీపావళి' సినిమా. నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ మూవీ రాబోతుంది.
దిల్వాలీ దీపావళి ఓటీటీ

పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ దీపావళి పండుగకు ఓటీటీ లవర్స్ కు మంచి గిఫ్ట్ ఇవ్వబోతుంది. కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన దిల్వాలీ దీపావళి మూవీ ఈ దీపావళికి స్ట్రీమింగ్ కాబోతుంది. నవంబర్ 5న ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ కానుంది.
స్టోరీ ఏంటంటే?
దిల్వాలీ దీపావళి సినిమా కథ ప్రధానంగా 'అన్ష్ సిక్కా' (మిహిర్ అహుజా) అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేసే అన్ష్.. పంజాబ్ లోని తన మిడిల్ క్లాస్ తల్లిదండ్రులకు మెరుగైన జీవితాన్ని ఇవ్వాలని కలలు కంటాడు. అందుకోసం ఎన్నో ఏళ్లు కష్టపడి, ఓ పెద్ద హైరైజ్ బిల్డింగ్ లో లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేస్తాడు.
అయితే, దీపావళి పండుగ సందర్భంగా ఇంటికి తిరిగి వచ్చిన అన్ష్కు ఓ ఊహించని వాస్తవం ఎదురవుతుంది. కేవలం ఖరీదైన ఇల్లు, ఆధునిక సౌకర్యాలు మాత్రమే సంతోషాన్ని ఇవ్వవని, అది అసలైన ఇల్లుగా అనిపించుకోదని అర్థమవుతుంది. సుఖాలు, సౌకర్యాల కంటే బంధాలే ముఖ్యమని భావించే తల్లిదండ్రుల ఆలోచనలకు, నేటితరం యువకుడికి మధ్య ఉన్న జనరేషన్ గ్యాప్‌ను ఈ సినిమాలో చాలా ఎమోషనల్ గా, కాస్త వినోదం జోడించి చూపించారు.
అద్భుతమైన నటీనటులు
దిల్వాలీ దీపావళి సినిమాలో ప్రతి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా తండ్రి పాత్రలో సీనియర్ నటుడు మనోజ్ పహ్వా నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఆయనతో పాటు నీలు కోహ్లీ, ఔర్రా భట్నాగర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రెండు తరాల మధ్య ఉన్న ఆలోచనా విధానాన్ని, అభిప్రాయభేదాలను దర్శకుడు రితేష్ మీనన్ తెరపై ఎంతో సున్నితంగా ఆవిష్కరించారు.
{{/usCountry}}దిల్వాలీ దీపావళి సినిమాలో ప్రతి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా తండ్రి పాత్రలో సీనియర్ నటుడు మనోజ్ పహ్వా నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఆయనతో పాటు నీలు కోహ్లీ, ఔర్రా భట్నాగర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రెండు తరాల మధ్య ఉన్న ఆలోచనా విధానాన్ని, అభిప్రాయభేదాలను దర్శకుడు రితేష్ మీనన్ తెరపై ఎంతో సున్నితంగా ఆవిష్కరించారు.
{{/usCountry}}ఈ సినిమాకు రీతూ మాగో అద్భుతమైన కథను అందించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ 'టెర్రిబ్లీ టైని టేల్స్' (TTT) ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. గతంలో నెట్‌ఫ్లిక్స్, TTT కాంబినేషన్లో వచ్చిన 'గ్రేటర్ కలేష్', 'ముసాఫిర్ కేఫ్' ప్రాజెక్టుల విజయాల స్ఫూర్తితో ఇప్పుడు ఈ పండుగ చిత్రాన్ని మన ముందుకు తీసుకువస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో పండుగ సందడి
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయి. ఎవరికి వారు ఒంటరి జీవితాలకు అలవాటు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో బంధాల విలువను, 'ఇల్లు' అంటే కేవలం నాలుగు గోడలు కాదు మనుషుల మధ్య ఉన్న ప్రేమ అని చాటిచెప్పే ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ మంచి అనుభూతిని పంచుతుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.
ఈ దీపావళికి కుటుంబ సమేతంగా ఇంట్లోనే కూర్చుని ఆస్వాదించడానికి 'దిల్వాలీ దీపావళి' ఒక బెస్ట్ ఛాయిస్. నవంబర్ 5వ తేదీన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.