...
...
Next Story

Netflix Release: ముందుగానే నెట్‌ఫ్లిక్స్‌ పండగ..ఫ్యామిలీతో కలిసి చూసే ఫీల్ గుడ్ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్..ఇదే ట్విస్ట్!

Netflix Release: ఓటీటీ ఆడియన్స్ కోసం పాపులర్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ ముందుగానే దివాళీ పండగను తీసుకొచ్చింది. దీపావళి పండగను సెలబ్రేట్ చేసుకునేందుకు ఫీల్ గుడ్ హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామాను స్ట్రీమింగ్ చేస్తోంది. ఇవాళ డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అయిన ఈ మూవీ పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.

Published on: Nov 5, 2026, 05:47:12 IST
Advertisement

Netflix Release: ఓటీటీ లవర్స్ అలెర్ట్. డిజిటల్ స్ట్రీమింగ్ ఫ్యామిలీ వినోదాన్ని అందించడానికి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ కొత్త సినిమాను తీసుకొచ్చింది. డైరెక్ట్ గా నెట్‌ఫ్లిక్స్‌ మూవీగా ఈ చిత్రం ఓటీటీలోనే ఇవాళ (నవంబర్ 5) రిలీజైంది. ఆ సినిమానే ‘ 'దిల్‌వాలీ దివాళీ' (Dilwali Diwali). ఇదొక అందమైన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా.

దిల్‌వాలీ దివాళీ ఓటీటీ

ముందుగానే నెట్‌ఫ్లిక్స్‌ పండగ..ఫ్యామిలీతో కలిసి చూసే ఫీల్ గుడ్ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్..ఇదే ట్విస్ట్!
ముందుగానే నెట్‌ఫ్లిక్స్‌ పండగ..ఫ్యామిలీతో కలిసి చూసే ఫీల్ గుడ్ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్..ఇదే ట్విస్ట్!

ఓటీటీలోకి క్రైమ్, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్లు కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉన్నాయి. వీటి మధ్యలో ఫ్యామిలీ ఆడియన్స్ కు కాస్త ఉపశమనం ఇచ్చేలా, ఇంట్లో కుటుంబమంతా కలిసి కూర్చొని చూసేలా దిల్‌వాలీ దివాళీ మూవీని నెట్‌ఫ్లిక్స్‌ తీసుకొచ్చింది. దీపావళి పండగను ముందే తెస్తూ గురువారం నుంచే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తోంది.

మూవీ స్టోరీ ఏంటంటే?

దిల్‌వాలీ దివాళీ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. ఇది ఒక పక్కా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. అన్ష్ సిక్కా (మిహిర్ అహుజా) అనే యువకుడు చాలా ఏళ్లుగా విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. తన మిడిల్ క్లాస్ పంజాబీ తల్లిదండ్రులకు (మనోజ్ పహ్వా, నీలు కోహ్లి) మరింత విలాసవంతమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని అందించాలని ప్రతి కొడుకులాగే అతను కూడా కలలు కంటాడు. అందుకోసం ఎంతో కష్టపడి ఒక హై-రైజ్ బిల్డింగ్‌లో ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేస్తాడు.

అదే ట్విస్ట్

దీపావళి పండుగ సందర్భంగా తన కుటుంబానికి ఈ సరికొత్త ఇంటిని బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరచడానికి అన్ష్ ఇండియాకు వస్తాడు. కొత్త ఇల్లు చూసి తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారని అతను భావిస్తాడు. కానీ, జీవితకాల జ్ఞాపకాలు, పాత బంధాలు ముడిపడి ఉన్న పాత ఇంటిని వదిలి ఈ సరికొత్త ఫ్లాట్‌లోకి మారడానికి అతని తల్లిదండ్రులు అంతగా ఉత్సాహం చూపించరు.

ఈ దిల్‌వాలీ దివాళీ మూవీలో మిహిర్ అహుజా, మనోజ్ పహ్వా, నీలు కోహ్లి, ఔర్రా భట్నాగర్ తదితరులు నటించారు. దీనికి రితేష్ మీనన్ డైరెక్టర్. ఈ పండగ పూట ఇంట్లో ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చుని ఓటీటీలో చూసేందుకు ఈ మూవీ పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks