Director Cheating: స్టార్ హీరోలతో హిట్స్ కొట్టిన ఓ టాలీవుడ్ బడా డైరెక్టర్ పై ఏకంగా రూ.3.5 కోట్ల చీటింగ్ కేసు నమోదు కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 'పిల్ల జమీందార్', 'భాగమతి' లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ జి. అశోక్ బాబు (G. Ashok Babu) ఇప్పుడు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) పోలీసుల విచారణలో ఉన్నాడు. ఒక కుర్రాడిని హీరోగా లాంచ్ చేస్తానని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఈ డైరెక్టర్ పై ఆరోపణలు వస్తున్నాయి.
డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ చూసి బుక్కయిన ఫ్యామిలీ

గతంలో నానితో చేసిన 'పిల్ల జమీందార్', అనుష్కతో తీసిన 'భాగమతి' సినిమాలు అశోక్ బాబుకు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఆ ట్రాక్ రికార్డ్ చూసే హనుమంతరావు అనే వ్యక్తి తన కొడుకుని హీరోగా పరిచయం చేయాలని ఈ డైరెక్టర్ ను అప్రోచ్ అయ్యాడు. దీన్ని ఆసరాగా చేసుకున్న అశోక్ బాబు.. వాళ్ల అబ్బాయిని లీడ్ రోల్ లో పెట్టి ఓ గ్రాండ్ ప్రాజెక్ట్ తీస్తానని నమ్మబలికాడు.
కొత్త హీరోకి సరైన బజ్ రావాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉండాలని అశోక్ బాబు వాళ్లకు అందమైన కలలు చూపించాడు. సినిమా ప్రొడక్షన్ ఖర్చుల పేరుతో విడతల వారీగా ఏకంగా రూ.3.5 కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇన్ని కోట్లు తీసుకున్న తర్వాత కూడా కనీసం సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేయకపోవడంతో ఆ ఫ్యామిలీకి డౌట్ వచ్చింది.
పదే పదే అడిగినా డైరెక్టర్ నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడం, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో హనుమంతరావు ఫ్యామిలీ పోలీసులను ఆశ్రయించింది. టాలీవుడ్ లో కొత్త వాళ్లను ఎంకరేజ్ చేసే ముసుగులో ఇలాంటి మోసాలు జరగడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. రియల్ ఎస్టేట్, బిజినెస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న చాలామంది పేరెంట్స్ తమ పిల్లలను వెండితెర మీద చూసుకోవాలనే క్రేజ్ తో ఈజీగా ఇలాంటి బుట్టలో పడిపోతున్నారు.
సైబరాబాద్ పోలీసుల ఎంట్రీ..
హనుమంతరావు ఇచ్చిన ఫిర్యాదుతో సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు గత నెలలోనే డైరెక్టర్ పై అఫీషియల్ గా చీటింగ్ కేసు ఫైల్ చేశారు. శుక్రవారం (జులై 10) నాడు విచారణకు హాజరు కావాలని అశోక్ బాబుకు నోటీసులు పంపడంతో ఈ మోసం గురించి బయటకు తెలిసింది. విచారణలో భాగంగా ఈ ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి.. ఆ రూ.3.5 కోట్లు ఎక్కడికి దారి మళ్లించారనే విషయాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
{{/usCountry}}హనుమంతరావు ఇచ్చిన ఫిర్యాదుతో సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు గత నెలలోనే డైరెక్టర్ పై అఫీషియల్ గా చీటింగ్ కేసు ఫైల్ చేశారు. శుక్రవారం (జులై 10) నాడు విచారణకు హాజరు కావాలని అశోక్ బాబుకు నోటీసులు పంపడంతో ఈ మోసం గురించి బయటకు తెలిసింది. విచారణలో భాగంగా ఈ ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి.. ఆ రూ.3.5 కోట్లు ఎక్కడికి దారి మళ్లించారనే విషయాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
{{/usCountry}}ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతోంది. గత కొన్నేళ్లుగా అశోక్ బాబు నుంచి చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్ ఏమీ రాలేదు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉండటం వల్లే అతను ఈ ఈజీ మనీ రూట్ ఎంచుకున్నాడా అనే యాంగిల్ లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అవసరమైతే మరోసారి కూడా ఈ డైరెక్టర్ ను విచారణకు పిలిచే ఛాన్స్ ఉందని పోలీసులు స్పష్టం చేశారు.