...
...
Next Story

Peddi: జాన్వీ కంటే ముందు ఆమె చెల్లి ఖుషీ కపూర్‌కు పెద్ది కథ చెప్పాను, ఆ కారణంతో తనను వద్దనుకున్నా: బుచ్చిబాబు కామెంట్స్

Buchi Babu Sana On Peddi Story Narrated To Khushi Kapoor First: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే జాన్వీ కపూర్ కంటే ముందుగా పెద్ది కథను ఆమె చెల్లి ఖుషీ కపూర్‌కు చెప్పినట్లు బుచ్చిబాబు సాన చెప్పడం వైరల్ అవుతోంది.

Published on: May 16, 2026, 12:44:28 IST
Advertisement

Buchi Babu Sana On Peddi Story Narrated To Khushi Kapoor First: 'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసిన యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఇప్పుడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో 'పెద్ది' అనే భారీ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా పెద్ది సినిమా విడుదల కానున్నట్లు ఇటీవల బుచ్చిబాబు సాన అధికారికంగా ప్రకటించారు.

జాన్వీ కపూర్ హీరోయిన్‌గా

జాన్వీ కంటే ముందు ఆమె చెల్లి ఖుషీ కపూర్‌కు పెద్ది కథ చెప్పాను, ఆ కారణంతో తనను వద్దనుకున్నా: బుచ్చిబాబు కామెంట్స్
జాన్వీ కంటే ముందు ఆమె చెల్లి ఖుషీ కపూర్‌కు పెద్ది కథ చెప్పాను, ఆ కారణంతో తనను వద్దనుకున్నా: బుచ్చిబాబు కామెంట్స్

ఈ క్రేజీ సినిమాలో బాలీవుడ్ భామ, దేవర బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం మొదట జాన్వీని కాకుండా ఆమె చెల్లెలు ఖుషీ కపూర్‌ను అనుకున్నారనే విషయాన్ని తాజాగా దర్శకుడు స్వయంగా వెల్లడించారు.

ఒకే ఇంట్లో రెజెక్షన్..

పెద్ది సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బుచ్చిబాబు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. "నేను మొదట 'అచ్చియమ్మ' పాత్రను ఖుషీ కపూర్‌కు వినిపించాను. కానీ, ఆమెను పర్సనల్‌గా చూసిన తర్వాత ఈ క్యారెక్టర్‌కు ఆమె చాలా చిన్న పిల్లలా అనిపించింది" అని డైరెక్టర్ బుచ్చిబాబు తెలిపారు.

"ఒకే ఇంట్లో ఉంటూ చెల్లిని వద్దని, అక్కకు కథ చెప్పాల్సి రావడం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఈ విషయానికి ఖుషీ ఎక్కడైనా ఫీలయ్యిందా అని జాన్వీ కపూర్‌ని కూడా అడిగాను" అని పెద్ది దర్శకుడు బుచ్చిబాబు సాన పేర్కొన్నారు. సినిమాకు ఏది కావాలో ఆ కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదని, మొదటి నుంచి ఈ పాత్రకు జాన్వీనే కరెక్ట్ అని తన మనసు బలంగా నమ్మిందని ఆయన వివరించారు.

కళ్ల ముందు జాన్వీనే

'పెద్ది' చిత్రం పక్కా రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. 1980ల నాటి ఆంధ్రప్రదేశ్ పల్లెటూరి వాతావరణాన్ని ఈ సినిమాలో అద్భుతంగా ప్రతిబింబించనున్నారు. ఇందులో క్రికెట్, సాంప్రదాయ కుస్తీ (పెహల్వానీ) అనే రెండు భిన్నమైన క్రీడల చుట్టూ ఈ కథ నడుస్తుందని ప్రచారం సాగుతోంది.

మే 18న పెద్ది ట్రైలర్

ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన పెద్ది సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక, పెద్ది మూవీ ట్రైలర్‌ను మే 18న విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

ఇటీవల హైదరాబాద్ వీధుల్లో రామ్ చరణ్, బుచ్చిబాబు కలిసి కారులో తిరుగుతూ ఒక ప్రమోషనల్ వీడియో షూట్ చేశారు. ఈ సందర్భంగా చరణ్ నటనపై బుచ్చిబాబు ప్రశంసల జల్లు కురిపించారు.

స్టార్‌డమ్ పక్కనపెట్టిన రామ్ చరణ్

"ఈ సినిమా ద్వారా చరణ్ సర్ నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలను ఇచ్చారు. 'పెద్ది' అద్భుతంగా రాబోతోంది, మేమంతా ప్రాణం పెట్టి పనిచేశాం. చరణ్ అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ తన ఇమేజ్‌ను పక్కనపెట్టి కేవలం కథను నమ్మి ఈ సినిమా చేశారు" అని బుచ్చిబాబు కొనియాడారు.

బాక్సాఫీస్ వద్ద పెద్ది

వృద్ధి సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న పెద్ది చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంతటి భారీ తారాగణం ఉన్న పెద్ది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks