ఆర్వీ సినిమాస్ బ్యానర్‌పై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్ వీ రెడ్డి ) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన సినిమా "అరి". లింగ గుణపనేని కో ప్రొడ్యూసర్‌గా ఈ మూవీకి వ్యవహరించారు.
అరిలోని కీలక పాత్రలు

వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, సురభి ప్రభావతి, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష కీలక పాత్రల్లో నటించారు. "పేపర్ బాయ్" చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ ఈ అరి సినిమాను తెరకెక్కించారు.
మంచి వసూళ్లతో అరి
"అరి" సినిమా ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల అంటే అక్టోబర్ 10వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వచ్చి ప్రేక్షాకదరణతో మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో అరి సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు జయశంకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మంచి రివ్యూస్, రేటింగ్స్
దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ.. "అరి సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు, మంచి రివ్యూస్, రేటింగ్స్ ఇచ్చిన మీడియా వారికి థ్యాంక్స్. మూవీకి స్లోగా ఓపెనింగ్స్ వచ్చి పికప్ అవుతుందని ముందే అనుకున్నాం" అని అన్నారు.
కష్టపడిన సినిమాకు ఇలా అయిందేంటని
"అయితే రెండో రోజునే శ్రీకాంత్ అయ్యంగార్ ఇష్యూ వల్ల మా సినిమా పోస్టర్స్‌ను థియేటర్స్ దగ్గర చించివేయడం చూసి బాధగా అనిపించింది. ఎంతో కష్టపడి చేసిన సినిమాకు ఇలా జరుగుతుందేంటని ఇబ్బందిపడ్డాం. ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. థర్డ్ డే నుంచి అరి సినిమా థియేటర్స్‌లో ప్రేక్షకుల సందడి కనిపించింది" అని జయశంకర్ తెలిపారు.
పరిష్కారం చూపించలేదు
{{/usCountry}}"అయితే రెండో రోజునే శ్రీకాంత్ అయ్యంగార్ ఇష్యూ వల్ల మా సినిమా పోస్టర్స్‌ను థియేటర్స్ దగ్గర చించివేయడం చూసి బాధగా అనిపించింది. ఎంతో కష్టపడి చేసిన సినిమాకు ఇలా జరుగుతుందేంటని ఇబ్బందిపడ్డాం. ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. థర్డ్ డే నుంచి అరి సినిమా థియేటర్స్‌లో ప్రేక్షకుల సందడి కనిపించింది" అని జయశంకర్ తెలిపారు.
పరిష్కారం చూపించలేదు
{{/usCountry}}"అరిషడ్వర్గాల గురించి ఎంతోమంది గొప్పవాళ్లు చెబుతూ వచ్చారు. గానీ వాటికి పరిష్కారం చూపించలేదు. ఈ ఆలోచనతోనే అరి చిత్రాన్ని రూపొందించాను. నేను చూసిన సినిమాలు కొన్ని ఇలాంటి కాన్సెప్ట్‌తో చిత్రాన్ని చేసేందుకు స్ఫూర్తినిచ్చాయి" దర్శకుడు జయశంకర్ పేర్కొన్నారు.
ఓటీటీలోకి రావడం లేదు
"ఈ అరి సినిమా కథతో త్వరలోనే పుస్తకాన్ని తీసుకొస్తున్నాం. మా సినిమా ఇప్పుడే ఓటీటీలోకి రావడం లేదు. థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యాక ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం" అని అరి డైరెక్టర్ జయశంకర్ వెల్లడించారు.