సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ బ్లాక్‌బస్టర్ అయిన సంగతి తెలుసు కదా. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకుపైగా వసూలు చేసింది. కానీ ఈ మూవీకి వచ్చిన ‘ఎ’ సర్టిఫికెట్ వల్ల తాము మరో రూ.50 కోట్లు కోల్పోయినట్లు తాజాగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వెల్లడించాడు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) మొదట 35 కట్స్ చెప్పిందని, తర్వాత సినిమాకు 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చిందని చెప్పాడు.
‘కూలీ’ సినిమాకు సెన్సార్ చిక్కులు

దళపతి విజయ్ నటిస్తున్న 'జన నాయగన్' సినిమా సెన్సార్ సర్టిఫికెట్ కోసం ఇబ్బందులు పడుతున్న వార్తల నేపథ్యంలో.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మీడియాతో మాట్లాడుతూ తన సినిమా 'కూలీ' కూడా సెన్సార్ బోర్డుతో పడ్డ ఇబ్బందులను వివరించాడు.
సెన్సార్ బోర్డు మొదట 35 కట్స్ సూచించిందని లోకేష్ చెప్పాడు. కానీ ఈ మార్పులు చేస్తే సినిమా ఇంపాక్ట్ దెబ్బతింటుందని తాను భావించినట్లు తెలిపాడు. మరోసారి పరిశీలిస్తారనే జరుగుతుందనే ఆశతో.. నిర్మాతలు మళ్లీ సెన్సార్ కోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా ఫలితం మారలేదట.
"వారు అడిగిన 9 పదాలను మ్యూట్ చేయడానికి నేను ఒప్పుకున్నాను. కానీ 35 కట్స్ కి నో చెప్పాను. 'ఎ' సర్టిఫికెట్‌తో పూర్తి సినిమాను విడుదల చేయాలా లేక 'యూ/ఏ' సర్టిఫికెట్‌తో అసంపూర్ణమైన సినిమాను విడుదల చేయాలా అనేదే మా ముందున్న ప్రశ్న. మేము రీ-సెన్సార్ కోసం వెళ్లాము. కానీ వారు మళ్లీ అవే 35 కట్స్ సూచించారు" అని అతడు వెల్లడించాడు.
రాజీపడటం ఇష్టం లేకే..
కూలీ మూవీ కథ విషయంలో రాజీ పడటానికి లోకేష్ ఇష్టపడలేదు. కట్స్ వద్దనుకుంటే సినిమాకు 'ఎ' సర్టిఫికెట్ తీసుకోవచ్చని అవకాశం ఇచ్చారు. సినిమాలో మిగతా అన్నింటికంటే.. ఎలక్ట్రిక్ క్రిమేషన్ చూపించడమే సినిమాకు 'యూ' లేదా 'యూ/ఏ' సర్టిఫికెట్ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణమని దర్శకుడు వెల్లడించాడు.
సినిమాలోని సీన్స్ కత్తిరించకూడదని నిర్ణయించుకున్న లోకేష్.. సెన్సార్ బోర్డు ఇచ్చిన 'ఎ' సర్టిఫికెట్‌తోనే సినిమాను విడుదల చేశాడు. అయితే దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. పరిమిత ప్రేక్షకులు మాత్రమే సినిమాను చూడగలిగారు కాబట్టి.. దీనివల్ల సినిమాకు రూ. 40 నుంచి 50 కోట్ల నష్టం వాటిల్లిందని దర్శకుడు పేర్కొన్నాడు.
‘కూలీ’ సినిమా విశేషాలు
{{/usCountry}}సినిమాలోని సీన్స్ కత్తిరించకూడదని నిర్ణయించుకున్న లోకేష్.. సెన్సార్ బోర్డు ఇచ్చిన 'ఎ' సర్టిఫికెట్‌తోనే సినిమాను విడుదల చేశాడు. అయితే దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. పరిమిత ప్రేక్షకులు మాత్రమే సినిమాను చూడగలిగారు కాబట్టి.. దీనివల్ల సినిమాకు రూ. 40 నుంచి 50 కోట్ల నష్టం వాటిల్లిందని దర్శకుడు పేర్కొన్నాడు.
‘కూలీ’ సినిమా విశేషాలు
{{/usCountry}}రజనీకాంత్ కాకుండా 'కూలీ' సినిమాలో నాగార్జున అక్కినేని, సౌబిన్ సాహిర్, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, రచితా రామ్ నటించారు. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్, పూజా హెగ్డే కూడా అతిథి పాత్రల్లో కనిపించారు. గతేడాది ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేయగలిగింది.
లోకేష్ కనగరాజ్ త్వరలో అల్లు అర్జున్‌తో ఇంకా పేరు పెట్టని సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అలాగే కార్తీతో చేయబోయే 'ఖైదీ 2' సినిమా కూడా అల్లు అర్జున్ మూవీ తర్వాతే పట్టాలెక్కుతుందని అతడు స్పష్టం చేశాడు.