హైదరాబాద్‌లో శనివారం (డిసెంబర్ 27) జరిగిన 'ది రాజా సాబ్' (The Raja Saab) ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మూవీ టీమ్ లోని వాళ్లు మాట్లాడిన విషయాలు చాలా మందిలో ఆసక్తి రేపుతున్నాయి.ముఖ్యంగా వేదికపై డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. రాజమౌళి ప్రభాస్‌ను ఒక "మీడియం రేంజ్ హీరో" స్థాయి నుంచి పాన్ ఇండియా స్టార్‌గా మార్చారని అనడం ఇప్పుడు దుమారం రేపుతోంది. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
మారుతి కామెంట్స్ ఇలా..

ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ది రాజా సాబ్' సినిమా ఈవెంట్ అభిమానుల కేరింతల మధ్య అట్టహాసంగా జరిగింది. అయితే ఎమోషనల్ స్పీచ్ ఇస్తున్న క్రమంలో డైరెక్టర్ మారుతి నోటి నుంచి వచ్చిన ఒక మాట ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది.
తెలుగు సినిమా రేంజ్ గురించి మాట్లాడుతూ మారుతి ఒక ఉదాహరణ చెప్పాడు. "నేను సౌత్ ఆఫ్రికాలోని ఒక మారుమూల గ్రామానికి వెళ్ళాను. అక్కడ ఒక వ్యక్తికి నేను ఇండియా నుంచి వచ్చానని చెప్పాను. మా హీరో ప్రభాస్ తెలుసా అని అడిగాను. 'ఓహో బాహుబలి హీరోనా?' అని ఓ వ్యక్తి నన్ను అడిగాడు. అంటే మసాయి మారా తెగ వాళ్లకు కూడా ప్రభాస్ తెలుసు. దీనికంతటికీ కారణం రాజమౌళి గారు. ఈ రోజు అందరూ కాలర్ ఎగరేసుకుని పాన్ ఇండియా అంటున్నారు కానీ.. ఒక ‘మీడియం రేంజ్ హీరో’ని తీసుకుని, ప్రాణం పెట్టి పాన్ ఇండియా రేంజ్ కటౌట్‌గా నిలబెట్టింది రాజమౌళి గారే. ఆయనకు అందరూ రుణపడి ఉండాలి" అని మారుతి వ్యాఖ్యానించాడు.
ఫ్యాన్స్ ఫైర్.. సోషల్ మీడియా వార్
రాజమౌళిని పొగడటం ఓకే కానీ.. ప్రభాస్‌ను 'మీడియం రేంజ్ హీరో' అనడం ఏంటని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మారుతికి కౌంటర్లు వేస్తున్నారు. "ప్రభాస్ నీలాంటి మీడియం రేంజ్ డైరెక్టర్‌కి ఛాన్స్ ఇచ్చాడు, అది గుర్తుపెట్టుకో" అని ఒకరు అనగా.. మరొకరు "బాహుబలికి ముందే ప్రభాస్‌కు వర్షం, ఛత్రపతి, డార్లింగ్, మిర్చి లాంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అప్పట్లో ఎన్టీఆర్ కంటే ప్రభాస్ సక్సెస్ రేట్ బెటర్" అని వాదించారు.
మారుతికి మద్దతుగానూ..
{{/usCountry}}రాజమౌళిని పొగడటం ఓకే కానీ.. ప్రభాస్‌ను 'మీడియం రేంజ్ హీరో' అనడం ఏంటని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మారుతికి కౌంటర్లు వేస్తున్నారు. "ప్రభాస్ నీలాంటి మీడియం రేంజ్ డైరెక్టర్‌కి ఛాన్స్ ఇచ్చాడు, అది గుర్తుపెట్టుకో" అని ఒకరు అనగా.. మరొకరు "బాహుబలికి ముందే ప్రభాస్‌కు వర్షం, ఛత్రపతి, డార్లింగ్, మిర్చి లాంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అప్పట్లో ఎన్టీఆర్ కంటే ప్రభాస్ సక్సెస్ రేట్ బెటర్" అని వాదించారు.
మారుతికి మద్దతుగానూ..
{{/usCountry}}అయితే కొందరు సినీ ప్రియులు మాత్రం మారుతి చెప్పింది ప్రాక్టికల్‌గా నిజమే అంటున్నారు. "బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ రాకముందు.. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌ల మార్కెట్ వేరు. అప్పట్లో మహేష్ బాబు, ఎన్టీఆర్ టాప్ లీగ్‌లో ఉండేవారు. బాహుబలికి ముందు ప్రభాస్‌కు 100 కోట్ల సినిమా లేదు కదా.. కాబట్టి మారుతి అన్న దాంట్లో తప్పు లేదు" అని కొందరు సమర్థిస్తున్నారు.
ఇక ది రాజా సాబ్ మూవీ విషయానికి వస్తే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది. ఇందులో ప్రభాస్, సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కీలక పాత్రల్లో నటించారు. ఇది ప్రభాస్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఫాంటసీ హారర్ కామెడీ సినిమా.