...
...
Next Story

Meher Ramesh: మొన్ననే కూతురి పెళ్లి.. ఇప్పుడు తీవ్ర విషాదం.. శొోకసంద్రంలో డైరెక్టర్ మెహర్ రమేష్ కుటుంబం.. ఏమైందంటే?

Meher Ramesh: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కొద్ది రోజుల క్రితమే తన కూతురి పెళ్లితో రమేష్ కుటుంబంలో సంతోషం నిండింది. కానీ ఇప్పుడు అతని ఫ్యామిలీ శోక సంద్రంలో మునిగిపోయింది. అసలు ఏమైందో ఇక్కడ చూసేయండి.

Published on: Jul 22, 2026, 10:44:41 IST
Advertisement

Meher Ramesh: తెలుగు చిత్రసీమలో ప్రముఖ దర్శకుడిగా గుర్తింపు పొందిన మెహర్ రమేష్ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. మొన్ననే కుమార్తె పెళ్లిని అతను అంగరంగ వైభవంగా జరిపించాడు. కానీ ఇప్పుడేమో అతని చిన్నక్క మెహర్ జ్యోతి సుంకర అకాల మరణం చెందడంతో మెహర్ రమేష్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

మెహర్ రమేష్ అక్క మరణం

మొన్ననే కూతురి పెళ్లి.. ఇప్పుడు తీవ్ర విషాదం.. శొోకసంద్రంలో డైరెక్టర్ మెహర్ రమేష్ కుటుంబం.. ఏమైందంటే?
మొన్ననే కూతురి పెళ్లి.. ఇప్పుడు తీవ్ర విషాదం.. శొోకసంద్రంలో డైరెక్టర్ మెహర్ రమేష్ కుటుంబం.. ఏమైందంటే?

డైరెక్టర్ మెహర్ రమేష్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతని చిన్నక్క మెహర్ జ్యోతి సుంకర కన్నుమూశారు. గత రెండు వారాలుగా (14 రోజులుగా) తీవ్రమైన వైరల్ న్యుమోనియా సమస్యతో ఆమె బాధపడ్డారు.

ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తీవ్రమవ్వడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. జూలై 21 రాత్రి ఆమె పరిస్థితి క్షీణించి, రాత్రి 9.45 గంటలకు విజయవాడలో జ్యోతి తుదిశ్వాస విడిచినట్లు మెహర్ రమేష్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ ద్వారా వెల్లడించాడు. తన అక్కతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అతను తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశాడు.

పెళ్లి సందడి తీరకముందే ఘోరం

ఈ సోదరి మరణం మెహర్ రమేష్ కుటుంబాన్ని మరింత వేదనకు గురిచేయడానికి ప్రధాన కారణం.. కొద్ది రోజుల క్రితమే జరిగిన సంఘటన. ఈ జూలై 1న మెహర్ రమేష్ కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది. ఆ వేడుకకు మెహర్ జ్యోతి హాజరై, కుటుంబ సభ్యులందరితో ఎంతో సంతోషంగా గడిపారు.

మెహర్ రమేష్ అక్క మృతి వార్త తెలిసిన వెంటనే టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి మెహర్ రమేష్ అత్యంత ఆప్తుడు కావడంతో, మెగా కాంపౌండ్‌తో పాటు టాలీవుడ్ అగ్ర నటీనటులు మెహర్ రమేష్‌ను పరామర్శిస్తూ ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఫ్యాన్స్ కు షాక్

మెహర్ రమేష్ ఫ్యాన్స్ కు కూడా ఈ వార్త షాక్ కలిగించింది.

‘‘నా ప్రియమైన చిన్నక్క “మెహెర్ జ్యోతి సుంకర ”. ఈ రోజు 9:45 pm కి విజయవాడ లో స్వర్గస్తులైనారు. వైరల్ న్యూమోనియా తో గత 14 రోజులు గా చికిత్స పొందుతూ అనంత లోకాలకి వెళ్లి పోయారు. నా చిన్నప్పటి నుంచి తను నా అండ. ప్రేమ గా నా కూతురి పెళ్లి దగ్గరుండి జరిపించి ,శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల దర్శనం చేసుకుని ఎంతో ఆనంద పడిన మా అక్క ఇప్పుడు ఆ దేవుడి దగ్గరకి ఇంత తొందరగా వెళ్లిపోవడం మా కుటుంబానికి తీరని లోటు’’ అని మెహర్ రమేష్ ఎమోషనల్ ట్వీట్ పెట్టాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks