...
...
Next Story

Nag Ashwin: నాగ్ అశ్విన్‌కు షూటింగ్ సమయంలో కోపమొస్తే ఏం చేస్తాడో తెలుసా? కల్కి 2898 ఏడీ డైరెక్టర్ కామెంట్స్ వైరల్

Nag Ashwin: డైరెక్టర్ నాగ్ అశ్విన్.. 'కల్కి 2898 ఏడీ' లాంటి విజువల్ వండర్ ను ఎంత కూల్ గా హ్యాండిల్ చేశారో అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అంత పెద్ద సినిమాల షూటింగ్స్ జరుగుతున్నప్పుడు సెట్స్ పై తనకు కోపం వస్తే ఎలా రియాక్ట్ అవుతారు అనే విషయంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

Published on: Jun 16, 2026 09:47 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Nag Ashwin: లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన వినూత్న చిత్రం 'సింగ్ గీతం' (Sing Geetham)కు నాగ్ అశ్విన్ సమర్పకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో నాగ్ అశ్విన్ బిజీగా ఉన్నారు.

Nag Ashwin: నాగ్ అశ్విన్‌కు షూటింగ్ సమయంలో కోపమొస్తే ఏం చేస్తాడో తెలుసా? కల్కి 2898 ఏడీ డైరెక్టర్ కామెంట్స్ వైరల్
Nag Ashwin: నాగ్ అశ్విన్‌కు షూటింగ్ సమయంలో కోపమొస్తే ఏం చేస్తాడో తెలుసా? కల్కి 2898 ఏడీ డైరెక్టర్ కామెంట్స్ వైరల్

ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూల సమయంలో జర్నలిస్టులు ఆయన్ను ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారు. 'కల్కి 2898 ఏడీ' లాంటి భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు చేస్తున్నప్పుడు.. సెట్స్ పై ఎప్పుడైనా కంట్రోల్ తప్పి కోపం వస్తుందా అని ప్రశ్నించారు.

కోపం వస్తే అసిస్టెంట్లపై అరుస్తాడా? నాగ్ అశ్విన్ ఓపెన్ టాక్

దానికి నాగ్ అశ్విన్ చాలా ప్రాక్టికల్ గా, మెచ్యూర్డ్ గా సమాధానం ఇచ్చారు. "షూటింగ్ జరుగుతున్నప్పుడు కచ్చితంగా కొన్ని విషయాల్లో నాకు కూడా టెన్షన్ వస్తుంది. మూడ్ అప్సెట్ అవుతుంది. కానీ నా కోపాన్ని, చిరాకును నా చుట్టూ ఉన్న వాళ్లపై చూపించడానికి అస్సలు ఇష్టపడను. ఒకవేళ నేను కంట్రోల్ తప్పి సెట్స్ లో ఉన్న వాళ్లపై గట్టిగా అరిస్తే.. అక్కడ వాతావరణం దెబ్బతింటుంది, పని మరింత పాడవుతుంది. చివరకు అది రీ-షూట్స్ వరకు దారితీస్తుంది" అని చెప్పారు. మనుషుల మనస్తత్వాలను అర్థం చేసుకుంటూ ఆయన మరికొన్ని విషయాలు పంచుకున్నారు.

నా విజన్ కోసం వాళ్లు ప్రాణం పెడుతున్నారు

సెట్స్ లో ఉండే సిబ్బంది ఇంపార్టెన్స్ గురించి నాగ్ అశ్విన్ చెప్తూ.. "మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి.. అక్కడ పని చేసే ప్రతి ఒక్కరూ నీ మైండ్ లో ఉన్న విజన్ ను స్క్రీన్ పై తీసుకురావడం కోసం పగలు రాత్రి కష్టపడుతున్నారు. ఒక డైరెక్టర్ గా అక్కడ ఉన్న ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పైనో లేదా మేనేజర్ పైనో అరిచేయడం చాలా ఈజీ. కానీ దానివల్ల సమస్య పరిష్కారం కాదు. అందుకే నేను ఎప్పుడూ సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించాలో మాత్రమే ఆలోచిస్తాను. అయితే కొన్నిసార్లు నాపై నాకే ఎక్కువ కోపం వస్తుంది. సెట్స్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు.. దాన్ని ముందే ఎందుకు గమనించలేకపోయాను అని నాలో నేనే బాధపడుతుంటాను" అని నాగ్ అశ్విన్ చాలా నిజాయితీగా చెప్పుకొచ్చారు.

సాధారణంగా వందల కోట్ల బడ్జెట్, వేలాది మంది సిబ్బంది ఉండే భారీ సినిమాల సెట్స్ పై దర్శకులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు. చాలామంది డైరెక్టర్లు స్పాట్ లో అరుస్తూ రూడ్ గా బిహేవ్ చేయడం ఇండస్ట్రీలో చూస్తూనే ఉంటాం. కానీ నాగ్ అశ్విన్ లాంటి కొత్త తరం మేకర్స్ ఇంత కూల్ మైండ్ సెట్ తో ఉండటం వల్లే 'కల్కి' లాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న విజువల్స్ సాధ్యమయ్యాయి. ఈ కూల్ ఆటిట్యూడ్ 'కల్కి 2' అవుట్‌పుట్ ను మరింత బాగా మార్చడంలో సాయం చేస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe