టాలీవుడ్ సూపర్ హీరో మూవీ ఏ మాస్టర్ పీస్ డైరెక్టర్ దర్శకత్వం వహించిన మరో లేటెస్ట్ మూవీ కిల్లర్. గుప్పెడంత మనసు సీరియల్ నటి జ్యోతి పూర్వజ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌గా మలిచారు. పూర్వజ్ దర్శకత్వంతోపాటు నటించారు.
కిల్లర్ నటీనటులు

మనీష్ గిలాడ, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి నటించిన కిల్లర్ మూవీని థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ పతాకాలపై పూర్వజ్, పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మించారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా ఉన్నారు.
ఫైర్ అండ్ ఐస్ సాంగ్ లాంచ్
త్వరలో కిల్లర్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు. అయితే, ఇటీవల కిల్లర్ మూవీ నుంచి ఫైర్ అండ్ ఐస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫైర్ అండ్ ఐస్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో కిల్లర్ మూవీ డైరెక్టర్ పూర్వజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతుంది
కిల్లర్ డైరెక్టర్ పూర్వజ్ మాట్లాడుతూ.. "తెలుగు సినిమా కొత్త దారిలో వెళ్తోంది. ఇలాంటి టైమ్‌లో మేము చేసిన కిల్లర్ సినిమా మరో సరికొత్త ప్రయత్నంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అది ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతుంది" అని అభిప్రాయపడ్డారు.
ఐదు భిన్నమైన పాత్రల్లో
"ఈ చిత్రంలో హీరోయిన్ జ్యోతి పూర్వజ్ ఐదు డిఫరెంట్ రోల్స్‌లో నటించింది. స్పై, వాంపైర్, సూపర్ షీ, టెర్రరిస్ట్, రక్షా రై ఇలా ఐదు భిన్నమైన పాత్రల్లో ఆమె అద్భుతంగా నటించింది. వీటిలో కొన్ని క్యారెక్టర్ లుక్స్‌ను పరిచయం చేశాం. వాటికి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది" అని పూర్వజ్ తెలిపారు.
ఏఐ ఎలిమెంట్స్ చుట్టూ
"ఈ చిత్ర కథకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలిమెంట్స్ ముడిపడి ఉంటాయి. ఈ ఐదు పాత్రలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ ముడిపడి ఉన్న ఆ ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ స్టోరీ ఏంటనేది స్క్రీన్ మీదే చూడాలి. మీరు ఇప్పుడు చూసిన గ్లింప్స్ అయినా, సాంగ్ అయినా మా రష్లో 3 పర్సెంట్ కూడా ఉండవు. మిగతా కంటెంట్ సర్ప్రైజింగ్గా ఉంటుంది" అని దర్శకుడు పూర్వజ్ చెప్పారు.
అప్పుడే కిల్లర్ ఆలోచన
{{/usCountry}}"ఈ చిత్ర కథకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలిమెంట్స్ ముడిపడి ఉంటాయి. ఈ ఐదు పాత్రలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ ముడిపడి ఉన్న ఆ ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ స్టోరీ ఏంటనేది స్క్రీన్ మీదే చూడాలి. మీరు ఇప్పుడు చూసిన గ్లింప్స్ అయినా, సాంగ్ అయినా మా రష్లో 3 పర్సెంట్ కూడా ఉండవు. మిగతా కంటెంట్ సర్ప్రైజింగ్గా ఉంటుంది" అని దర్శకుడు పూర్వజ్ చెప్పారు.
అప్పుడే కిల్లర్ ఆలోచన
{{/usCountry}}"నేను మాస్టర్ పీస్ అనే సినిమా చేస్తున్న టైమ్‌లో కిల్లర్ మూవీ ఆలోచన వచ్చింది. ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్రొడ్యూసర్ పద్మనాభరెడ్డి, ఇతర టీమ్ అంతా చాలా సపోర్ట్ చేశారు" అని కిల్లర్ మూవీ డైరెక్టర్ పూర్వజ్ పేర్కొన్నారు.