టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి సోషల్ మీడియాలో హీట్ కామెంట్స్ చేశారు. ఈ ఏడాది అత్యంత భారీ అంచనాలతో వస్తున్న యశ్ ‘టాక్సిక్’ (Toxic), రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) చిత్రాల మధ్య జరగబోయే బాక్సాఫీస్ పోరుపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇది కేవలం ఉత్తరాదికి, దక్షిణాదికి (North Vs South) మధ్య జరుగుతున్న పోరు కాదని, రెండు భిన్నమైన సినిమా సంస్కృతుల మధ్య జరుగుతున్న ‘భీకర యుద్ధం’ అని రామ్ గోపాల్ వర్మ అభివర్ణించారు.
డేవిడ్ వర్సెస్ గోలియత్.. ఆర్జీవీ విశ్లేషణ
ట్విట్టర్ (X) వేదికగా రామ్ గోపాల్ వర్మ సుదీర్ఘమైన పోస్ట్ చేస్తూ.. "నేను కేవలం రెండు పెద్ద సినిమాల గురించి మాట్లాడటం లేదు. భారతీయ సినిమా చరిత్రలో మునుపెన్నడూ చూడని ఒక వింత యుద్ధాన్ని చూడబోతున్నాం. ఇది డేవిడ్, గోలియత్ మధ్య జరుగుతున్న పోరాటం" అని రామ్ గోపాల్ వర్మ రాసుకొచ్చారు.
గతంలో ‘కేజీఎఫ్ 2’ సాధించిన భారీ వసూళ్లు ‘ధురంధర్’ ముందు చిన్నవిగా అనిపించాయని, ఇప్పుడు ‘ధురంధర్ 2’ అనే డేవిడ్ ముందు ‘టాక్సిక్’ అనే కొత్త గోలియత్ నిలబడిందని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.
తెలివితేటలా? లేక మూర్ఖత్వమా?
రామ్ గోపాల్ వర్మ తన విశ్లేషణలో సినిమా మేకింగ్ శైలిపై విమర్శనాస్త్రాలు సంధించారు. "ధురంధర్ మేకర్స్ ప్రేక్షకుల తెలివితేటలను గౌరవిస్తారు. కానీ, టాక్సిక్ మేకర్స్ మాత్రం ప్రేక్షకులు మూర్ఖులని భ్రమపడతారు" అని ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వర్మ ఈ క్రింది పాయింట్లను ఎత్తిచూపుతూ విశ్లేషించారు:
హీరోయిజం: గుడ్డిగా హీరోను ఆరాధించడం ఒకవైపు అయితే, కథలోని నైతిక విలువల ద్వారా హీరోను ప్రేక్షకులు గుర్తించడం మరోవైపు.
{{/usCountry}}హీరోయిజం: గుడ్డిగా హీరోను ఆరాధించడం ఒకవైపు అయితే, కథలోని నైతిక విలువల ద్వారా హీరోను ప్రేక్షకులు గుర్తించడం మరోవైపు.
{{/usCountry}}యాక్షన్: గాలిలో ఎగిరే స్టంట్లు, న్యూటన్ సూత్రాలను వెక్కిరించే ఫైట్లు ‘టాక్సిక్’లో ఉంటే.. ఒళ్లు గగుర్పొడిచే సహజమైన యాక్షన్ ‘ధురంధర్’ సొంతం.
సంగీతం: ప్రతి ఐదు నిమిషాలకు ‘ఈలలు వేయండి’ అని అరిచే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకటైతే, అద్భుతమైన నటనకు ఆస్కారం ఇస్తూ నిశ్శబ్దంగా సాగే సంగీతం ఇంకొకటి.
రూపాయి విలువ ఎక్కడ ఉంది?
కేవలం ఒక్క నటుడిని దేవుడిలా చూపించడానికి రూ. 700 కోట్లు ఖర్చు చేయడం కంటే ప్రతి పాత్రను మనిషిలా చూపించడానికి రూ. 130 కోట్లు ఖర్చు చేయడం గొప్ప అని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు.
"ప్రేక్షకులను చంటి పిల్లల్లా భావించి అన్నీ స్పూన్ ఫీడింగ్ చేయడం మానేయాలి. వారు క్లిష్టమైన కథలను అర్థం చేసుకోగలరని ‘ధురంధర్’ నిరూపించింది" అని దర్శకుడు ఆదిత్య ధర్‌ను ఆర్జీవీ ప్రశంసించారు.
భారతదేశం ఎటువైపు?
"నేను ఆదిత్య ధర్ మీద ప్రేమతో ఇది రాయడం లేదు, భారతీయ సినిమాపై ఉన్న ఆశతో రాస్తున్నాను. మార్చి 19న ఇండియా ‘ధురంధర్ 2’ మేధస్సును ఎంచుకుంటుందో లేక ‘టాక్సిక్’ మాస్ మత్తులో పడుతుందో చూడాలని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాను" అంటూ రామ్ గోపాల్ వర్మ తన నోట్‌ను ముగించారు.
సినిమాల నేపథ్యం:
ఇదిలా ఉంటే, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ధురంధర్ 2' ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్. ఇందులో రణ్‌వీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్ మాధవన్ నటించారు. మరోవైపు 'టాక్సిక్' చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. కేజీఎఫ్ తర్వాత యశ్ నటించిన చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.