ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ ఎట్టకేలకు జైలు నుంచి నిన్న (ఫిబ్రవరి 20) బయటకు వచ్చారు. రూ. 30 కోట్ల ఆర్థిక మోసం కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం ఆయన ఉదయ్‌పూర్ సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యారు. గతేడాది డిసెంబర్‌లో రాజస్థాన్ పోలీసులు ముంబైలో ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
సత్యం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ..

జైలు వెలుపల వేచి ఉన్న మీడియాతో విక్రమ్ భట్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కొంత తాత్విక ధోరణిలో డైరెక్టర్ స్పందించారు.
"గత రెండున్నర నెలలుగా నేను జైలు జీవితం గడిపాను. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందని నాకు మొదటి నుంచీ నమ్మకం ఉంది. జైలులో నాకు ఒక స్నేహితుడు పరిచయమయ్యాడు. మేవార్ మట్టిలో నిజం కొంతకాలం ఇబ్బందులు పడవచ్చు కానీ, అది ఎప్పటికీ ఓడిపోదు అని అతను నాకు చెప్పాడు. అదే మేవార్ మట్టిని తిలకంగా దిద్దుకుని ఇక్కడి నుంచి వెళ్తున్నాను" అని విక్రమ్ భట్ తెలిపారు.
కృష్ణుడి జన్మస్థలంతో పోలిక
తన జైలు అనుభవాన్ని వివరిస్తూ విక్రమ్ భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "జైలు అనేది ఒక ఐదవ ధామం లాంటిది. నేను శ్రీకృష్ణుడి భక్తుడిని. ఆ భగవంతుడు జన్మించిన ప్రదేశంలోనే నేను కూడా గడిపాను. జైలుకు వెళ్లకముందు కంటే ఇప్పుడు రెట్టింపు శక్తితో, మరింత మంచి వ్యక్తిగా బయటకు వస్తున్నాను. కృష్ణుడిలాగే నేను కూడా ఇప్పుడు కొత్త యుద్ధం చేయాలి. మన దేశ న్యాయవ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. అందరికీ మేలు జరిగే తీర్పు వస్తుందని ఆశిస్తున్నాను" అని విక్రమ్ భట్ వివరించారు.
అసలు కేసు ఏంటి?
ఉదయ్‌పూర్‌కు చెందిన ఇందిరా ఐవీఎఫ్ (Indira IVF) అధినేత డాక్టర్ అజయ్ ముర్డియా ఫిర్యాదు మేరకు 2025 నవంబర్‌లో విక్రమ్ భట్, ఆయన భార్య శ్వేతాంబరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. నాలుగు సినిమాల నిర్మాణానికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకుని, తమ నుంచి తీసుకున్న రూ. 30 కోట్లను విక్రమ్ భట్ దంపతులు దారి మళ్లించారని ముర్డియా ఆరోపించారు.
కోర్టులో సవాలు చేస్తా
{{/usCountry}}ఉదయ్‌పూర్‌కు చెందిన ఇందిరా ఐవీఎఫ్ (Indira IVF) అధినేత డాక్టర్ అజయ్ ముర్డియా ఫిర్యాదు మేరకు 2025 నవంబర్‌లో విక్రమ్ భట్, ఆయన భార్య శ్వేతాంబరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. నాలుగు సినిమాల నిర్మాణానికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకుని, తమ నుంచి తీసుకున్న రూ. 30 కోట్లను విక్రమ్ భట్ దంపతులు దారి మళ్లించారని ముర్డియా ఆరోపించారు.
కోర్టులో సవాలు చేస్తా
{{/usCountry}}నకిలీ బిల్లులు, పత్రాలను సృష్టించి ఈ నిధులను దుర్వినియోగం చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. అయితే, విక్రమ్ భట్ మాత్రం ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుతానికి బెయిల్‌పై బయటకు వచ్చిన విక్రమ్ భట్, త్వరలోనే తనపై ఉన్న ఆరోపణలను కోర్టులో సవాలు చేస్తానని స్పష్టం చేశారు.