OTT Release: ఇవాళ జియోహాట్‌స్టార్‌లోకి స్పీల్‌బ‌ర్గ్‌ విజువల్ వండర్.. సై-ఫై థ్రిల్లర్.. ఓటీటీలో ఎందుకు మిస్ కాకూడదంటే?

OTT Release: దర్శక దిగ్గజం స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్‌ సినిమా వస్తుందంటే చాలు సినీ లవర్స్ లో క్యూరియాసిటీ ఉంటుంది. ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘డిస్‌క్లోజ‌ర్ డే’ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇవాళ ఓటీటీలోకి వచ్చిన ఈ విజువల్ వండర్ ను ఎందుకు మిస్ కాకూడదో ఇక్కడ తెలుసుకోండి.

Published on: Oct 12, 2026, 13:50:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Release: హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్‌ తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ ఏలియన్ సై-ఫై థ్రిల్లర్ ‘డిస్ క్లోజర్ డే’ (Disclosure Day) డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన దాదాపు నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది.

ఇవాళ జియోహాట్‌స్టార్‌లోకి స్పీల్‌బ‌ర్గ్‌ విజువల్ వండర్.. సై-ఫై థ్రిల్లర్.. ఓటీటీలో ఎందుకు మిస్ కాకూడదంటే?
ఇవాళ జియోహాట్‌స్టార్‌లోకి స్పీల్‌బ‌ర్గ్‌ విజువల్ వండర్.. సై-ఫై థ్రిల్లర్.. ఓటీటీలో ఎందుకు మిస్ కాకూడదంటే?

డిస్‌క్లోజ‌ర్ డే ఓటీటీ

థియేటర్లలో అదరగొట్టిన సైన్స్ ఫిక్షన్ మూవీ ఇండియాలో ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయింది. ఈ చిత్రం ఈ రోజు (అక్టోబర్ 12) నుంచే జియోహాట్‌స్టార్‌ పీకాక్ హబ్ (Peacock Hub) విభాగంలో ఇంగ్లీష్‌తో పాటు హిందీ డబ్బింగ్ వెర్షన్‌లోనూ సబ్‌స్క్రైబర్లందరికీ అందుబాటులోకి వచ్చింది.

ఆసక్తికరమైన స్టోరీలైన్

1947 రోజ్‌వెల్ సంఘటన కాలం నుంచీ డెబ్బై ఏళ్లకు పైగా ప్రపంచ ప్రజలకు తెలియకుండా అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీ దాచిపెట్టిన ఏలియన్ల రహస్యాన్ని బట్టబయలు చేయడమే ఈ డిస్‌క్లోజ‌ర్ డే మూవీ స్టోరీ. సైబర్‌సెక్యూరిటీ నిపుణుడు డేనియల్ (జోష్ ఓ'కానర్) వార్డెక్స్ అనే రహస్య కాంట్రాక్టర్ సంస్థలో పనిచేస్తుంటాడు.

అక్కడ ఉన్న ఏలియన్స్ రహస్య ఆర్కైవ్స్‌తో పాటు ఏలియన్ పరికరాన్ని దొంగిలించి బయటకు వస్తాడు. అదే సమయంలో టీవీ వెదర్ రిపోర్టర్ మార్గరెట్ ఫెయిర్‌చైల్డ్ (ఎమిలీ బ్లంట్) లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లోనే విచిత్ర ప్రవర్తనతో, తెలియని భాషలు మాట్లాడుతూ మానవాతీత శక్తులను పొందుతుంది.

ఈ ఇద్దరూ కలిసి దాదాపు 7 బిలియన్ల ప్రపంచ జనాభాకు ఆ నిజాన్ని తెలియజేసే ‘డిస్‌క్లోజ‌ర్ డే’ ఉద్యమాన్ని ఎలా నడిపారనేది ప్రధాన కథ.

స్టార్ కాస్ట్

ఈ డిస్‌క్లోజ‌ర్ డే చిత్రంలో టీవీ మెటియరాలజిస్ట్‌గా ఎమిలీ బ్లంట్ తన కెరీర్ బెస్ట్ నటనను కనబరిచింది. ఆమెతో పాటు సైబర్‌సెక్యూరిటీ విజిల్‌బ్లోయర్‌గా జోష్ ఓ'కానర్, రహస్యాన్ని కాపాడటానికి ప్రయత్నించే నెగెటివ్ ఛాయలున్న అధికారిగా ఆస్కార్ విన్నర్ కొలిన్ ఫిర్త్ అద్భుతంగా నటించారు.

స్పీల్ బర్గ్ మార్క్ డైరెక్షన్

‘క్లోజ్ ఎన్‌కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్’, ‘ఈటీ’, ‘వార్ ఆఫ్ ది వరల్డ్స్’ లాంటి సై-ఫై క్లాసిక్స్‌ను అందించిన స్పీల్‌బ‌ర్గ్‌.. మళ్లీ ఏలియన్ జోనర్‌లోకి అడుగుపెట్టి తనదైన దర్శకత్వ ప్రతిభను చాటారు. కేవలం తుపాకుల పోరాటాలు, విధ్వంసాలు చూపించకుండా ఎమోషన్స్, గ్లోబల్ మీడియా పవర్, ఎంపతీ బేస్ చేసుకొని ఈ చిత్రాన్ని మలిచారు.

అదిరిపోయే ట్విస్ట్‌లు!

• హీరోహీరోయిన్లు డేనియల్, మార్గరెట్ ఇద్దరూ అనుకోకుండా కలిశామని అనుకుంటారు. కానీ చిన్నతనంలో వారిద్దరికీ ఏలియన్లతో జరిగిన ఒక రహస్య సంబంధం కథను ఊహించని మలుపు తిప్పుతుంది.

• ప్రభుత్వాలు ఏలియన్లను ప్రమాదకారులుగా ఎందుకు చిత్రీకరించాయనే కుట్రకోణం బయటపడే విధానం ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది.

• క్లైమాక్స్ లో ప్రపంచవ్యాప్త లైవ్ బ్రాడ్‌కాస్ట్ ద్వారా జరిగే రివీల్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.

ఎందుకు చూడాలి?

హై-కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్ కథలకు రాజకీయ కుట్రలు, భావోద్వేగాలను జోడించి రూపొందించిన క్లీన్ సినిమా ఇది. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, అగ్రశ్రేణి నటీనటుల పెర్ఫార్మెన్స్ కోసం ఈ వీకెండ్ ఓటీటీ వాచ్‌లిస్ట్‌లో ‘డిస్‌క్లోజ‌ర్ డే’ తప్పక చూడాల్సిన సినిమా అని చెప్పొచ్చు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More