హీరో రిచర్డ్ రిషి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ద్రౌపది 2. నేతాజి ప్రొడక్షన్స్, జీఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద సోల చక్రవర్తి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే డిఫరెంట్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌తో ద్రౌపది 2 సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
విలన్‌గా చిరాగ్ జానీ

ఈ సినిమాలో రిచర్డ్ రిషి హీరోగా చేయగా ఆయనకు జోడీగా రక్షణ ఇందుసుదన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, ఈ సినిమాలో చిరాగ్ జానీ విలన్‌గా చేస్తున్న ద్రౌపది 2 మూవీకి మోహన్ జీ దర్శకత్వం వహించారు. వీరి పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను, నెలరాజె.. అనే పాటను విడుదల చేయగా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
విలన్‌పై భారీ బడ్జెట్‌తో పాట
తాజాగా బుధవారం (జనవరి 7) రోజున ద్రౌపది 2 సినిమా నుంచి ‘తారాసుకి రామ్’ అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మహమ్మద్ బిన్ తుగ్లక్ పాత్రలో నటిస్తోన్న చిరాగ్ జానీపై ఈ పాటను చిత్రీకరించారు. అంటే విలన్‌పై పాటను కంపోజ్ చేశారని తెలుస్తోంది. ఈ పాట కోసం భారీ సెట్ వేసి మరీ చిత్రీకరించారు.
పీరియాడిక్ టచ్
పీరియాడిక్ టచ్‌తో సాగే ఈ పాట మంచి బీట్‌తో ఆకట్టుకుంటోంది. జిబ్రాన్ సంగీత సారథ్యంలో చిత్ర దర్శకుడు మోహన్.జి రాసిన ఈ తారాసుకి రామ్ పాటను జిబ్రాన్, గోల్డ్ దేవరాజ్, గురు హరిరాజ్ ఆలపించారు.
ద్రౌపది 2 నటీనటులు
ఇంకా ఈ ద్రౌపది 2 చిత్రంలో నట్టి నటరాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. వైజీ మహేంద్రన్, నడోడిగల్ బరాణి, సరవణ సుబ్బయ్య, వెల్ రామమూర్తి, దినేష్ లాంబా, గణేష్ గౌరాంగ్, దివి, దేవయానీ శర్మ, అరుణోదయన్ తదితరులు ఇతర పాత్రల్లో అలరించనున్నారు.
ద్రౌపది 2 సాంకేతిక వర్గం
ఫిలిప్ ఆర్. సుందర్ సినిమాటోగ్రఫీ అందించగా, జిబ్రాన్ సంగీతాన్ని అందించారు. యాక్షన్ సంతోష్, నృత్యాలను తనిక టోనీ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేశారు. ఎడిటర్‌గా దేవరాజ్, ప్రొడక్షన్ డిజైనర్‌గా కమల్‌నాథన్ బాధ్యతలను నిర్వహించారు. పద్మ చంద్రశేఖర్, మోహన్.జి డైలాగ్స్ రాశారు.
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి
{{/usCountry}}ఫిలిప్ ఆర్. సుందర్ సినిమాటోగ్రఫీ అందించగా, జిబ్రాన్ సంగీతాన్ని అందించారు. యాక్షన్ సంతోష్, నృత్యాలను తనిక టోనీ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేశారు. ఎడిటర్‌గా దేవరాజ్, ప్రొడక్షన్ డిజైనర్‌గా కమల్‌నాథన్ బాధ్యతలను నిర్వహించారు. పద్మ చంద్రశేఖర్, మోహన్.జి డైలాగ్స్ రాశారు.
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి
{{/usCountry}}సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ద్రౌపది 2 నుంచి త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసి, ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ద్రౌపది 2 రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ద్రౌపది 2 సినిమా రిలీజ్ డేట్‌పై కూడా ప్రకటన త్వరలోనే రానుందని మేకర్స్ పేర్కొన్నారు.