...
...
Next Story

Drishyam 3 Ansiba Hassan: దృశ్యం 3 నటికి మతపరమైన వేధింపులు- జిహాదీ అంటున్నారని అన్సిబా హాసన్ ఆవేదన- అమ్మకు రాజీనామా!

Drishyam 3 Ansiba Hassan Amma Resignation: బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తున్న దృశ్యం 3 విజయానందాన్ని ఆస్వాదించాల్సిన నటి అన్సిబా హసన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తోటి నటుడు టైని టామ్ తనను మతపరంగా దూషించారంటూ అమ్మ సంఘానికి అన్సిబా రాజీనామా చేయడం చిత్రసీమలో కలకలం రేపుతోంది.

Published on: May 24, 2026, 08:46:26 IST
Advertisement

Drishyam 3 Ansiba Hassan On Jihadi Allegations: థియేటర్లలో రికార్డు వసూళ్లతో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'దృశ్యం 3' బాక్సాఫీస్ వద్ద జోరుగా దూసుకుపోతోంది. కానీ, మరోవైపు దృశ్యం 3లో నటించిన నటి అన్సిబా హసన్ చేసిన ఆరోపణలు మలయాళ చిత్రసీమను కుదిపేస్తున్నాయి.

టైని టామ్‌పై సంచలన కామెంట్స్

దృశ్యం 3 నటికి మతపరమైన వేధింపులు- జిహాదీ అంటున్నారని అన్సిబా హాసన్ ఆవేదన- అమ్మకు రాజీనామా!
దృశ్యం 3 నటికి మతపరమైన వేధింపులు- జిహాదీ అంటున్నారని అన్సిబా హాసన్ ఆవేదన- అమ్మకు రాజీనామా!

దృశ్యం 3 మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ జార్జ్‌కుట్టి పాత్రగా చేయగా ఆయన కూతురు 'అంజు'గా మెప్పించిన అన్సిబా.. తోటి నటుడు టైని టామ్‌పై సంచలన కామెంట్స్ చేశారు. టైని టామ్‌తోపాటు మలయాళ నటీనటుల సంఘం 'అమ్మ' (AMMA) లోని కొందరు సభ్యులపై అన్సిబా హాసన్ సంచలన ఆరోపణలు చేశారు.

తనను మతపరంగా వేధించడమే కాకుండా క్యారెక్టర్ అస్సాసినేషన్‌కు పాల్పడ్డారని అన్సిబా ఆవేదన వ్యక్తం చేశారు. మలయాళంలో మూడో భాగం అయిన దృశ్యం 3 థియేటర్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న తరుణంలో ఈ అంతర్గత వివాదం తెరపైకి రావడం గమనార్హం.

'జిహాదీ' అని సంబోధించాడని

మీడియాతో మాట్లాడిన అన్సిబా హసన్ తన మనోవేదనను పంచుకున్నారు. అసోసియేషన్‌లో ఉన్న ఒక సభ్యుడు తనకు ఫోన్ చేసి, టైని టామ్ తనను 'జిహాదీ' అని సంబోధించాడని చెప్పినట్లు అన్సిబా పేర్కొన్నారు. తాను మతమార్పిడులకు ప్రయత్నిస్తున్నట్లు, తన వ్యక్తిగత జీవితంపై లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నట్లు అన్సిబా ఆరోపించారు.

రాజీనామాకు దారితీసిన మతపరమైన దూషణలు

కేవలం ముస్లిం ఐడెంటిటీ ఉండటం వల్లే తనను లక్ష్యంగా చేసుకున్నారా అని ఆమె ప్రశ్నించారు. వ్యక్తిగత కారణాలు, పని ఒత్తిడి వల్లే తాను ఫిబ్రవరి 21న నటీనటుల సంఘం 'అమ్మ' (Association of Malayalam Movie Artists-AMMA)కి రాజీనామా లేఖ సమర్పించినట్లు అన్సిబా హాసన్ తెలిపారు. అయితే అసలు కారణాన్ని తాను వ్యక్తిగతంగా సంఘం సెక్రటరీకి వివరించానని చెప్పారు.

దృశ్యం 3 నటి అన్సిబా చేసిన ఆరోపణలను నటుడు టైని టామ్ పూర్తిగా తిరస్కరించారు. అవన్నీ ఎవరో చెబితే విన్న మాటలే తప్ప అందులో ఎలాంటి నిజం లేదన్నారు. "ఎవరో నేను అలా అన్నానని ఆమెకు చెప్పారు.. ఆమె అదే మాట చెప్తోంది. నేను పరిశ్రమలో ఎప్పుడూ నిజాయితీగా పని చేస్తాను, ముక్కుసూటిగా మాట్లాడతాను" అని టైని టామ్ మీడియాకు వివరించారు.

బాక్సాఫీస్ వద్ద 'దృశ్యం 3' వసూళ్ల సునామీ

ఈ అంశంపై 'అమ్మ' సంఘం కార్యవర్గ కమిటీ త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వివాదాలు పక్కన పెడితే థియేటర్లలో 'దృశ్యం 3' కలెక్షన్స్‌తో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబావూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఒక పెద్ద రహస్యాన్ని పోలీసుల నుంచి దాచడానికి జార్జ్‌కుట్టి చేసే పోరాటమే ఈ సినిమా కథ. మొదటి రోజునే దృశ్యం 3 మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కేవలం రెండు రోజుల్లోనే రూ. 76 కోట్ల మార్కును దాటేసి ఓవర్సీస్‌లోనూ అదరగొడుతోంది దృశ్యం 3 చిత్రం.

మతపరమైన వేధింపుల కారణంగా

దృశ్యం 3 ఘనవిజయాన్ని ఆస్వాదించాల్సిన సమయంలో అందులో నటించిన మలయాళ పాపులర్ నటి అన్సిబా హాసన్ మతపరమైన వేధింపుల కారణంగా అసోసియేషన్ నుంచి తప్పుకోవాల్సి రావడం మాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe