Drishyam 3: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం 3' (Drishyam 3) బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమా కేవలం హిందీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా, మలయాళ ప్రేక్షకులను, కంటెంట్ క్రియేటర్లను కూడా అమితంగా ఆకట్టుకుంటోంది.
బాక్సాఫీస్ వద్ద 'దృశ్యం 3' ప్రభంజనం

అజయ్ దేవగన్, అభిషేక్ పాఠక్ కాంబినేషన్‌లో వచ్చిన 'దృశ్యం 3' చిత్రం శుక్రవారం (అక్టోబర్ 2) థియేటర్లలోకి వచ్చి అంచనాలను మించి సంచలనం సృష్టిస్తోంది. Sacnilk నివేదికల ఆధారంగా ఈ సినిమా మొదటి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.66.75 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 95.10 కోట్ల గ్రాస్ సాధించి అజయ్ దేవగన్ సినీ ప్రయాణంలోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది.
రెండు రోజుల్లోనే
దృశ్యం 3 హిందీ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.177 కోట్ల గ్రాస్ ఖాతాలో వేసుకుంది. కేవలం రెండు రోజుల్లోనే దృశ్యం 1 లైఫ్ టైమ్ కలెక్షన్లను దృశ్యం 3 దాటేయడం విశేషం.
మలయాళ ప్రేక్షకులు ఫిదా
సాధారణంగా రీమేక్ సినిమాలను మలయాళ ప్రేక్షకులు లేదా కంటెంట్ క్రియేటర్లు పెద్దగా ఇష్టపడరు. కానీ 'దృశ్యం 3' విషయంలో సీన్ తలకిందులైంది. ఒక ప్రముఖ మలయాళ కంటెంట్ క్రియేటర్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేస్తూ, హిందీ మేకర్స్ ముగింపు ఇచ్చిన తీరుకి తాను థియేటర్‌లో చప్పట్లు కొట్టక తప్పలేదని కొనియాడారు.
మొదటి రెండు భాగాల హిందీ వర్షన్లపై తనకు చిన్నచూపు ఉండేదని, కానీ మూడో భాగం కథనం, ఆఖరి సన్నివేశాలు అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. ఈ చిత్రానికి ఒరిజినల్ డైరెక్టర్ జీతు జోసెఫ్ రైటింగ్ క్రెడిట్ కేవలం 1 శాతం కూడా లేదని, హిందీ రచయితలే సొంతంగా ఈ అద్భుతమైన ముగింపును రాసుకున్నారని ఆయన కొనియాడారు.
మలయాళం కంటే 100 రెట్లు బెటర్
{{/usCountry}}మొదటి రెండు భాగాల హిందీ వర్షన్లపై తనకు చిన్నచూపు ఉండేదని, కానీ మూడో భాగం కథనం, ఆఖరి సన్నివేశాలు అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. ఈ చిత్రానికి ఒరిజినల్ డైరెక్టర్ జీతు జోసెఫ్ రైటింగ్ క్రెడిట్ కేవలం 1 శాతం కూడా లేదని, హిందీ రచయితలే సొంతంగా ఈ అద్భుతమైన ముగింపును రాసుకున్నారని ఆయన కొనియాడారు.
మలయాళం కంటే 100 రెట్లు బెటర్
{{/usCountry}}ఈ వీడియో కింద నెటిజన్లు పెడుతున్న కామెంట్లు కూడా హిందీ వెర్షన్‌కే ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. కొంతమంది మలయాళ ఆడియన్స్ స్పందిస్తూ.. మోహన్‌లాల్ 'దృశ్యం 3' మలయాళ వెర్షన్ కేవలం బిజినెస్ కోసమే తీసినట్లు అనిపించిందని, కానీ అజయ్ దేవగన్ హిందీ వెర్షన్ అంతకంటే 100 రెట్లు బాగుందని వ్యాఖ్యానించారు. హిందీ వెర్షన్ ముగింపు ఎంతో అర్థవంతంగా, పార్ట్ 2కి సరైన కొనసాగింపుగా ఉందంటూ మెచ్చుకుంటున్నారు.
అయితే, కొందరు మోహన్‌లాల్ అభిమానులు మాత్రం జార్జ్‌కుట్టి పాత్రలో మోహన్‌లాల్ పండించే భావోద్వేగాలను, యాక్టింగ్‌ను మరెవరూ మ్యాచ్ చేయలేరని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రీమేక్ కాదు.. ఒరిజినల్ కథ
ఈ సినిమాకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, 'దృశ్యం 3' హిందీ వెర్షన్ మలయాళ సినిమాకి రీమేక్ కాదు. మొదటి రెండు భాగాలు మలయాళ సినిమాలకు నేరుగా రీమేక్‌లుగా వచ్చినప్పటికీ, మూడో భాగం కోసం దర్శకుడు అభిషేక్ పాఠక్ పూర్తి భిన్నమైన ఒరిజినల్ స్టోరీలైన్‌ను ఎంచుకున్నారు. స్వతంత్ర కథతో, నూతన స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించిన ఈ క్లైమాక్స్ కోసం నటుడు అజయ్ దేవగన్ ముందే మోహన్‌లాల్‌ను కలిసి ఆయన అనుమతి, ఆశీస్సులు తీసుకున్నట్లు గతంలోనే వెల్లడించారు.