...
...
Next Story

దృశ్యం 3 బాక్సాఫీస్ కలెక్షన్లు: రెండో రోజు తగ్గిన మోహన్‌లాల్, మీనా థ్రిల్లర్ మూవీ వసూళ్లు.. 100 కోట్ల వైపు దూసుకెళ్తూ..

దృశ్యం 3 బాక్సాఫీస్ కలెక్షన్లు: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం 3' థియేటర్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తొలిరోజు రికార్డు వసూళ్లు సాధించిన ఈ మూవీ.. రెండో రోజు కాస్త తగ్గింది.

Published on: May 23, 2026 09:22 AM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

దృశ్యం 3 బాక్సాఫీస్ కలెక్షన్లు: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు సరికొత్త మైలురాయిగా నిలిచిన 'దృశ్యం' ఫ్రాంచైజీ నుంచి వచ్చిన మూడో భాగం థియేటర్లలో గర్జన మొదలుపెట్టింది. మే 21న మోహన్‌లాల్ పుట్టినరోజు కానుకగా విడుదలైన 'దృశ్యం 3' బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టింది.

దృశ్యం 3 బాక్సాఫీస్ కలెక్షన్లు: రెండో రోజు తగ్గిన మోహన్‌లాల్, మీనా థ్రిల్లర్ మూవీ వసూళ్లు.. 100 కోట్ల వైపు దూసుకెళ్తూ..
దృశ్యం 3 బాక్సాఫీస్ కలెక్షన్లు: రెండో రోజు తగ్గిన మోహన్‌లాల్, మీనా థ్రిల్లర్ మూవీ వసూళ్లు.. 100 కోట్ల వైపు దూసుకెళ్తూ..

మొదటి రోజుతో పోలిస్తే శుక్రవారం (మే 22) కలెక్షన్లలో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, ఈ చిత్రం రెండు రోజుల్లోనే ఇండియా వ్యాప్తంగా ఘనమైన వసూళ్లను సొంతం చేసుకుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఒరిజినల్ వెర్షన్ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటం విశేషం. ఓవరాల్ గా ఈ వీకెండ్ మూవీ రూ.100 కోట్ల క్లబ్ లో చేరనుంది.

రెండు రోజుల్లో రాబట్టిన వసూళ్లు ఇవే

బాక్సాఫీస్ ట్రాకర్ల అధికారిక సమాచారం ప్రకారం.. 'దృశ్యం 3' మూవీ శుక్రవారం ఇండియాలో రూ. 11.05 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. గురువారంతో పోలిస్తే కలెక్షన్లలో 30 శాతం మేర తగ్గుదల కనిపించినా, రెండు రోజుల మొత్తం డొమెస్టిక్ కలెక్షన్లు రూ. 26.90 కోట్ల నెట్ మార్కుకు చేరుకున్నాయి. అంతకుముందు మొదటి రోజు ఈ మూవీ రూ. 15.85 కోట్ల నెట్ వసూళ్లతో అదరగొట్టింది.

ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు ఈ సినిమా రూ. 43.37 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతుండగా, నిర్మాత సంస్థ ఆశీర్వాద్ సినిమాస్ మాత్రం మొదటి రోజే తమ చిత్రం రూ. 50.35 కోట్ల గ్రాస్ సాధించిందని అధికారికంగా ప్రకటించింది. ఇక రెండు రోజులు కలిపి ఈ గ్రాస్ వసూళ్లు రూ.76.18 కోట్లకు చేరాయి. శని, ఆదివారాల్లో గ్రాస్ రూ.100 కోట్ల మైలురాయిని దాటనుంది.

తెలుగులోనూ భారీ క్రేజ్

భాషల వారీగా చూస్తే మలయాళం తర్వాత తమిళం, కన్నడ కంటే తెలుగులోనే 'దృశ్యం 3' కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. గత రెండు భాగాలను తెలుగులో వెంకటేష్ రీమేక్ చేయడంతో.. ఇక్కడి ప్రేక్షకులకు జార్జ్‌కుట్టి కథపై విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. రెండు రోజుల్లో తెలుగు వెర్షన్ కు రూ.2.2 కోట్లు వచ్చాయి. తొలి రోజు రూ.1.5 కోట్లు, రెండో రోజు రూ.0.7 కోట్లు రావడం విశేషం.

జార్జ్‌కుట్టి ఫ్యామిలీ మిస్టరీ.. 'దృశ్యం 4' కి హింట్

జీతూ జోసెఫ్ కథ, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మోహన్‌లాల్, మీనా, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్, మురళీ గోపి, సిద్ధిక్, ఆశా శరత్ తమ పాత పాత్రల్లోనే అద్భుతంగా నటించారు. దృశ్యం 1, 2 భాగాల కొనసాగింపుగానే ఈ కథ సాగుతుంది. అయితే ఈసారి కేవలం ట్విస్టుల పైనే కాకుండా, జార్జ్‌కుట్టి తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల ఆ కుటుంబం అనుభవించిన మానసిక వేదన, పరిణామాలపై దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టారు. సినిమా ముగింపులో 'దృశ్యం 4' కి సంబంధించిన ఆసక్తికరమైన హింట్‌ కూడా ఇచ్చారు.

సినిమాకు వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ పట్ల మోహన్‌లాల్ సోషల్ మీడియాలో స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. "దృశ్యం 3 సినిమాను ఎంతో ప్రేమ, కృతజ్ఞతలతో రూపొందించాం. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన నన్ను ఎంతగానో కదిలించింది. మీ రివ్యూలు, మీ మాటలు బాక్సాఫీస్ నెంబర్ల కంటే నాకు చాలా ముఖ్యం. జార్జ్‌కుట్టి కుటుంబాన్ని మీ సొంత కుటుంబంలా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు" అని మోహన్‌లాల్ పేర్కొన్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'దృశ్యం 3' సినిమా రెండు రోజుల్లో ఇండియాలో ఎంత వసూలు చేసింది?

ఈ మూవీ రెండు రోజుల్లో ఇండియాలో మొత్తం రూ. 26.90 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. మొదటి రోజు రూ. 15.85 కోట్లు రాగా, రెండో రోజు రూ. 11.05 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి.

2. మలయాళం కాకుండా మరే ఇతర భాషల్లో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది?

మలయాళం తర్వాత తమిళం, కన్నడ భాషలతో పోలిస్తే తెలుగులోనే 'దృశ్యం 3' చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో వసూళ్లు, అద్భుతమైన స్పందన లభిస్తోంది.

3. 'దృశ్యం 3' ముగింపులో తదుపరి భాగాల గురించి ఏమైనా హింట్ ఇచ్చారా?

అవును.. దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సినిమా ముగింపులో 'దృశ్యం 4' రాబోతోందనే స్పష్టమైన హింట్ ఇచ్చారు. హీరో మోహన్‌లాల్ కూడా ఈ ఫ్రాంచైజీలో ఐదో భాగం కూడా ఉండే అవకాశం ఉందని సినిమా విడుదలకు ముందే సూచించారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe