ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు జంటగా నటించిన డ్యూడ్ చిత్రం అక్టోబర్ 17 థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి మంచి ప్రదర్శనతో దూసుకుపోతోంది. మొదటి రోజు బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న డ్యూడ్ సినిమా రెండో రోజు అయిన శనివారం (అక్టోబర్ 18) కూడా మంచి కలెక్షన్స్ అందుకుంది.
డ్యూడ్ నెట్ కలెక్షన్స్

సక్నిల్క్.కామ్ (Sacnilk.com) ప్రకారం ఇప్పటివరకు భారతదేశంలో డ్యూడ్ సినిమా దాదాపు 20 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ సంపాదించింది. ట్రేడ్ వెబ్ సైట్ ప్రకారం రెండో రోజున ఇండియాలో రూ. 10 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే, తొలి రోజున రూ. 9.75 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. వీటిలో తెలుగు నుంచి రూ. 3.25 కోట్లు, తమిళం ద్వారా 6.5 కోట్లు వసూలు చేసింది.
తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్
ఇలా రెండు రోజుల్లో రూ. 19.75 కోట్ల నెట్ కలెక్షన్స్‌ను సాధించింది డ్యూడ్ సినిమా. అంటే సుమారుగా రూ. 20 కోట్లు. ఇక రెండో రోజున తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.8 నుంచి 3 కోట్ల రేంజ్‌లో గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది ఈ సినిమా. రెండు రోజుల్లో కలిపి రూ. 6.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.
తెలుగుకు మించి తమిళంలో
తెలుగుకు మించి తమిళంలో 2వ రోజున రూ. 7 కోట్లకుపైగా గ్రాస్ రాబట్టింది మమిత బైజు డ్యూడ్ మూవీ. అలాగే, వరల్డ్ వైడ్‌గా రూ. 14 కోట్ల గ్రాస్ వసూళ్లను డ్యూడ్ సినిమా రాబట్టింది. దీంతో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా డ్యూడ్ చిత్రానికి రూ. 39.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టగా.. రూ. 19.50 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది.
డ్యూడ్ బ్రేక్ ఈవెన్ కావాలంటే
ఇదిలా ఉంటే, వరల్డ్ వైడ్‌గా డ్యూడ్ సినిమాకు 59 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా.. రూ. 60 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు అయింది. దీంతో డ్యూడ్ సినిమాకు బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా రూ. 40.50 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాలి. 40 కోట్లు దాటితేనే డ్యూడ్ హిట్ కొట్టినట్లు అవుతుంది.
డ్యూడ్ థియేటర్ ఆక్యుపెన్సీ
{{/usCountry}}ఇదిలా ఉంటే, వరల్డ్ వైడ్‌గా డ్యూడ్ సినిమాకు 59 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా.. రూ. 60 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు అయింది. దీంతో డ్యూడ్ సినిమాకు బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా రూ. 40.50 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాలి. 40 కోట్లు దాటితేనే డ్యూడ్ హిట్ కొట్టినట్లు అవుతుంది.
డ్యూడ్ థియేటర్ ఆక్యుపెన్సీ
{{/usCountry}}ఇకపోతే ప్రదీప్ రంగనాథన్ సినిమా డ్యూడ్ థియేటర్ ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. శనివారం రోజున తమిళంలో మొత్తం 55.43 శాతంగా ఉంది. వీటిలో మార్నింగ్ షోలకు 38.33 శాతం, మధ్యాహ్నాం షోలకు 60.69 శాతం, ఈవెనింగ్ షోలకు 54.53 శాతం, నైట్ షోలకు అన్నిటికంటే ఎక్కువగా 68.16 శాతంగా డ్యూడ్ థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది.