లేటెస్ట్ తమిళ బ్లాక్ బస్టర్ రొమాంటిక్ మూవీ డ్యూడ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (నవంబర్ 14) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా. దీపావళి సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఇందులో మమితా బైజు హీరోయిన్. ఈ చిత్రంతో ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ హిట్ కొట్టాడు.
డ్యూడ్ ఓటీటీ

ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు జంటగా నటించిన జెన్ జెడ్ రొమాంటిక్ మూవీ డ్యూడ్ ఓటీటీలో అడుగుపెట్టింది. శుక్రవారం నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఓటీటీలో డ్యూడ్ మూవీని చూడొచ్చు. ఇందులో ప్రదీప్, మమితా, ఆర్.శరత్ కుమార్, ఐశ్వర్య శర్మ తదితరులు నటించారు. దీనికి కీర్తిశ్వరన్ డైరెక్టర్.
రూ.100 కోట్లు
డ్యూడ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఇది రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. లవ్ టుడే, డ్రాగన్ తర్వాత డ్యూడ్ తో ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. ఇప్పటివరకు 2025 లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.22 కోట్ల ఓపెనింగ్ వసూళ్లతో ప్రదీప్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా నిలిచింది డ్యూడ్. దీని స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ రూ .25 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
డ్యూడ్ కథ
అగన్ (ప్రదీప్), కురల్ (మమితా) కజిన్స్. చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ గా ఉంటారు. ఫ్యామిలీలో సందడి చేస్తారు. చాలా సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తుంటారు. ఇదే క్రమంలో అగన్ తో ప్రేమలో పడుతుంది కురల్. ప్రపోజ్ చేస్తే అగన్ రిజెక్ట్ చేస్తాడు. కానీ ఆ తర్వాత అగన్ రియలైజ్ అవుతాడు. తాను కూడా కురల్ ను ప్రేమిస్తున్నానని తెలుసుకుంటాడు.
{{/usCountry}}అగన్ (ప్రదీప్), కురల్ (మమితా) కజిన్స్. చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ గా ఉంటారు. ఫ్యామిలీలో సందడి చేస్తారు. చాలా సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తుంటారు. ఇదే క్రమంలో అగన్ తో ప్రేమలో పడుతుంది కురల్. ప్రపోజ్ చేస్తే అగన్ రిజెక్ట్ చేస్తాడు. కానీ ఆ తర్వాత అగన్ రియలైజ్ అవుతాడు. తాను కూడా కురల్ ను ప్రేమిస్తున్నానని తెలుసుకుంటాడు.
{{/usCountry}}కురల్ ను పెళ్లి చేసుకుంటానని ఆమె తండ్రి అతియమాన్ (శరత్ కుమార్) దగ్గరకు వెళ్లి చెప్తాడు. దానికి అతియమాన్ సంతోషంగా ఒప్పుకొని పెళ్లి అరెంజ్ మెంట్స్ చేస్తాడు. కానీ ఇంతలోనే వేరే క్యాస్ట్ కు చెందిన పారిని లవ్ చేస్తున్నట్లు కురల్ షాక్ ఇస్తుంది. వేరే క్యాస్ట్ అతణ్ని మ్యారేజీ చేసుకున్నందుకు తన చెల్లిని చంపిన అతియమాన్ కూతురు ఇంటర్ కాస్ట్ మ్యారేజీకి ఒప్పుకోడు.
తండ్రిగా
అతియమాన్ పొలిటికల్ ఇన్ ఫ్లూయెన్స్ ను దాటి కురల్, పారిని విదేశాలకు పంపేందుకు అగన్ చాలా ప్రయత్నిస్తాడు. కానీ కురల్ ప్రెగ్నెన్సీ కారణంగా ఆగిపోతారు. కురల్ డెలివరీ అయితే తండ్రి ప్లేస్ లో అగన్ సంతకం చేస్తాడు. ఆ తర్వాత పారి నుంచి కురల్ విడిపోతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది అన్నది డ్యూడ్ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.