Im Game 3 Days Worldwide Box Office Collection: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరికొత్త క్రైమ్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ 'ఐయామ్ గేమ్' బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనతో ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. గురువారం (సెప్టెంబర్ 3) భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, వారాంతంలో ఊపందుకుంటుందని భావించినప్పటికీ మూడో రోజు వసూళ్లు కాస్త తగ్గడం ట్రేడ్ వర్గాలను కలవరపెడుతోంది.
ఐయామ్ గేమ్ పతనం

శనివారం (సెప్టెంబర్ 5) కూడా వసూళ్లలో పతనం నమోదు కావడంతో, బాక్సాఫీస్ వద్ద ఐయామ్ గేమ్ చిత్రం నిలదొక్కుకోవడానికి ఆదివారం (సెప్టెంబర్ 6) కలెక్షన్స్ చాలా కీలకంగా మారాయి.
తెలుగులో 'మహానటి', 'సీతా రామం', 'లక్కీ భాస్కర్' వంటి వరుస విజయాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు దుల్కర్ సల్మాన్. అయితే మలయాళంలో మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమా కావడంతో 'ఐయామ్ గేమ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కథనంపై భిన్నాభిప్రాయాలు రావడంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యపై ఆ ప్రభావం పడుతోంది.
మూడు రోజుల్లో వసూళ్లు ఎంతంటే?
ప్రముఖ ట్రేడ్ పోర్టల్ గణాంకాల ప్రకారం, శనివారం నాడు ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ. 4.15 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. శుక్రవారం సాధించిన రూ. 4.90 కోట్లతో పోలిస్తే ఇది 15.3 శాతం తక్కువ.
మొదటి రోజు రూ. 5.40 కోట్లతో బోణి కొట్టిన 'ఐయామ్ గేమ్' సినిమా మూడు రోజులు పూర్తయ్యేసరికి భారత బాక్సాఫీస్ వద్ద రూ. 14.45 కోట్ల నెట్ (రూ. 16.90 కోట్ల గ్రాస్) కలెక్షన్లను సాధించింది.
ఐయామ్ గేమ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
ఇక ఓవర్సీస్ మార్కెట్లో రూ. 13.75 కోట్లు రాబట్టడంతో, ఈ సినిమా మూడ్రోజుల ప్రపంచవ్యాప్త గ్రాస్ రూ. 30.65 కోట్ల కలెక్షన్స్‌కు చేరుకుంది. 2023లో వచ్చిన దుల్కర్ మునుపటి మలయాళ చిత్రం 'కింగ్ ఆఫ్ కొత్త' మూడు రోజుల్లో సాధించిన రూ. 11.50 కోట్ల నెట్ (ప్రపంచవ్యాప్తంగా రూ. 25.18 కోట్ల గ్రాస్) లెక్కలను ఈ చిత్రం దాటేసింది.
తెలుగు, హిందీలో నిరాశాజనక స్పందన
{{/usCountry}}ఇక ఓవర్సీస్ మార్కెట్లో రూ. 13.75 కోట్లు రాబట్టడంతో, ఈ సినిమా మూడ్రోజుల ప్రపంచవ్యాప్త గ్రాస్ రూ. 30.65 కోట్ల కలెక్షన్స్‌కు చేరుకుంది. 2023లో వచ్చిన దుల్కర్ మునుపటి మలయాళ చిత్రం 'కింగ్ ఆఫ్ కొత్త' మూడు రోజుల్లో సాధించిన రూ. 11.50 కోట్ల నెట్ (ప్రపంచవ్యాప్తంగా రూ. 25.18 కోట్ల గ్రాస్) లెక్కలను ఈ చిత్రం దాటేసింది.
తెలుగు, హిందీలో నిరాశాజనక స్పందన
{{/usCountry}}భాషల వారీగా చూస్తే 'ఐయామ్ గేమ్' మలయాళ వెర్షన్‌కు మాత్రమే కొంత మేర ఆదరణ లభిస్తోంది. శనివారం ఒక్క రోజు మలయాళంలో రూ. 2.65 కోట్ల నెట్ వసూళ్లు రాగా, తెలుగులో రూ. 75 లక్షలు, తమిళంలో రూ. 70 లక్షలు, హిందీలో కేవలం రూ. 5 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. దేశవ్యాప్తంగా శనివారం ప్రదర్శించిన 3,014 షోలలో సగటున 34.4 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
దుల్కర్‌కు పోటీగా మమితా బైజు
అయితే, దుల్కర్ సల్మాన్ సినిమాకు గట్టి పోటీ ఇస్తోంది ప్రేమలు బ్యూటీ మమితా బైజు మూవీ. అదే బెత్లెహెమ్ కుడుంబ యూనిట్. ఆగస్ట్ 21న విడుదలైన ఈ సినిమా ఇంకా వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన 16వ రోజున కూడా ఈ సినిమా ఇండియాలో రూ. 7 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. అంటే, ఐయామ్ గేమ్ కంటే రూ. 2.85 కోట్లు ఎక్కువ.
ఇప్పటికీ బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 238.05 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇదిలా ఉంటే, సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఐయామ్ గేమ్ సినిమాలో కయాదు లోహర్, సంయుక్త విశ్వనాథ్ హీరోయిన్స్‌గా నటించారు. నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరో హీరోయిన్లతోపాటు ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, కతీర్, వినయ్ ఫోర్ట్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.