స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ రోజుకు 8 గంటల పని డిమాండ్ పై చర్చ కొనసాగుతూనే ఉంది. ఆమె చేసిన ఈ డిమాండ్ వల్ల ప్రభాస్ 'స్పిరిట్', 'కల్కి' సీక్వెల్ నుంచి తప్పుకున్నారన్న వార్తలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. అసలు సినిమా రంగంలో ఇలాంటి నిబంధనలు ఆచరణ సాధ్యమేనా అనే విషయంపై 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' రౌండ్ టేబుల్ సమావేశంలో నటులు రానా, దుల్కర్ సల్మాన్, నిర్మాత అర్చన కళాపతి తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.
ఇదేమీ ఉద్యోగం కాదు: రానా

పని గంటల గురించి అడిగినప్పుడు రానా దగ్గుబాటి నవ్వుతూ స్పందించారు. ఇది సాధ్యం కాదని అతడు స్పష్టం చేశాడు. "ఇది ఒక ఉద్యోగం కాదు. ఇదొక లైఫ్ స్టైల్. మీరు ఇందులో ఉండాలా వద్దా అనేది మీ ఛాయిస్. ప్రతి సినిమాకు వేర్వేరు అవసరాలు ఉంటాయి. ఇదేమీ ఫ్యాక్టరీ కాదు కదా.. 8 గంటలు కూర్చుంటే గొప్ప సీన్ వచ్చేయడానికి.. కథను సృష్టించేటప్పుడు, దాని కోసం ఎంతైనా కష్టపడటానికి సిద్ధంగా ఉండాలి. దీన్ని ఒక ఇండస్ట్రీ స్టాండర్డ్‌గా మార్చడం చాలా కష్టం" అని రానా తేల్చి చెప్పాడు.
రోజులు పెరిగితే ఖర్చు తడిసి మోపెడవుతుంది: దుల్కర్
మలయాళ పరిశ్రమలో తక్కువ రోజుల్లో ఎక్కువ గంటలు పనిచేయడం మామూలేనని దుల్కర్ చెప్పాడు. తెలుగు పరిశ్రమలో తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ తాను ఆశ్చర్యపోయానని అన్నాడు.
"మలయాళంలో పని ఎప్పుడు పూర్తవుతుందో తెలియకుండా చేస్తూనే ఉంటాం. నేను మొదటిసారి తెలుగులో 'మహానటి' (2018) చేసినప్పుడు సాయంత్రం 6 గంటలకే ఇంటికి పంపించేవారు. నా కెరీర్‌లో అది మొదటిసారి. అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. తమిళంలో రెండో శనివారాలు సెలవు ఉంటుంది. కానీ ఒక నిర్మాతగా ఆలోచిస్తే.. అదనంగా ఒక రోజు షూటింగ్ చేయడం కంటే, ఒకే రోజు ఎక్కువ గంటలు పనిచేయడం చాలా తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది" అని దుల్కర్ అసలు లాజిక్ వివరించాడు.
ది గోట్ ప్రొడ్యూసర్ ఏమన్నదంటే?
'ది గోట్' (The GOAT) నిర్మాత అర్చన కళాపతి కూడా వీరితో ఏకీభవించింది. "సినిమాలో 9-5 జాబ్ అనేది అసాధ్యం. భారీ బడ్జెట్ చిత్రాలకు వడ్డీల భారం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే సెలవు రోజుల్లో కూడా షూటింగ్ చేయడానికి ఇష్టపడతాం" అని ఆమె అన్నారు. అయితే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు రిలీజ్ డేట్స్ విషయంలో కచ్చితంగా ఉండటం పరిశ్రమకు కొంత క్రమశిక్షణను తెచ్చిందని ఆమె పేర్కొన్నారు.
{{/usCountry}}'ది గోట్' (The GOAT) నిర్మాత అర్చన కళాపతి కూడా వీరితో ఏకీభవించింది. "సినిమాలో 9-5 జాబ్ అనేది అసాధ్యం. భారీ బడ్జెట్ చిత్రాలకు వడ్డీల భారం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే సెలవు రోజుల్లో కూడా షూటింగ్ చేయడానికి ఇష్టపడతాం" అని ఆమె అన్నారు. అయితే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు రిలీజ్ డేట్స్ విషయంలో కచ్చితంగా ఉండటం పరిశ్రమకు కొంత క్రమశిక్షణను తెచ్చిందని ఆమె పేర్కొన్నారు.
{{/usCountry}}రానా, దుల్కర్ కలిసి నిర్మించి, నటించిన 'కాంత' (Kaantha) మూవీ నవంబర్ 14న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దుల్కర్ త్వరలో తెలుగులో పవన్ సాదినేని దర్శకత్వంలో 'ఆకాశంలో ఒక తార', మలయాళంలో 'ఐ యామ్ గేమ్' చిత్రాల్లో నటిస్తుండగా.. రానా తమిళ చిత్రం 'పరాశక్తి'లో కనిపించనున్నాడు.