రణ్‌వీర్ సింగ్ లేెటెస్ట్ స్పై థ్రిల్లర్ దురంధర్ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కలెక్షన్ల మోత మోగిస్తోంది. రెండో వారంలోనూ ఈ చిత్రం రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. భారీ వసూళ్లతో రికార్డులు ఖాతాలో వేసుకుంటుంది. రెండో వారాంతం తర్వాతి వారపు రోజుల్లో కూడా ఈ రణ్‌వీర్ సింగ్ చిత్రం నిలకడగా కొనసాగుతోంది.
దురంధర్ కలెక్షన్లు

దురంధర్ మూవీ కలెక్షన్లలో కొత్త మైల్ స్టోన్లు అందుకుంటుంది. మంగళవారం (డిసెంబర్ 17) నాటికి దాదాపు ఎటువంటి క్షీణత లేకుండా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. దీంతో ఈ చిత్రం రికార్డు సమయంలో ఇండియాలోనే రూ.400 కోట్ల మార్కును అధిగమించింది. దురంధర్ తన రెండో వారాంతంలో భారతదేశంలో రూ.140 కోట్లకు పైగా నికర లాభాలను ఆర్జించింది. ఇది హిందీ చిత్రాలకు కొత్త రికార్డు.
మంగళవారం ఇలా
సోమవారం దురంధర్ చిత్రం రూ.29 కోట్లు జోడించింది. మంగళవారం కూడా ఇదే ఊపును కొనసాగించింది. 12వ రోజు సక్నిల్క్ నివేదిక ప్రకారం దురంధర్ ఇండియా లో సుమారు రూ.28.78 కోట్ల నెట్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. దీంతో దురంధర్ దేశీయ ఆదాయం రూ.410.03 కోట్లకు చేరుకుంది. ఆసక్తికరంగా సోమవారంతో పోలిస్తే మంగళవారం దురంధర్ వసూళ్లు మెరుగ్గా ఉన్నాయి. ఉదయం, మధ్యాహ్నం షోలలో ఆక్యుపెన్సీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇదే ఊపు కొనసాగిస్తే దురంధర్ తన మూడవ వీకెండ్ నాటికి రూ.500 కోట్ల నికర మార్కును చేరుకోవచ్చు.
ఈ రికార్డులు
దురంధర్ సినిమా కలెక్షన్లలో కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. దంగల్, సలార్, రోబో 2.0 లాంటి సినిమాలను దాటేసింది. రూ.400 కోట్ల నికర దేశీయ వసూళ్లను సాధించిన ఏడో చిత్రంగా దురంధర్ నిలిచింది. ఈ మార్కును మంగళవారం సాయంత్రం అధిగమించింది. ఆరు సంవత్సరాలకు పైగా బాలీవుడ్ దేశీయ వసూళ్ల రికార్డుగా ఉన్న దంగల్ రూ.387 కోట్ల మార్కును దురంధర్ దాటేసింది.
సలార్ ను దాటి
ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ (రూ.406 కోట్లు), రజనీకాంత్ రోబో 2.0 (రూ.407 కోట్లు) ఇండియా లైఫ్ టైమ్ నెట్ కలెక్షన్లను దురంధర్ దాటేసింది. దురంధర్ అనేది ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఒక స్పై థ్రిల్లర్. ఇందులో రణ్‌వీర్ సింగ్, పాకిస్తాన్లోని లియారీ గ్యాంగ్లలోకి చొరబడే భారతీయ గూఢచారి హమ్జా పాత్రలో నటించారు. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రలు పోషించారు. కథను ముగించే సీక్వెల్ మార్చి 19, 2026న విడుదల కానుంది.
{{/usCountry}}ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ (రూ.406 కోట్లు), రజనీకాంత్ రోబో 2.0 (రూ.407 కోట్లు) ఇండియా లైఫ్ టైమ్ నెట్ కలెక్షన్లను దురంధర్ దాటేసింది. దురంధర్ అనేది ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఒక స్పై థ్రిల్లర్. ఇందులో రణ్‌వీర్ సింగ్, పాకిస్తాన్లోని లియారీ గ్యాంగ్లలోకి చొరబడే భారతీయ గూఢచారి హమ్జా పాత్రలో నటించారు. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రలు పోషించారు. కథను ముగించే సీక్వెల్ మార్చి 19, 2026న విడుదల కానుంది.
{{/usCountry}}