...
...
Next Story

ఓటీటీలోకి రూ.110 కోట్ల బ్లాక్‌బస్టర్ రొమాంటిక్ మూవీ.. రెండు నెలల తర్వాత డిజటల్ ప్రీమియర్

ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ రొమాంటిక్ డ్రామా రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. బాక్సాఫీస్ దగ్గర రూ.110 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. వచ్చే వారం క్రిస్మస్ సందర్భంగా డిజిటల్ ప్రీమియర్ కానుంది.

Published on: Dec 18, 2025, 21:48:08 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

హర్షవర్ధన్ రాణే, సోనమ్ బజ్వా జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా 'ఏక్ దీవానే కీ దీవానియత్' డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ ఏడాది అక్టోబర్ 21న థియేటర్లలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 110 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా.. డిసెంబర్ 26 నుంచి జీ5 (ZEE5) లో స్ట్రీమింగ్ కానుంది.

ఏక్ దీవానే కీ దీవానియత్ ఓటీటీ రిలీజ్ డేట్

ఓటీటీలోకి రూ.110 కోట్ల బ్లాక్‌బస్టర్ రొమాంటిక్ మూవీ.. రెండు నెలల తర్వాత డిజటల్ ప్రీమియర్
ఓటీటీలోకి రూ.110 కోట్ల బ్లాక్‌బస్టర్ రొమాంటిక్ మూవీ.. రెండు నెలల తర్వాత డిజటల్ ప్రీమియర్

థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించి, బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన హిందీ రొమాంటిక్ డ్రామా 'ఏక్ దీవానే కీ దీవానియత్'. హర్షవర్ధన్ రాణే, పంజాబీ బ్యూటీ సోనమ్ బజ్వా జంటగా నటించిన ఈ ఇంటెన్స్ లవ్ స్టోరీ ఇప్పుడు మీ ఇంట్లోని స్క్రీన్లపై సందడి చేయడానికి రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 ఈ సినిమాను డిసెంబర్ 26న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

కలెక్షన్ల వర్షం.. ఇప్పుడు ఓటీటీలో..

మిలాప్ జవేరి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 110 కోట్లకు పైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌ను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. హర్షవర్ధన్, సోనమ్ బజ్వాలతో పాటు సచిన్ ఖేడేకర్, షాద్ రందవా తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఏక్ దీవానే కీ దీవానియత్ కథేంటంటే?

ఇదొక ఇంటెన్స్ రొమాంటిక్ డ్రామా. విక్రమాదిత్య (హర్షవర్ధన్) తన ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్ళే, ఎమోషనల్ గా అస్థిరంగా ఉండే వ్యక్తి. అటు అదా (సోనమ్) తన స్వేచ్ఛను, వ్యక్తిత్వాన్ని కోరుకునే ఇండిపెండెంట్ మహిళ.

థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా సంతోషంగా ఉన్నానని హర్షవర్ధన్ తెలిపాడు. అలాగే 2025లో తనకు ఇది మూడో హిందీ రిలీజ్ అని, ఈ సినిమాతో ఏడాదిని ముగించడం ఆనందంగా ఉందని సోనమ్ బజ్వా పేర్కొంది. ఈ ఏడాది హిందీలో అనూహ్య విజయం సాధించిన ఈ ఏక్ దీవానే కీ దీవానియత్ ఓటీటీలో మరింత ఆదరణ చూరగొంటుందని అంచనా వేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe