...
...
Next Story

EMI Movie Teaser: ముప్పుతిప్పలు పెట్టే ఈఎమ్ఐపై సినిమా- నవ్విస్తున్న టీజర్- సాయి కుమార్, డైరెక్టర్లతో పూజా కార్యక్రమం

EMI Movie Teaser Launch And Puja Ceremony: జనాలను ముప్పుతిప్పలు పెట్టే ఈఎమ్ఐలపై వచ్చిన తెలుగు సినిమా ఈఐఎమ్ఐ. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో విజయంతో జోరుమీదున్న 7 పీఎమ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న రెండో సినిమా ఇది. తాజాగా ఈఎమ్ఐ టీజర్ విడుదల చేయడంతోపాటు పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Published on: Sep 3, 2026, 14:16:09 IST
Advertisement

EMI Movie Teaser Launch And Puja Ceremony: మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతి నెలా ఒకటో తేదీ వచ్చిందంటే చాలు.. జీతం చేతికి అందకముందే ఈఎమ్‌ఐల మెసేజ్‌లు ఫోన్లలో మోగిపోతుంటాయి. బైక్, కారు, లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ నుంచి ఇంటి సామాగ్రి లేదా లోన్స్ వరకు అంతా ఈఎమ్‌ఐల మైకమే!

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో నిర్మాణ సంస్థ నుంచి

ముప్పుతిప్పలు పెట్టే ఈఎమ్ఐపై సినిమా- నవ్విస్తున్న టీజర్- సాయి కుమార్, డైరెక్టర్లతో పూజా కార్యక్రమం
ముప్పుతిప్పలు పెట్టే ఈఎమ్ఐపై సినిమా- నవ్విస్తున్న టీజర్- సాయి కుమార్, డైరెక్టర్లతో పూజా కార్యక్రమం

సరిగ్గా ఇదే పాయింట్‌ను నమ్ముకుని, నేటి తరం యువత జీవితాల్లోని కామెడీ, ఎమోషన్స్‌ను తెరపైకి తెచ్చేందుకు 7 పీఎమ్ ప్రొడక్షన్స్ శ్రీకారం చుట్టింది. 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' సినిమాతో టాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న ఈ నిర్మాణ సంస్థ నుంచి వస్తోన్న కొత్త చిత్రమే 'ఈఎమ్‌ఐ' (EMI).

ఈఎమ్ఐ పూజా కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు

ఈఎమ్ఐ సినిమాకు నిఖిల్ కువ్వరపు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈఎమ్ఐ సినిమా పూజా కార్యక్రమాలను గురువారం (సెప్టెంబర్ 3) అంటే నేడు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ హీరో, నటుడు సాయి కుమార్, డైరెక్టర్ సాయి మార్తాండ్, రాహుల్ శ్రీనివాస్ అతిథులగా హాజరయ్యారు.

నిర్మాతలుగా సందీప్ అగరం, అష్మిత రెడ్డి బాసాని

ఈఎమ్ఐ పూజ కార్యక్రమాల్లో భాగంగా ఈ మూవీ ముహూర్తపు సన్నివేశానికి ఆది సాయికుమార్ క్లాప్‌ కొట్టగా, డైరెక్టర్ సాయి మార్తాండ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్‌ను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 7 పీఎమ్ ప్రొడక్షన్ నంబర్ 2గా వస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ అగరం, అష్మిత రెడ్డి బాసాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కొత్త ప్రతిభకు పెద్దపీట.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్!

ప్రతీ నెలా ఈఎమ్‌ఐలు కట్టడానికి యువత పడే తిప్పలు, ఆ క్రమంలో ఎదురయ్యే సరదా సంఘటనలు, కుటుంబ భావోద్వేగాల మేళవింపుగా ఈ సినిమా కథ సాగుతుంది. ప్రతీ సగటు నగర జీవి తలుపు తట్టే కథాంశంతో, యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈఎమ్ఐ టీజర్ రిలీజ్

పూజా కార్యక్రం సందర్భంగా ఈఎమ్ఐ టీజర్ కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ చాలా ఫన్నీగా సాగింది. హీరోయిన్‌కు హీరో రైడోపై తీసుకెళ్తాడు. అప్పుడు హీరో వేసుకున్న షర్ట్, షూస్, షేడ్స్ ఒక్కోదాని ధర చూపిస్తారు. తర్వాత హీరోయిన్ చేస్తున్న ఆఫీస్‌లోనే మూడేళ్లుగా హీరో వర్క్ చేస్తుంటాడు.

మల్టిపుల్ జాబ్స్‌కి కారణం

ఇక్కడ వర్క్ చేసుకుంటూ రైడో ఎందుకు చేస్తున్నారని హీరోయిన్ అడిగితే.. వెనుకాల ఒకతను కనిపిస్తున్నాడ అని హీరో అడుగుతాడు. హీరోయిన్‌కు ఎవరు కనిపించరు. హీరోకు మాత్రం కనిపిస్తాడు. వాడు కనిపించినప్పుడు తెలుస్తుంది ఇలా అందరు మల్టిపుల్ జాబ్స్ ఎందుకు చేస్తున్నారో అని చెప్పేసి వెళ్లిపోతాడు హీరో

ప్రతి ఒక్కరిని వెంటాడే ఈఎమ్ఐ

అప్పుడే ఆ వ్యక్తిని ఈఎమ్ఐగా చూపిస్తారు. అంటే, ప్రతి ఒక్కరిని ఈఎమ్ఐ వెంటూడుతుందని, అందుకోసం రెండు, మూడు ఫుల్ టైమ్ జాబ్స్ చేయాల్సి వస్తుందని చాలా ఫన్నీగా, ఇంట్రెస్టింగ్‌గా ఈఎమ్ఐ టీజర్‌లో చూపించడం ఆకట్టుకుంటోంది. టీజర్ ఫన్నీగా సాగుతునే డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి.

వరుస సినిమాలతో 7 పీఎమ్ ప్రొడక్షన్స్ భారీ ప్లాన్స్

పరిమిత బడ్జెట్‌లో నాణ్యమైన కంటెంట్‌తో సినిమాలు తీస్తూ టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేస్తోంది 7 పీఎమ్ ప్రొడక్షన్స్. 'ఈఎమ్‌ఐ' చిత్రంతో పాటు, 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో భారీ చిత్రాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేలా

కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తామని నిర్మాతలు వెల్లడించారు. ఈ చిత్రానికి మాధవ్ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ఫహాద్ అబ్దుల్ మజీద్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe