Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌లో క్రేజీ మిస్టరీ అడ్వెంచర్ ఫ్రాంచైజీలలో ‘ఎనోలా హోమ్స్’ ఒకటి. షెర్లాక్ హోమ్స్ సోదరిగా ఎనోలా చేసే సాహసాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సిరీస్ నుంచి మూడో పార్ట్ ‘ఎనోలా హోమ్స్ 3’ సరికొత్త మిస్టరీతో ఓటీటీలోకి వచ్చేసింది. డైరెక్ట్ గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది.
ఎనోలా హోమ్స్ ఓటీటీ

మిస్టరీ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘ఎనోలా హోమ్స్’లో మూడో పార్ట్ ఓటీటీలోకి వచ్చేసింది. బుధవారం (జూలై 1) నుంచి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో డిజిటల్ ఆడియన్స్ కోసం అందుబాటులోకి వచ్చింది.
ఆగిపోయిన పెళ్లి.. షెర్లాక్ కిడ్నాప్
ఈ మూడో భాగం కథ ఎనోలా హోమ్స్ జీవితంలో ఒక కీలక మలుపుతో ప్రారంభమవుతుంది. ఎనోలా హోమ్స్, లార్డ్ ఎర్నెస్ట్ ట్యూక్స్‌బరీల వివాహానికి సర్వం సిద్ధమవుతుంది. అయితే, పెళ్లి పీటల మీదకు వెళ్లే ముందు ఎనోలా తన ‘హోమ్స్’ గుర్తింపును కోల్పోతాననే ఆందోళనకు గురవుతుంది.
షాకింగ్ ట్విస్ట్
ఈ తరుణంలోనే షెర్లాక్ హోమ్స్ పార్ట్ నర్ డాక్టర్ జాన్ వాట్సన్ వచ్చి ఎనోలాను కలుస్తాడు. మోస్ట్ టాలెంటెడ్ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ కిడ్నాప్ అయ్యాడనే షాకింగ్ నిజాన్ని చెప్తాడు. ఆ కిడ్నాప్ మిస్టరీ ఛేదించేందుకు ఎనోలా రంగంలోకి దిగుతుంది.
షెర్లాక్ తనకోసం వదిలివెళ్లిన కొన్ని రహస్య నోట్‌బుక్స్ ఆధారంగా ఎనోలా ఎంక్వైరీ చేస్తుంది. ఈ విచారణ ఆమెను మాల్టా దేశానికి తీసుకెళ్తుంది. అక్కడ బ్రిటిష్ పాలన నుంచి మాల్టాను విడిపించేందుకు జరిగే స్థానిక ఉద్యమం, దాని వెనుక ఉన్న వలసరాజ్య సైనిక కుట్రలు, రాజకీయ వ్యూహాలను ఎనోలా ఎదుర్కోవాల్సి వస్తుంది.
పాత శత్రువు రీ-ఎంట్రీ
ఎనోలా హోమ్స్ పార్ట్ 3లో పాత శత్రువుతో ఎనోలా తలపడాల్సి వస్తుంది. ఈ భారీ అంతర్జాతీయ నేర సామ్రాజ్యం వెనుక ‘మొరియార్టీ’ ఉన్నట్లు ఎనోలా గుర్తిస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది. షెర్లాక్ ను ఎనోలా కాపాడిందా? లేదా? అనేది సినిమాలో చూడాల్సిందే.
పవర్ఫుల్ పాత్రలు!
{{/usCountry}}ఎనోలా హోమ్స్ పార్ట్ 3లో పాత శత్రువుతో ఎనోలా తలపడాల్సి వస్తుంది. ఈ భారీ అంతర్జాతీయ నేర సామ్రాజ్యం వెనుక ‘మొరియార్టీ’ ఉన్నట్లు ఎనోలా గుర్తిస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది. షెర్లాక్ ను ఎనోలా కాపాడిందా? లేదా? అనేది సినిమాలో చూడాల్సిందే.
పవర్ఫుల్ పాత్రలు!
{{/usCountry}}ఫిలిప్ బరంటిని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎనోలా హోమ్స్ పార్ట్ 3 చిత్రంలో పాత తారాగణంతో పాటు కొత్త క్యారెక్టర్లు కూడా సందడి చేశాయి. యాక్షన్, మైండ్ గేమ్స్, లవ్ అండ్ ఎమోషన్ కలగలిసిన ‘ఎనోలా హోమ్స్ 3’ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ మిస్టరీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇంకెందుకు లేటు మీరూ ఓ లుక్కేయండి.