Epic OTT: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో వచ్చిన సరికొత్త రొమాంటిక్ డ్రామా మూవీ 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' (Epic – First Semester) ఓటీటీ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్, థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల్లోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెడుతోంది.
ఎపిక్ ఓటీటీ రిలీజ్ డేట్

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ ఎపిక్ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. అక్టోబర్ 9 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కానుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం మరో మూడు రోజుల్లోనే వీక్షకులకు అందుబాటులోకి రాబోతోంది.
స్టోరీ ఏంటంటే?
ఎపిక్ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన రోహన్ అనే విద్యార్థి చుట్టూ స్టోరీ తిరుగుతుంది. కుటుంబ సభ్యుల కోరికలు, వారి అంచనాల కోసం అతను లండన్‌కు ఉన్నత చదువుల కోసం వెళ్తాడు. సరికొత్త వాతావరణంలో అడుగుపెట్టిన ఆ యువకుడికి అక్కడ కడలి అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది.
ఈ కొత్త ప్రపంచంలో రోహన్ ఎదుర్కొన్న ప్రేమ, స్నేహం, అనుబంధాలు, తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకునే క్రమంలో ఎదురైన సంఘర్షణల సమాహారమే ఈ చిత్రం. విదేశీ క్యాంపస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో యువత ఆలోచనలు, భావోద్వేగాలు, నేటి తరం రిలేషన్‌షిప్స్ లోని సున్నితమైన అంశాలను చూపించారు.
యూత్ కు కనెక్ట్ అయ్యేలా
'90s మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్‌తో భారీ గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ ఈ ఎపిక్ చిత్రానికి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. థియేటర్లలో మిస్ అయిన వారు అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో హ్యాపీగా వీక్షించవచ్చు.
{{/usCountry}}'90s మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్‌తో భారీ గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ ఈ ఎపిక్ చిత్రానికి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. థియేటర్లలో మిస్ అయిన వారు అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో హ్యాపీగా వీక్షించవచ్చు.
{{/usCountry}}ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఆల్రెడీ బేబీ మూవీతో హిట్ పెయిర్ అనిపించుకున్నారు. ఈ ఎపిక్ మూవీలోని వీళ్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందనే టాక్ ఉంది. యూత్ కు, ముఖ్యంగా విదేశాలకు చదువుల కోసం వెళ్లేవాళ్లకు బాగా కనెక్ట్ అయ్యే మూవీ ఇది. ఇందులో రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయి. ఈ వీకెండ్ కు యూత్ పీపుల్ కు ఓటీటీలో ఇది మస్ట్ వాచ్ మూవీ అని చెప్పొచ్చు.