Etv: తెలుగు టెలివిజన్ రంగంలో ఆదివారం నాన్-ఫిక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో టీఆర్‌పీ (TRP Ratings) పోరు సరికొత్త మలుపు తిరిగింది. గత కొన్ని నెలలుగా జీ తెలుగు, స్టార్ మా ఛానళ్లు తమ ఈవెంట్లు, డ్యాన్స్ అండ్ రియాలిటీ షోలతో ఆదివారం ప్రైమ్‌టైమ్‌ను శాసిస్తుండగా, దానికి బలమైన పోటీ ఇచ్చేందుకు ఈటీవీ (ETV) సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. తమ ప్రధాన ప్రోగ్రామ్‌ల టైమింగ్స్, యాంకర్లు, కాన్సెప్ట్‌లను మారుస్తూ నెట్‌వర్క్ నిర్ణయం తీసుకుంది.
రష్మి స్థానంలో ప్రదీప్ మాచిరాజు

ఆదివారం మధ్యాహ్నం 1:00 గంటకు ప్రసారమయ్యే పాపులర్ షో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' (Sridevi Drama Company) లో మేకర్స్ ఊహించని చేంజ్ చేశారు. ఇప్పటివరకు యాంకర్‌గా వ్యవహరించిన రష్మి గౌతమ్ (Rashmi Gautam) స్థానంలో స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) వచ్చాడు. తనదైన కామెడీ టైమింగ్, వన్-లైనర్లతో ఒంటిచేత్తో షోను నడిపించగల ప్రదీప్ రాకతో మధ్యాహ్నం స్లాట్‌లో షో టీఆర్‌పీ భారీగా పుంజుకునే అవకాశం ఉంది.
హైపర్ ఆది రీ-ఎంట్రీ
ఇన్నాళ్లూ వారంలో శుక్ర, శనివారాల్లో రాత్రి వేళల్లో అలరించిన కల్ట్ కామెడీ షో 'జబర్దస్త్' (Jabardasth) ను ఈటీవీ ప్రైమ్‌టైమ్ స్లాట్‌కు మార్చింది. ప్రతీ ఆదివారం సాయంత్రం 6:00 గంటలకు 'జబర్దస్త్' ప్రసారం కానుంది. ఈ స్లాట్ మార్పునకు తోడు, స్టార్ కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi) మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వడం ఈ షోకు అతిపెద్ద ప్లస్ పాయింట్. ఆది మార్క్ పొలిటికల్ అండ్ కరెంట్ అఫైర్స్ పంచ్‌లు ఫ్యామిలీ ఆడియన్స్‌ను స్క్రీన్లకు కట్టిపడేసేలా ప్లాన్ చేశారు.
ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2
రాత్రి 7:30 గంటల ప్రైమ్‌టైమ్ స్లాట్‌లో 'ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2' (Family Stars Season 2) ను లాంచ్ చేస్తున్నారు. ఈ షోకు సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. సుధీర్‌కు ఉన్న బుల్లితెర మాస్ ఫాలోయింగ్ దృష్ట్యా, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, సెలబ్రిటీల హంగామాతో సండే నైట్ వ్యూయర్షిప్ను తమవైపు తిప్పుకోవాలని ఈటీవీ భావిస్తోంది.
మాస్టర్ ప్లాన్
{{/usCountry}}రాత్రి 7:30 గంటల ప్రైమ్‌టైమ్ స్లాట్‌లో 'ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2' (Family Stars Season 2) ను లాంచ్ చేస్తున్నారు. ఈ షోకు సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. సుధీర్‌కు ఉన్న బుల్లితెర మాస్ ఫాలోయింగ్ దృష్ట్యా, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, సెలబ్రిటీల హంగామాతో సండే నైట్ వ్యూయర్షిప్ను తమవైపు తిప్పుకోవాలని ఈటీవీ భావిస్తోంది.
మాస్టర్ ప్లాన్
{{/usCountry}}ఈటీవీ చేపట్టిన ఈ స్లాట్ చేంజ్, ఆర్టిస్టుల ఛేంజ్ వెనుక పక్కా టెలివిజన్ వ్యూహం కనిపిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఛానల్‌కే లాక్ చేసేందుకు ప్రదీప్, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ అనే బలమైన ముగ్గురు ఫేస్‌లను ఒకే లైన్‌అప్‌లోకి తేవడం మాస్టర్ ప్లాన్. పోటీ ఛానళ్లలోని సీరియల్స్, సినిమాలకు చెక్ పెడుతూ ఈటీవీ వ్యూహం రాబోయే వారాల్లో సండే టీఆర్‌పీ చాట్స్‌ను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో చూడాలి.