...
...
Next Story

ఈ మూడు రోజుల్లో సస్సెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఫ్రీ స్ట్రీమింగ్.. మిస్టరీ కనిపెడితే ఐఫోన్ 17.. ఓటీటీ బంపరాఫర్

ఓటీటీ లవర్స్ కు ఈటీవీ విన్ ప్లాట్ ఫామ్ బంపర్ ఆఫర్ కల్పిస్తోంది. సస్సెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను ఫ్రీగా చూసే ఛాన్స్ ఇవ్వడమే కాకుండా మిస్టరీ కనిపెడితే ఐఫోన్ 17 గిఫ్ట్ గా ఇస్తామని అనౌన్స్ చేసింది.

Published on: Oct 23, 2025, 10:30:03 IST
Advertisement

వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు, సిరీస్ లతో దూసుకెళ్తోంది ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్. ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్ లతో తనదైన మార్క్ చూపిస్తోంది. ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఇప్పుడు ఓ బంపరాఫర్ కల్పిస్తోంది. ఇందులో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ ను ఫ్రీగా చూడటంతో పాటు ఐఫోన్ 17 గెలచుకునే ఛాన్స్ ఇస్తోంది.

ఓటీటీ సిరీస్ ఫ్రీ

ఈటీవీ విన్ ఆఫర్ (x/etvwin)
ఈటీవీ విన్ ఆఫర్ (x/etvwin)

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్న ఈ సిరీస్ ఆడియన్స్ ను బాగా ఎంగేజ్ చేసింది. ఆగస్టు 14 నుంచి ఈ సిరీస్ ఈటీవీ విన్ లో అందుబాటులో ఉంది. వర్ష బొల్లమ్మ కీ రోల్ పోషించిన ఈ సిరీస్ కు ప్రశాంత్ కుమార్ డైరెక్టర్. ఇప్పుడు ఓటీటీలో ఈ సిరీస్ ను ఫ్రీగా చూడొచ్చు.

మూడు రోజులు

మిస్టరీ థ్రిల్లర్ కానిస్టేబుల్ కనకం సిరీస్ ను మూడు రోజుల పాటు ఫ్రీగా చూసే అవకాశాన్ని ఈటీవీ విన్ కల్పిస్తుంది. అక్టోబర్ 24, 25, 26 తేదీల్లో కానిస్టేబుల్ కనకం సిరీస్ సీజన్ 1ను ఫ్రీగా చూడొచ్చు. అంతే కాకుండా ఈ సిరీస్ చూసిన వాళ్లు ఐఫోన్ 17 గెలుచుకునే అవకాశమూ ఉంది. ఓటీటీని షేక్ చేసిన సిరీస్ ను ఫ్రీగా చూడడంతో పాటు ఐఫోన్ దక్కించుకునే ఛాన్స్ కూడా రావడమంటే బంపర్ ఆఫర్ అన్నట్లే.

ఐఫోన్ 17

సిరీస్ చూసిన వాళ్లు చంద్రికకు ఏమైంది? అనే తమ థియరీని ఎక్స్, ఇన్ స్టాగ్రామ్ లో ఈటీవీ విన్ అకౌంట్ కు డైరెక్ట్ గా మెసేజ్ చేయాలి. ఆ థియరీ కరెక్ట్ అయితే ఐఫోన్ 17 దక్కించుకోవచ్చు.

కానిస్టేబుల్ కనకం కథ

కనక మహాలక్ష్మి కానిస్టేబుల్ గా చేరిన ఊర్లో అమ్మాయిలు వరుసగా మిస్ అవుతుంటారు. ఆ అడవిలోకి ఎవరినీ వెళ్లకుండా చూసుకుంటారు. కానీ తన ఫ్రెండ్ చంద్రిక మిస్సింగ్ తో కనకం సవాళ్లను దాటి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. తన తల్లి ఆత్మను అమ్మాయిలోకి ప్రవేశపెట్టాలని చూసే మాంత్రికుణ్ని కనిపెడుతుంది. మరి ఆ మాంత్రికుడు ఎవరు? చంద్రిక ఏమైంది? అన్నది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks