...
...
Next Story

తేరే ఇష్క్ మేలో అదిరే యాక్టింగ్.. లేడీ అర్జున్ రెడ్డిలా.. అలియా కంటే కృతి సనన్ బెటర్ అంటూ ఇంటర్నెట్ లో రచ్చ

'తేరే ఇష్క్ మే' సినిమాలో ధనుష్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో కృతి సనన్ యాక్టింగ్ అదిరిపోయింది. అన్ని వైపుల నుంచి మంచి ప్రశంసలు దక్కతున్నాయి. కొంతమంది ఏమో అలియా కంటే కృతి సనన్ బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Published on: Nov 30, 2025, 15:19:31 IST
Advertisement

ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ డ్రామా సినిమా ‘తేరే ఇష్క్ మే’. ఇందులో ధనుష్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా శుక్రవారం (నవంబర్ 28) థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా హీరోయిన్ కృతి సనన్ సినిమాలో తన ముక్తి పాత్రలో నటనకు ప్రశంసలు అందుకుంటోంది.

అలియా కంటే బెటర్

అలియా భట్ కంటే కృతి సనన్ బెటర్ అంటూ కామెంట్లు
అలియా భట్ కంటే కృతి సనన్ బెటర్ అంటూ కామెంట్లు

తేరే ఇష్క్ మేలో కృతి సనన్ యాక్టింగ్ అదరగొట్టిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. లేడీ అర్జున్ రెడ్డిలా చేసిందంటున్నారు. అదే సమయంలో అలియా భట్ కంటే కృతి సనన్ బెటర్ హీరోయిన్ అని కూడా అంటున్నారు. 'తేరే ఇష్క్ మే' చూసిన ఒక ఎక్స్ యూజర్.. కృతికి బాలీవుడ్‌లో మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

నెపో కిడ్స్

'కృతి సనన్ కు ఇలాంటి గొప్ప అవకాశాలు వస్తే, ఆమె ఆలియా కంటే కచ్చితంగా మెరుగైన నటి అని తెలుస్తుంది' అని ఓ యూజర్ రాశారు. దక్షిణాది నుంచి వచ్చిన మరో అభిమాని కూడా దీనితో ఏకీభవిస్తూ.. 'మేము సౌత్ ఇండియన్ ప్రజలం ఎప్పుడూ కృతిసనన్ ను ఇతరులతో పోలిస్తే గొప్ప నటిగా అంగీకరిస్తాము. నెపో కిడ్స్ అసలైన ప్రతిభావంతులైన నటుల మార్గాన్ని అడ్డుకుంటున్నారు' అని ఘాటుగా వ్యాఖ్యానించారు. 'ఖచ్చితంగా. దురదృష్టవశాత్తు ఆమెకు ఆలియా లాగా కంటిన్యూ ఛాన్స్ లు రాలేదు' అని మరొకరు పేర్కొన్నారు.

స్క్రీన్ ప్రెజెన్స్

కృతి సనన్ రియాక్షన్

తేరే ఇష్క్ మేలో యాక్టింగ్ కు గాను వస్తున్న ప్రశంసలపై కృతి సనన్ రియాక్టయింది. ఇటీవల ఒక ట్రేడ్ అనలిస్ట్‌కు ప్రతిస్పందిస్తూ.. 'మీ ప్రశంసలకు ధన్యవాదాలు. నా అభిప్రాయం ప్రకారం.. మీరు నిరంతరం నేర్చుకుంటూ ఎదగకపోతే మీరు బాగా జీవిస్తున్నట్లు కాదు. కేవలం జీవితాన్ని గడుపుతున్నట్లు. మిమ్మల్ని మీరు సవాలు చేసుకోవడం ఉత్సాహంగా ఉంటుంది. అది మంటను రాజేస్తూనే ఉంటుంది’’ అని కృతి సనన్ పేర్కొంది.

థ్యాంక్ యూ

కృతి సనన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా.. 'నా హృదయం నిండిపోయింది.. ఒక నటికి ఉత్తమ అనుభూతి ఏమిటంటే, ప్రేక్షకులు మీ పాత్రలో చెప్పని మాటల్లోని ప్రతి చిన్న భావోద్వేగంతో కనెక్ట్ అయినప్పుడు. ముక్తి బహుశా నేను పోషించిన అత్యంత లోతైన, గమ్మత్తైన పాత్ర. ఆమె హృదయం ప్రతి బీట్ మీకు చేరినప్పుడు, అది ఇష్క్ అవుతుంది. ఈ ఇష్క్ అంతటికీ ధన్యవాదాలు' అని రాసింది.

తేరే ఇష్క్ మే గురించి

శంకర్ (ధనుష్), ముక్తి (కృతి)ల అల్లరి ప్రేమకథను చెబుతుంది తేరే ఇష్క్ మే సినిమా. వీరు పూర్తి విరుద్ధ స్వభావాలు కలిగి ఉన్నప్పటికీ ప్రేమలో పడతారు. ఈ చిత్రం రెండు రోజుల్లో భారతదేశంలో రూ. 33 కోట్లు నెట్ వసూలు చేసింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks